పోలవరంతో పాటు ప్రాధాన్యతా ప్రాజెక్టులపై జగన్ సమీక్ష- అధికారులకు కీలక ఆదేశాలు...
రాష్ట్రంలో పెండింగ్ లో ఉన్న నీటిపారుదల ప్రాజెక్టులపై సీఎం జగన్ ఇవాళ క్యాంపు కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. తాజా పరిస్ధితిని అధికారుల్ని అడిగి తెలుసుకున్నారు. వర్షాకాలం మొదలుకానున్న తరుణంలో ప్రాజెక్టుల నిర్మాణంలో ఇబ్బందులు ఎదురుకాకుండా అధికారులకు తగు సూచనలు చేశారు. అలాగే ప్రాజెక్టులు త్వరగా పూర్తి చేసేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు కూడా ఇచ్చారు.
పోలవరం ప్రాజెక్టు నిర్మాణ గడువు సమీపిస్తున్న కొద్దీ లెఫ్ట్ మెయిన్ కెనాల్‌పై కూడా దృష్టిపెట్టాలని సీఎం జగన్ ఆదేశించారు. ఈసీఆర్‌ఎఫ్ డ్యాం నిర్మాణ ప్రాంతంలో పనులు చురుగ్గా సాగుతున్నాయని అధికారులు తెలిపారు. ఈసీఆర్ఎఫ్ డ్యాం గ్యాప్-1లో శాండ్ ఫిల్లింగ్, వైబ్రోకాంపాక్షన్ పనులు పూర్తయ్యాయన్నారు. గ్యాప్-2 పనులు కూడా చురుగ్గా సాగుతున్నాయన్నారు. కేంద్ర జలశక్తి శాఖ, కేంద్ర జలమండలి అధికారులు గైడ్ బండ్‌లో కుంగిన ప్రాంతాన్ని పరిశీలించారని, నేల స్వభావంలో మార్పుల కారణంగా ఇది జరిగి ఉండొచ్చని అనుమానాన్ని కమిటీ వెల్లడించిందన్నారు.

దెబ్బతిన్న ప్రాంతాన్ని రాక్ డంప్‌తో, సిమెంట్ స్లర్రీతో నింపాలని, గేబియన్స్‌తో సపోర్టు ఇవ్వాలని కమిటీ సూచించిందన్నారు. పూర్తి విశ్లేషణ తర్వాత శాశ్వతంగా చేయాల్సిన మరమ్మతులను సూచిస్తామని కమిటీ చెప్పినట్టుగా వెల్లడించారు. పోలవరం తొలిదశను పూర్తిచేయడానికి కేంద్ర ఆర్థికశాఖ రూ.12,911.15 కోట్లు ఇచ్చేందుకు నిర్ణయం తీసుకుందని, కేంద్ర కేబినెట్లో పెట్టేందుకు కేబినెట్ నోట్ తయారీపై వివిధ మంత్రిత్వశాఖల మధ్య సంప్రదింపులు కొలిక్కి వస్తున్నాయని అధికారులు వెల్లడించారు. పోలవరం మొదటి దశ పరిధిలోకి వచ్చే 20,946 ముంపు బాధిత కుటుంబాల్లో 12,658 మందిని ఇప్పటికే తరలించామని, మిగిలిన 8,288 మందిని తరలించడానికి ఏర్పాట్లు చేస్తున్నామన్నారు.
అలాగే ప్రభుత్వం ప్రాధాన్యతగా నిర్దేశించుకున్న ప్రాజెక్టుల పూర్తి ప్రత్యేక దృష్టిపెట్టాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు.ప్రతి 15 రోజులకోసారి పనుల ప్రగతిని సమీక్షించుకోవలన్నారు. ఈమేరకు కార్యాచరణ చేసుకుని వేగంగా వాటిని పూర్తిచేయాలన్నారు. వెలగొండ, వంశధార, అవుకు సహా పలు ప్రాధాన్యతా ప్రాజెక్టుల్లో పరిస్థితులను సీఎం సమీక్షించారు.
ఈ ప్రాజెక్టుల ప్రగతిని ముఖ్యమంత్రికి అధికారులు నివేదించారు. అవుకు రెండో టన్నెల్ నిర్మాణం పూర్తి, చివరిదశలో లైనింగ్ కార్యక్రమం ఉందని, ఆగస్టులో ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని వెల్లడించారు. అవుకు ద్వారా 20వేల క్యూసెక్కుల సముద్రంలో కలిసే కృష్ణా వరదజలాలను రాయలసీమ దుర్భిక్షప్రాంతానికి తరలించేందుకు మార్గం సుగమమైందని, వరదలు సమయంలో సముద్రంలో కలవకుండా నీటిని కరవుపీడిత ప్రాంతాలకు తరలించే అవకాశం ఉంటుందని తెలిపారు.

