బైరెడ్డికి జగన్ బంపరాఫర్, ఎన్నికల బరిలోకి - నియోజకవర్గం ఫిక్స్..!!
ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. వచ్చే ఎన్నికల కోసం అటు కూటమి పార్టీలు.. ఇటు వైసీపీ ప్రణాళికలు సిద్దం చేస్తున్నాయి. జగన్ మరోసారి గెలిస్తే ఏపీకి నష్టం జరుగుతుందని ఇప్పటికే కూటమి నేతలు ప్రచారం మొదలు పెట్టారు. తామే తిరిగి అధికారంలోకి వస్తామని జగన్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇదే సమయంలో కూటమి ముఖ్య నేతల నియోజక వర్గాల పైన జగన్ ఫోకస్ చేసారు. ఈ సారి యువ నేతలకు ప్రాధాన్యత ఇవ్వాలని భావిస్తున్న జగన్.. తాజాగా బైరెడ్డి సిద్దార్ధ రెడ్డికి కీలక హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది.
వైసీపీ యువ నేత బైరెడ్డి సిద్దార్ధ రెడ్డికి మాజీ సీఎం జగన్ నుంచి కీలక హామీ దక్కింది. గత ఎన్నికల సమయంలోనే బైరెడ్డి పోటీ చేయాలని భావించారు. అయితే, అప్పటికే సిట్టింగ్ ఎమ్మెల్యేలు.. సామాజిక సమీకరణాలతో సాధ్యం కాలేదు. ఇక.. 2024 ఎన్నికల్లో ఓటమి నుంచి బైరెడ్డి పార్టీ వాయిస్ బలంగా వినిపిస్తున్నారు. వైసీపీ హయాంలో శాప్ ఛైర్మన్ గా బైరెడ్డి నామినేటెడ్ పదవిలో కొనసాగారు. ఇక ఆడుదాం ఆంధ్రా పథకంలో అవినీతి జరిగిందని.. బైరెడ్డి పైన కూటమి నేతలు ఆరోపణలు చేసారు. సీమ ప్రాంతంలో.. వైసీపీ యువతలో బైరెడ్డికి ఉన్న ఫాలోయింగ్ ను పూర్తిగా సద్వినియోగం చేసుకోవాలని జగన్ డిసైడ్ అయ్యారు. అందులో భాగంగా కీలక నిర్ణయం తీసుకున్నారు.

తాజాగా జగన్ తో బైరెడ్డి సమావేశమయ్యారు. రాష్ట్ర వ్యాప్తంగా యువతతో సమావేశాలు ఏర్పాటు చేయాలని... ప్రతీ ఒక్కరినీ పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరించేలా పని చేయాలని బైరెడ్డికి జగన్ సూచించారు. దీంతో.. బైరెడ్డి కొంత కాలంగా పార్టీ కార్యక్రమాల్లో యాక్టివ్ గా పాల్గొంటున్నారు. కూటమి నేతలను టార్గెట్ చేస్తున్నారు. రాజమండ్రి జైలులో ఉన్న ఎంపీ మిథున్ రెడ్డిని బైరెడ్డి పరామర్శించిన సమయంలో కీలక వ్యాఖ్యలు చేసారు. జగన్ ను తాను వదిలిపెట్టే ప్రసక్తిలేదని, కేసులకు భయపడపోనని కూడా ఆయన అంటున్నారు. బైరెడ్డి అసెంబ్లీకి పోటీ చేయాలనే ఆలోచనతో ఉన్నారు. అయితే, జగన్ మాత్రం నంద్యాల లోక్ సభ స్థానం పైన ఫోకస్ చేయాలని సూచన చేసినట్లు తెలుస్తోంది. నంద్యాల జిల్లాలో పార్టీ బలోపేతం పైన ఎక్కువగా సమయం కేటాయించాలని సూచించినట్లు సమాచారం.
ఉమ్మడి కర్నూలు జిల్లాలో వైసీపీకి అన్ని నియోజకవర్గాల్లోనూ సీనియర్ నేతలు ఉన్నారు. కాగా, సమీకరణాలు కీలకంగా మారుతున్నాయి. నంద్యాలలో శిల్పా రవిచంద్రారెడ్డి.. శ్రీశైలంలో పోటీ చేయాలన్నా అక్కడ శిల్పా చక్రపాణిరెడ్డి ఉన్నారు. పాణ్యంకు వెళ్లాలంటే అక్కడ సీనియర్ నేత కాటసాని రాంభూపాల్ రెడ్డి ఉన్నారు. నంద్యాల పార్లమెంటు నియోజకవర్గంలోనూ పోచా బ్రహ్మానందరెడ్డి ఉన్నారు. ఆయనకు పార్టీ అధికారంలోకి వస్తే రాజ్యసభకు పంపుతామని జగన్ హామీ ఇచ్చి నంద్యాల పార్లమెంటు స్థానాన్ని బైరెడ్డి సిద్ధార్థ రెడ్డికి ఇచ్చేందుకు అంగీకరించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం తన సోదరి బైరెడ్డి శబరి నంద్యాల పార్లమెంటుకు టీడీపీ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. దీంతో.. జగన్ హామీ మేరకు బైరెడ్డి మరింతగా పార్టీ కోసం యాక్టివ్ అయ్యే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.
-
షర్మిల ఆరోపణలపై జగన్ మౌనం వెనుక, అసలు విషయం బయట పెట్టిన కొడాలి నాని..!! -
కవిత కొత్త పార్టీకి ముహూర్తం ఫిక్స్.. రామయ్య ఆశీస్సులతో.. -
కేంద్రానికి కవిత షాకింగ్ అల్టిమేటం.. ఆ విషయంలో పోరాటమే! -
Janasena: టీడీపీ తీరుపై రగులుతున్న జనసేన ఎమ్మెల్యేలు ? ఇవాళ పవన్ ముందే..! -
Tamil Nadu Survey: తాజా సర్వేలో బీజేపీకి భారీ షాక్- గెలిచేది మాత్రం వీరే..? -
బెంగాల్ టైగర్ ఎవరో తేల్చేసిన సర్వేలు.. దీదీ మళ్లీ సీఎం అవుతారా? -
Viral Video: ముస్లింలకు పోటీగా మాధవీలత పూజలు..! వీడియో వైరల్..! -
తమిళనాడులో NDA సీట్ల పంపకాల్లో బిగ్ ట్విస్ట్, లేలెస్ట్ సర్వే ఎఫెక్ట్ - ఎవరికెన్ని..!! -
ఆసుపత్రిలో సోనియా గాంధీ అడ్మిట్: హుటాహుటిన రాహుల్, ప్రియాంక: అబ్జర్వేషన్ లో -
దానం నాగేందర్‌కు బిగ్ షాక్.. అనర్హత వేటుపై అనూహ్య ట్విస్ట్..!! -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం












Click it and Unblock the Notifications