
2ఏళ్ల తర్వాతా జగన్ ప్రభంజనం -అసాధారణ ఓటింగ్ శాతం -వైసీపీ క్లీన్ స్వీప్ -13 జిల్లాల్లో పూర్తి ఫలితాలివే
ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ ఎన్నికల ఫలితాలను అధికార వైసీపీ క్లీన్ స్వీప్ చేసింది. మూడు రాజధానుల వివాదం, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ, సంక్షేమం తప్ప అభివృద్ది కొరవడిన వైనం.. ఇలా అనేక అంశాలు చర్చనీయాంశమైనప్పటికీ పురజనులంతా జగన్ కు జైకొట్టారు. ఇటీవలి పంచాయితీ ఎన్నికల ఫలితాల్లోనూ వైసీపీ మెరుగైన ఫలితాలు సాధించనప్పటికీ, అవి పార్టీ రహిత ఎన్నికలు కావడం, తాజా మున్సిపల్ ఎన్నికలు పార్టీల గుర్తులపై జరగడం తెలిసిందే. రెండేళ్ల కిందటి అసెంబ్లీ ఎన్నికల మాదిరిగానే ఈ మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లోనూ ఫ్యాను గాలి జోరుగా వీచింది.

తగ్గని జగన్ హవా..
2019 అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ ఏకంగా 151 స్థానాలను గెలుచుకోగా, రెండేళ్ల తర్వాత పార్టీల గుర్తులపై జరిగిన మున్సిపల్ ఎన్నికల్లోనూ వైసీపీ క్లీన్ స్వీప్ చేసింది. మొత్తం 13 జిల్లాల్లోనూ జగన్ హవా స్పష్టంగా కనిపించింది. విజయం సాధించిన స్థానాల్లో ఒకటి రెండు చోట్ల మాత్రమే టీడీపీ గట్టిపోటీ ఇవ్వగలిగింది. బీజేపీ, జనసేన దాదాపు పత్తాలేకుండా పోయాయి. ఆదివారం సాయంత్రానికి వెల్లడైన తుది ఫలితాల ప్రకారం.. మొత్తం 12 కార్పొరేషన్లకు గానూ 11 చోట్ల వైసీపీ గెలుపొందింది. హైకోర్టు ఆదేశాలతో ఏలూరు కార్పొరేషన్ లెక్కింపు ఆగింది. ఇక 75 మున్సిపాలిటీలకుగానూ 74 చోట్ల వైసీపీ విజయం సాధించింది. ఒక్క తాడిపత్రి మున్సిపాలిటీని మాత్రమే టీడీపీ తన ఖాతాలోకి వేసుకుంది. కాగా,

వైసీపీకి 83.46శాతం ఓట్లు?
మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి అనధికారికంగా వెల్లడవుతోన్న లెక్కల ప్రకారం అధికార వైసీపీ అసాధారణ స్థాయిలో ఓట్లను రాబట్టుకున్నట్లు తెలుస్తోంది. మున్సిపల్ ఎన్నికల్లో వైసీపీకి 83.46శాతం ఓట్లు దక్కాయని సమాచారం. ఇక ఒకే ఒక్క మున్సిపాలిటీని గెలుచుకుని, విశాఖ, విజయవాడలో మాత్రమే చెప్పుకోదగ్గ పోటీ ఇచ్చిన ప్రతిపక్ష టీడీపీ 12.72శాతం ఓట్లు పడ్డాయని సమాచారం. పవన్ కల్యాణ్ నాయకత్వంలోని జనసేనకు 0.89శాతం ఓట్లు, బీజేపీకి 0.37శాతం దక్కాయని తెలుస్తుండగా, ఇండిపెండెట్లు 1.83శాతం ఓట్లు, ఇతరులు 0.70శాతం ఓట్లు రాబట్టినట్లు తెలుస్తోంది. ఈ లెక్కలను ఈసీ నిర్ధారించాల్సి ఉంది. ఇక 13 జిల్లాలవారీగా ఆయా కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో ఎన్నికల ఫలితాలు ఇలా ఉన్నాయి..

