గుంటూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఆరోగ్యశ్రీలో అదనపు చికిత్సలు ప్రారంభించిన జగన్-మొత్తం 3255కు చేరిక- వైద్యారోగ్యంపై సమీక్ష

|
Google Oneindia TeluguNews

వైద్య ఆరోగ్యశాఖపై తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో ఇవాళ వైయస్‌.జగన్‌ సమీక్ష నిర్వహించారు.ఆరోగ్యశ్రీలో మరిన్ని వైద్య చికిత్సలు, పెంచిన వైద్య చికిత్సలను ప్రారంభించారు. వైద్య ఆరోగ్యశాఖపై సమీక్ష సందర్భంగా క్యాంపు కార్యాలయంలో పెంచిన చికిత్సలను ప్రారంభించారు. అనంతరం ఫ్యామిలీ డాక్టర్‌ కాన్సెప్ట్, విలేజ్‌ క్లినిక్స్, నాడు - నేడు తదితర అంశాలపై సీఎం సమీక్ష చేశారు.

ఆరోగ్యశ్రీలో పెరిగిన చికిత్సలు

ఆరోగ్యశ్రీలో పెరిగిన చికిత్సలు

వైఎస్సార్ ఆరోగ్య శ్రీ కింద రాష్ట్రంలో అమలవుతున్న చికిత్సలసంఖ్య 3,255కి చేరింది. కొత్తగా 809 వైద్య చికిత్సల్ని ప్రభుత్వం ఇప్పటికే అమలవుతున్న వాటికి చేర్చింది. గత ప్రభుత్వంతో పోలిస్తే ఆరోగ్య శ్రీ కింద ఉచితంగా వైద్యం అందుతున్న చికిత్సల సంఖ్య 1059 నుంచి 3,255కు పెరిగింది. గత ప్రభుత్వంతో పోలిస్తే వైయస్‌.జగన్‌ సర్కారు పెంచిన చికిత్సలు 2,196కు చేరాయి. మే 2019లో ఆరోగ్య శ్రీకింద వైద్య చికిత్సల సంఖ్య 1059 ఉండగా...

జనవరి 2020లో 2059కి, జులై 2020లో 2200కు పెంచారు. అప్పుడు అదనంగా చేర్చిన చికిత్సల్లో 54 క్యాన్సర్‌ చికిత్స ప్రొసీజర్లు కూడా ఉన్నాయి. అనంతరం నవంబర్‌2020లో 2436కు పెంచారు. మే-జూన్‌2021లో 2446కు, 2022లో 3255కు పెంచారు.

పెరిగిన చికిత్సలు, వ్యయం

పెరిగిన చికిత్సలు, వ్యయం

ఏపీలో గత చంద్రబాబు ప్రభుత్వ హయాంలో 2018-19 నాటికి ఆరోగ్యశ్రీ, 104, 108 పై పెట్టిన ఖర్చు మొత్తంగా రూ.1299.01 కోట్లు కాగా.. ప్రస్తుతం ఆరోగ్యశ్రీలో పెంచిన వైద్య చికిత్సల కారణంగా ఏడాదికయ్యే ఖర్చు రూ.2894.87 కోట్లకు చేరింది. ఆరోగ్య ఆసరా కోసం(2021-22లో) సుమారు రూ.300 కోట్లు ఖర్చు పెట్టారు. దీంతో పాటు 2021-22లో 104 కోసం వెచ్చించిన సొమ్ము రూ.114.05 కోట్లు, 108 కోసం రూ.172.78 కోట్లుగా ఉంది.

మొత్తంగా ఆరోగ్యశ్రీ, ఆరోగ్యఆసరా, 108, 104ల కోసం అయి ఖర్చు రూ. 3481.70 కోట్లుగా నమోదైంది.
దీంతో చంద్రబాబు హయాంలో కన్నా దాదాపు మూడురెట్లు అధికంగా ఖర్చు చేస్తున్నట్లయింది.ఆరోగ్య శ్రీ పథకాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్నామని, ఎక్కడా కూడా బకాయిలు లేకుండా చూస్తున్నామని సీఎం జగన్ తెలిపారు. దీంతో ఆస్పత్రుల్లో నమ్మకం కలిగిందన్నారు.

వైద్యంపై జగన్ కీలక సమీక్ష

వైద్యంపై జగన్ కీలక సమీక్ష

అనంతరం వైద్యరంగంపై జగన్ సమీక్ష నిర్వహించారు. ఇందులో వైద్యరంగంలో అనేక సంస్కరణలు, మార్పులు తీసుకు వచ్చామని సీఎం జగన్ తెలిపారు. భారీ సంఖ్యలో మునుపెన్నడూలేని విధంగా సుమారు 46వేల పోస్టులను భర్తీచేశామన్నారు. ప్రభుత్వ రంగంలో మెరుగైన వైద్య సేవలు, నాణ్యమైన సేవలు అందాలన్నదే లక్ష్యమన్నారు.

ఆరోగ్యవంతమైన సమాజంతో మంచి ఫలితాలు వస్తాయని, ఎక్కడ, ఎప్పుడు, ఎక్కడ ఖాళీ ఉన్నా వెంటనే గుర్తించి వాటిని భర్తీచేసేందుకు ప్రత్యేక అధికారిని కూడా నియమించామన్నారు. సౌకర్యాలు, వసతులు, సరిపడా సిబ్బందిని ప్రభుత్వం నుంచి ఇవ్వగలిగామన్నారు. ఇక అంకిత భావంతో పనిచేసి, ప్రత్యేక శ్రద్ధతో ఈ వ్యవస్థలను మెరుగ్గా పనిచేయించడంపై దృష్టిపెట్టాలన్నారు. అలసత్వానికి, నిర్లక్ష్యానికి తావు ఉండకూడదన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆస్పత్రుల్లో ఉండాల్సిన సంఖ్యలో వైద్యులు ఉండాలన్నారు. వైద్య ఆరోగ్య శాఖలో కూడా ఫేషియల్‌ రికగ్నైజేషన్‌ హాజరును తప్పనిసరి చేయాలన్నారు. అక్టోబరు 21 నుంచి ఫ్యామిలీ డాక్టర్‌ కాన్సెప్ట్‌పై ట్రయల్‌ రన్‌ ప్రారంభించామని అధికారులు జగన్ దృష్టికి తెచ్చారు.

ప్రతి పీహెచ్‌సీలో ఇద్దరు డాక్టర్లు ఉంటారన్నారు. అలాగే 67 రకాల మందులుతో విలేజ్‌ క్లినిక్స్‌ను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. 14 రకాల ర్యాపిడ్‌ కిట్లను కూడా విలేజ్‌ క్లినిక్స్‌లో అందుబాటులో ఉంచామన్నారు. ఇప్పటికే డాక్టర్లకు 2248 సెల్‌ఫోన్లు, ట్యాబులు పంపిణీచేశామన్నారు.దీంతో మందుల సరఫరాలో ఎలాంటి కొరత లేకుండా తగిన చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు.

English summary
ap cm ys jagan on today launched increased treatments in ysr arogyasri scheme.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X