Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

పార్టీ ఆవిర్భావ దినోత్సవాన జగన్ కీలక నిర్ణయం - ఇక నుంచి..!!

మాజీ సీఎం జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. పార్టీ ఆవిర్భావ వేడుకల్లో జగన్ పాల్గొన్నారు. పార్టీ జెండా ఆవిష్కరించి తమ లక్ష్యాలను స్పష్టం చేసారు. పార్టీ ప్రతిపక్షంలో కూర్చోవటం కొత్త కాదని చెప్పుకొచ్చారు. ప్రజల కోసం ఏర్పడిన పార్టీ.. వాయిస్ ఆఫ్ వాయిస్ లెస్ గా నిలుస్తుందని స్పష్టం చేసారు. తొమ్మది నెలల కాలంలో కూటమి ప్రభుత్వం పైన ప్రజల్లో ఏర్పడిన అభిప్రాయం గురిం చి వివరించారు. పార్టీకి కార్యకర్తలే బలమని పేర్కొన్నారు. ఎల్లప్పుడూ ప్రజల వెంటే ఉంటామని..
ప్రజల తరపు పోరాడుతామని ప్రకటించారు.

వైసీపీ ఆవిర్భావ వేడకలు
వైసీపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న జగన్ పార్టీ జెండా ఆవిష్కరించారు. పార్టీ ఏర్పాటుకు కారణాలను జగన్ వివరించారు. 15 ఏళ్ల పార్టీ ప్రస్థానంలో ఎన్నో విపత్కర పరిస్థితులను ఎదుర్కొ న్నామని గుర్తు చేసారు. వైఎస్సార్సీపీకి ప్రతిపక్షంలో ఉండటం కొత్త కాదన్నారు. తొమ్మది నెలల కూటమి పాలన పైన ప్రజల్లో వ్యతిరేకత పెరిగిందని చెప్పారు. వైసీపీ తొలి నుంచి విలువలతో రాజకీయాలు చేస్తుందని చెప్పారు. ప్రతీ కార్యకర్త తమ పార్టీ అధికారంలోకి వస్తే చెప్పిన ప్రతీ మాట నిలబెట్టుకుందని చెప్పుకునే విధంగానే వ్యవహరించామని చెప్పుకొచ్చారు. ప్రతీ వైసీపీ కార్యకర్త ఏ ఇంటికి అయినా వెళ్లచ్చని.. ఎవరికైనా తమ కారణంగా జరిగిన మంచి గురించి చెప్పకునే అవకాశం ఉందని పేర్కొన్నారు.

YS Jagan key announcement on party action plan attends YSRCP formation day celebrations

ప్రజల పక్షానే
వైసీపీ ఎప్పుడూ అధికారంలో ఉన్నా.. ప్రతిపక్షంలో ఉన్నా ప్రజలకు అండగా ఉంటుందని, ప్రజా సమస్యలపై పోరాడుతూనే ఉంటుందని జగన్ స్పష్టం చేసారు. ప్రజల కష్టాల నుంచి వైసీపీ పుట్టు కొచ్చిందని చెప్పారు. ప్రజల కష్టాలను తన కష్టాలుగా భావించి పోరాడుతోందన్నారు. అధికారంలో ఉన్నవాళ్లకు ఎప్పటికప్పుడు ధీటైన సమాధానమే ఇస్తున్నామన్నారు. ప్రజా సమస్యలపై పోరాడు తూనే ఉంటామని జగన్ ప్రకటించారు. వచ్చే ఎన్నికల్లో తిరిగి అధికారంలోకి వచ్చేది వైసీపీ నేనని జగన్ ధీమా వ్యక్తం చేసారు. పార్టీ కోసం నిరంతరం శ్రమిస్తున్న వారిని జగన్ అభినందించారు. ఇక, పార్టీ నిర్ణయించిన విధంగా ఫీజు రీయంబర్స్ మెంట్, విద్యార్ధులకు చెల్లించాల్సి బకాయిల పైన ఈ రోజు వైసీపీ నిరసనల నిర్వహణకు నిర్ణయించింది.

వైసీపీ పోరుబాట
వైసీపీ ప్రభుత్వ హయాంలో విద్యార్ధులకు చెల్లించాల్సిన ఫీజు రీయంబర్స్ మెంట్, వసతి దీవెన ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో బకాయిలు పెట్టారని జగన్ ఆరోపించారు. యువతకు ఇచ్చిన ఏ ఒక్క హామీ అమలు చేయటం లేదని విమర్శించారు. అందరినీ మభ్య పెట్టే ప్రకటనలతో మోసం చేసారని జగన్ దుయ్యబట్టారు. ప్రతీ విద్యార్ధికి అండగా వైసీపీ నిలుస్తుందని హామీ ఇచ్చారు. ప్రజల పక్షాన పోరాటానికి పార్టీ శ్రేణులంతా సమాయత్తం కావాలని జగన్ పిలుపునిచ్చారు. ఇదే సమయంలో పార్టీ ముఖ్య నేతలతో సమావేశమైన జగన్.. తన జిల్లాల పర్యటన గురించి చర్చ చేసినట్లు సమాచారం. ఈ నెలాఖరులోగా జిల్లాల అధ్యక్షుల నియామకం పూర్తి చేయటంతో పాటుగా .. ప్రజలతో మమేకం అయ్యే కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాలని నిర్ణయించారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+