ఏప్రిల్లోనే విద్యార్ధులకు జగనన్న కిట్లు-స్పోకెన్ ఇంగ్లీష్ పై ఫోకస్-అధికారులకు వైఎస్ జగన్ ఆదేశం..

ఏపీ సీఎం వైఎస్ జగన్ ఇవాళ పాఠశాల విద్యాశాఖపై కీలక సమీక్ష నిర్వహించారు. ఇందులో విద్యారంగంలో ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యక్రమాలపై సమీక్షించడంతో పాటు కీలక ఆదేశాలు ఇచ్చారు.

అమరావతి : పాఠశాల విద్యాశాఖపై క్యాంపు కార్యాలయంలో సీఎం వైయస్‌ జగన్‌ ఇవాళ సమీక్ష నిర్వహించారు. ఇందులో విద్యారంగంలో అమలు చేస్తున్న కార్యక్రమాలపై నిరంతర సమీక్ష, పర్యవేక్షణ ఉండాలని ఆయన ఆదేశాలు ఇచ్చారు. ప్రతి ఏటా విద్యాకానుక కింద ఇస్తున్న వస్తువులపై పరిశీలనతో పాటు పాఠ్యపుస్తకాల్లో పేపర్‌ క్వాలిటీగా ఉండేలా చూడాలన్నారు. ఐఎఫ్‌పీల ఏర్పాటు, సబ్జెక్టు టీచర్లతో బోధనపై మరింత సీరియస్‌గా పనిచేయాలన్నారు.

ప్రపంచ స్ధాయి పోటీని తట్టుకునేందుకు విద్యార్ధులకు ఇంగ్లిషు ప్రావీణ్యంకై ప్రత్యేక చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు. టోఫెల్‌, కేంబ్రిడ్జి లాంటి సంస్ధల భాగస్వామ్యాన్ని కూడా తీసుకోవాలన్నారు. టీచర్లకూ ఇంగ్లిషుపై పట్టుకు శిక్షణ ఇవ్వాలన్నారు. వచ్చే ఏడాది విద్యాకానుక కిట్‌ ఈ విద్యాసంవత్సరం ఆఖరుకే స్కూళ్లకు చేరాలన్నారు.

ys jagan key orders on primary education review including jagananna kits, spoken english

విద్యారంగంలో వైసీపీ సర్కార్ అమలు చేస్తున్న కార్యక్రమాలపై నిరంతర సమీక్ష, పర్యవేక్షణ అవసరమని సీఎం జగన్ అధికారులకు సూచించారు. దీనివల్ల విద్యాకానుక దగ్గరనుంచి పాఠ్యాంశాల వరకూ, అదేవిధంగా మౌలిక సదుపాయాలు దగ్గరనుంచి గోరుముద్ద వరకూ కూడా నాణ్యత పెరుగుతుందన్నారు. పిల్లలకు అద్భుతమైన స్కూలు వాతావరణం అందుబాటులో ఉంటుందన్నారు. ప్రతి ఏటా కూడా విద్యాకానుక కింద ఇస్తున్న వస్తువులపై పరిశీలన అవసరమన్నారు. పాఠ్యపుస్తకాల్లో పేపర్‌ క్వాలిటీ బాగుండాలన్నారు. 6వ తరగతి ఆపైన ఉన్న ప్రతి తరగతిగదిలోనూ ఐఎఫ్‌పీ ప్యానెల్స్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు జగన్ తెలిపారు. దీనివల్ల బోధన, నేర్చుకోవడం సులభతరమవుతుందని జగన్ పేర్కొన్నారు.

