అమరావతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

అవినీతి నిరోధానికి జగన్ మరో ప్రయత్నం- ఏసీబీ మొబైల్ యాప్- 14400 పేరుతో

|
Google Oneindia TeluguNews

ఏపీలో అవినీతి నిరోధానికి సీఎం జగన్ మరో అడుగు వేశారు. ఇవాళ ఏసీబీ ఆధ్వర్యంలో పనిచేసే అవినీతి నిరోధక యాప్ 14400ను జగన్ ప్రారంభించారు. దీని ద్వారా ప్రభుత్వ ఉద్యోగాల అవినీతిపై ఫిర్యాదులకు మరింత వీలు కలుగుతుంది. జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో నిర్వహించే స్పందన కార్యక్రమంలో జగన్ దీన్ని ప్రారంభించారు.

14400 యాప్ ప్రారంభించిన తర్వాత సీఎం జగన్ పలు కీలక వ్యాఖ్యలు చేసారు. ఈ ప్రభుత్వం వచ్చిన నాటినుంచి ఒకటే మాట చెప్తున్నామని, ఎక్కడా అవినీతి ఉండకూడదనే మాట చాలా స్పష్టంగా చెప్పామని జగన్ గుర్తుచేశారు.
ఈ దిశగా అనేక కార్యక్రమాలు చేపట్టామని, చరిత్రలో ఎప్పుడూలేని విధంగా, దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా రూ.1.41లక్షల కోట్ల మొత్తాన్ని లాంటి అవినీతి లేకుండా, పక్షపాతం లేకుండా నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లోకి అత్యంత పారదర్శకంగా పంపామన్నారు.

ys jagan launched anti-corruption mobile app for complaints with the name 14400

ఎక్కడైనా, ఎవరైనా , కలెక్టరేట్‌ అయినా, ఆర్డీఓ కార్యాలయం అయినా, సబ్ ‌రిజిస్ట్రార్‌ ఆఫీసు అయినా, మండల కార్యాలయం అయినా, పోలీస్‌స్టేషన్‌ అయినా, వాలంటీర్, సచివాలయం, 108, 104 సర్వీసులు అయినా.. ఎవరైనా ఎక్కడైనా కూడా లంచం అడిగితే.. ఎవరైనా చేయాల్సింది ఒక్కటేనని సీఎం జగన్ చెప్పారు.

ys jagan launched anti-corruption mobile app for complaints with the name 14400

తమ చేతుల్లోని ఫోన్‌లోకి ఏసీబీ 14400 యాప్‌ను డౌన్లోడ్‌ చేసి, బటన్‌ ప్రెస్‌చేసి వీడియోద్వారా కాని, ఆడియోద్వారా కాని సంభాషణను రికార్డు చేయాలని జగన్ సూచించారు. ఆ డేటా నేరుగా ఏసీబీకి చేరుతుందన్నారు. అవినీతిని నిరోధించడానికి మరో విప్లవాత్మకమైన మార్పును తీసుకు వస్తున్నామన్నారు. ఏసీబీ నేరుగా సీఎంఓకు నివేదిస్తుందన్నారు. ప్రతి కలెక్టర్, ఎస్పీకి అవినీతి నిరోధంలో బాధ్యత ఉందని జగన్ తెలిపారు. అవినీతిపై ఎలాంటి ఫిర్యాదు వచ్చినా వెంటనే స్పందించి అంకిత భావంతో అవినీతిని ఏరిపారేయాల్సిన అవసరం ఉందన్నారు.
ఎవరైనా పట్టుబడితే కచ్చితంగా కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు.

ys jagan launched anti-corruption mobile app for complaints with the name 14400

పౌరులు నేరుగా యాప్‌ద్వారా నేరుగా ఫిర్యాదు చేసే అవకాశం కల్పించారు. గూగుల్‌ ప్లే స్టోర్‌లో యాప్‌ డౌన్లోడ్‌ చేయగానే మొబైల్‌ నంబర్‌కు ఓటీపీ వస్తుంది. ఓటీపీ రిజిస్టర్‌ చేయగానే వినియోగానికి యాప్‌ సిద్ధంగా ఉంటుంది. యాప్‌లో 2 కీలక ఫీచర్లు ఉన్నాయి. యాప్‌ద్వారా అవినీతి వ్యవహారానికి సంబంధించిన ఆడియో, వీడియో, ఫొటోలను నేరుగా లైవ్‌రిపోర్ట్‌ ఫీచర్‌ను వాడుకుని అక్కడికక్కడే ఫిర్యాదు చేసే అవకాశం కల్పిస్తున్నారు.

ys jagan launched anti-corruption mobile app for complaints with the name 14400

లాడ్జ్‌ కంప్లైంట్‌ ఫీచర్‌ ద్వారా అవినీతి వ్యవహారానికి సంబంధించి.. ఫిర్యాదుకు తనదగ్గరున్న డాక్యుమెంట్లను, వీడియో, ఆడియో, ఫొటో ఆధారాలను ఏసీబీకి పంపించే అవకాశం ఉంది. ఫిర్యాదు రిజిస్టర్‌ చేయగానే మొబైల్‌ ఫోన్‌కు రిఫరెన్స్‌ నంబరు
త్వరలో ఐఓఎస్‌ వెర్షన్‌లోనూ ఏసీబీ యాప్‌ను సిద్ధంచేస్తోంది.

English summary
ap cm ys jagan has launched 14400 mobile app for anti-corruption in ap today.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X