వెలిగొండ ప్రాజెక్టు మొదటి టన్నెల్ పూర్తయ్యిందని, రెండోటన్నెల్ పనులుకూడా కొలిక్కివస్తున్నాయని అధికారులు తెలిపారు. రెండో టన్నెల్ హెడ్ రెగ్యులేటర్ పనులు 92.14శాతం పూర్తయ్యాని, ఆగస్టు నాటికి హెడ్ రెగ్యులేటర్ పనులు పూర్తిచేస్తామని వెల్లడించారు. టన్నెల్ తవ్వకం పనులు 18,787 మీటర్లకుగానూ, 17,461 మీటర్లు పూర్తిచేశామన్నారు.
నీటిని తరలించడానికి వీలైనంత తర్వగా మిగిలిన పనులు త్వరగా పూర్తిచేయాలని సీఎం ఆదేశాలు ఇచ్చారు. వెలిగొండ ప్రాజెక్టులో భాగంగా గొట్టిపాడు డ్యాం, కాకర్ల డ్యాం, తీగలేరు అప్రోచ్ ఛానల్, తీగలేరు హెడ్ రెగ్యులేటర్, ఈస్ట్రన్ మెయిన్ కెనాల్ హెడ్ రెగ్యులేటర్ పనులు దాదాపుగా పూర్తికావొచ్చాయని అధికారులు తెలిపారు.
అనంతరం వంశధార పనులపైనా సీఎం సమీక్ష చేశారు. ఈ ఏడాది వంశధార స్టేజ్-2, ఫేజ్-2 కింద డిస్ట్రిబ్యూటరీ నెట్‌వర్క్‌ను కూడా పూర్తిచేస్తున్నామని అధికారులు తెలిపారు. గొట్టాబ్యారేజీ నుంచి కూడా ఎత్తిపోతల ద్వారా హిరమండలం రిజర్వాయర్‌ను నింపే కార్యక్రమం వీలైనంత త్వరగా కార్యరూపం దాల్చాలన్నారు.
తోటపల్లి బ్యారేజీ కింద మిగిలిపోయిన పనులు, తారకరామ తీర్థసాగర్, మహేంద్ర తనయ రిజర్వాయర్లపై సీఎం సమీక్ష చేశారు. ఈ పనులన్నీ వేగంగా జరుగుతున్నాయని అధికారులు పేర్కొన్నారు. వీటి తర్వాత ప్రాధాన్యతగా నిర్ణయించుకున్న కుప్పం బ్రాంచ్ కెనాల్ పనులు దాదాపుగా పూర్తికావొచ్చాయన్నారు. ఏపీ నాలుగు జాతీయ జల అవార్డులు (నేషనల్ వాటర్ అవార్డ్స్ 2022) దక్కించుకోవడంపై మంత్రి, అధికారులను సీఎం అభినందించారు.
-
ప్రధాని మోదీపై ప్రశంసలు, మనసులో మాట బయట పెట్టిన జగన్..!! -
జగన్ లాంటి అన్న ఉంటే వేరే శత్రువు అవసరం లేదు! -
ఏపీలోని ఆ గ్రామంలో పిడకల సమరం.. చూస్తే మీరే షాక్ అవుతారు! -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
పాతాళానికి బంగారం ధరలు- రంజాన్ పండగ వేళ -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్‌కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు!












Click it and Unblock the Notifications