6వ తరగతి కన్నా దిగువ తరగతులకు టీవీ స్క్రీన్లను అందుబాటులోకి తీసుకు వస్తున్నామని, 8 వ తరగతి నుంచి ట్యాబ్‌లను ఇస్తున్నామని జగన్ తెలిపారు. దీని వల్ల ఇంటి దగ్గర కూడా పిల్లలు ఆడియో, వీడియో, గ్రాఫిక్స్‌ ఎలిమెంట్స్‌ ఉన్న పాఠ్యాంశాలను నేర్చుకునే అవకాశం కల్పించామన్నారు. ఇలాగే ఇంటర్మీడియట్‌ విద్యార్థులకు కూడా డిజిటిల్‌ సౌలభ్యాన్ని కల్పించడంపై ఆలోచన చేయాలన్నారు. ఇది ఏ రూపంలో ఉండాలన్న దానిపై అధికారులు ఆలోచించి ప్రతిపాదనలు ఇవ్వాలన్నారు. దీనివల్ల శాశ్వతంగా పిల్లలకు ఉత్తమ బోధన అందించడానికి పటిష్టమైన ఏర్పాట్లు చేసినట్టు అవుతుందన్నారు.

సీఎం ఆదేశాలతో సబ్జెక్ట్‌ టీచర్‌ విధానాన్ని అమలు చేస్తున్నట్లు అధికారులు ఇవాళ వెల్లడించారు. ఈ మార్పుల వల్ల అర్హతలున్న ఉపాధ్యాయులు విద్యార్థులకు అందుబాటులోకి వచ్చారన్నారు. గతంలో 3,4,5 తరగతుల పిల్లలకు సబ్జెక్టుల వారీగా బోధన లేదని, సబ్జెక్టు టీచర్స్‌ కాన్సెప్ట్‌లో భాగంగా సబ్జెక్టుల వారీ టీచర్లతో మంచి బోధన అందుతుందన్నారు. విద్యార్థులు 6వ తరగతిలోకి రాగానే విద్యను సీరియస్‌ అంశంగా తీసుకుని మరింత దృష్టి పెట్టాలని సీఎం జగన్ వారికి సూచించారు. ఐఎఎఫ్‌పి ఏర్పాటు, సబ్జెక్టుల వారీ టీచర్లతో వారి బోధనపై సీరియస్‌గా ఉండాలన్నారు. సీరియస్‌గా బోధన లేకపోతే ఫలితం ఉండదన్నారు. మొక్కుబడిగా చేస్తే విద్యార్థుల భవిష్యత్తు దెబ్బ తింటుందన్నారు.

ys jagan key orders on primary education review including jagananna kits, spoken english

ఐఎఫ్‌బీ ప్యానెల్స్‌ కొనుగోలు టెండర్‌ జ్యుడీషియల్‌ ప్రివ్యూకు వెళ్లందని సీఎంకు అధికారులు తెలిపారు. వీటిని నిర్దేశించుకున్న సమయంలోగా నాడు - నేడు పూర్తిచేసుకున్న స్కూళ్లకు అందించాలని సీఎం వారికి సూచించారు.వచ్చే విద్యాసంవత్సరంలోగా ఐఎఫ్‌పీ ప్యానెళ్లు అందించాలని సీఎం తెలిపారు. నాడు - నేడు పూర్తవుతున్న కొద్దీ ఆ స్కూళ్లలో ఐఎఫ్‌పీలు ఏర్పాటు ఉండాలన్నారు.

8వ తరగతి విద్యార్థులకు ట్యాబులను వచ్చే విద్యాసంవత్సరంలో స్కూళ్లు ప్రారంభంలోగా అందించడానికి చర్యలు తీసుకోవాలన్నారు. పాఠ్యపుస్తకాల్లో అంశాలు, ట్యాబుల్లోని బైజూస్‌ కంటెంట్, ఐఎఫ్‌పీ కంటెంట్‌ ఇవన్నీ పూర్తి సినర్జీతో ఉండాలన్నారు. ప్రపంచస్థాయి పోటీని తట్టుకునేందుకు వీలుగా విద్యార్థులు ఇంగ్లిషులో పట్టుపెంచుకునేందుకు వారికి చేదోడుగా నిలవాలన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+