కృష్ణా జిల్లాలో వైసీపీ క్లీన్ స్వీప్..
జిల్లాలోని విజయవాడ, మచిలీపట్నం కార్పొరేషన్లు వైసీపీ కైవసం చేసుకుంది. విజయవాడలో మొత్తం 64 డివిజన్లుండగా, తుది ఫలితాలు వెలువడే సమయానికి 33 డివిజన్లను వైసీపీ ఎగరేసుకుంది. టీడీపీ 9 స్థానాలకే పరిమితమైంది. మచిలీపట్నం కార్పొరేషన్ లో మొత్తం 50 స్థానాలకు గాను 27 చోట్ల వైసీపీ, టీడీపీ -4, జనసేన- 1డివిజన్‌లో గెలుపు సాధించాయి. జిల్లాలోని ఐదు మున్సిపాలిటీలనూ జగన్ పార్టీనే గెలుచుకుంది. ఉయ్యూరు (20) స్థానాలకుగానూ వైసీపీ -16, టీడీపీ -4. నందిగామ (20)లో వైసీపీ 13, టీడీపీ -6, జనసేన -1. నూజివీడు (23): వైఎస్‌ఆర్‌సీపీ -21, టీడీపీ -1, బీజేపీ -1.

కొత్త రాజధాని, స్టీల్ ప్లాంట్ వివాదం
ఏపీకి
కొత్త
కార్యానిర్వాహక
రాజధాని
విశాఖపట్నం
కార్పొరేషన్
పరిధిలో
స్టీల్
ప్లాంట్
వివాదం
దరిమిలా
వైసీపీ
క్లీన్
స్వీప్
సాధించలేక,
గెలుపును
మాత్రం
ఖాయంచేసుకుంది.
అయితే,
జిల్లాలోని
మూడు
మున్సిపాలిటీల్లోనూ
ఫ్యాను
హవా
కొనసాగింది.
విశాఖ
కార్పొరేషన్
లో
మొత్తం
98
స్థానాలకుగానూ
వైసీపీ
58,
టీడీపీ
30,
జనసేన
3
డివిజన్లను
గెలుచుకున్నాయి.
యలమంచిలి
మున్సిపాలిటీలో
(25)
వైసీపీ
23,
టీడీపీ
-1,
ఇతరులు
-1
గెలిచారు.
నర్సీపట్నం
పురపాలికలో
(28)కిగానూ
వైసీపీ
14,
టీడీపీ
-12,
ఇతరులు
-2
స్టానాలు
గెలిచారు.

అనంతపురంలో టీడీపీకి ఆ ఒక్కటి..
అనంతపురం జిల్లాలోని అనంతపురం కార్పొరేషన్ తోపాటు 9 మున్సిపాలిటీలను వైసీపీ గెలుచుకుంది. ఇక్కడి తాడిపత్రి మున్సిపాలిటీని టీడీపీ కైవసం చేసుకుంది. రాష్ట్రంలో ప్రతిపక్షం గెలుపొందిన ఏకైక మున్సిపాలిటీ తాడిపత్రే కావడం గమనార్హం. అనంతపురం కార్పొరేషన్ లో 50 డివిజన్లకుగానూ వైసీపీ 48, ఇతరులు -2 స్థానాలు గెలిచారు. రాయదుర్గం (32)లో వైసీపీ 30, టీడీపీ -2, మడకశిర (20)లో వైసీపీ-15, టీడీపీ -5, కల్యాణదుర్గం (24)లో వైసీపీ -20, టీడీపీ -4, గుత్తి (25)లో వైసీపీ 24, టీడీపీ-1, పుట్టపర్తి (20)లో వైసీపీ -14, టీడీపీ -6, ధర్మవరం (40)లో వైసీపీ-40, టీడీపీ -0, హిందూపురం (38)లో వైసీపీ 29, టీడీపీ -6, బీజేపీ -1, ఎంఐఎం -1, ఇతరులు -1, కదిరి (36)లో వైసీపీ -30, టీడీపీ -5, ఇతరులు -1. గుంతకల్లు (37)లో వైసీపీ -28, టీడీపీ -7, సీపీఐ -1, ఇతరులు -1. తాడిపత్రిలో(36)లో టీడీపీ 18, వైసీపీ 16, సీపీఐ 1, ఇతరులు 1 స్థానంలో గెలిచారు.

అమరావతిలోనూ వైసీపీ హవా..
ఏపీ రాజధాని అమరావతి కొలువైన గుంటూరు జిల్లా పరిధిలో అధికార వైసీపీ ప్రభంజనం కొనసాగింది. జిల్లాలోని గుంటూరు కార్పొరేషన్ తోపాటు 7 మున్సిపాలిటీలనూ జగన్ పార్టీ గెలుచుకుంది. గుంటూరు కార్పొరేషన్ లో 57 స్థానాలకుగానూ వైసీపీ 45, టీడీపీ-8, బీజేపీ జనసేన 4, ఇతరులు 2 స్థానాల్ని గెలిచారు. తెనాలి మున్సిపాలిటీలో (40) స్థానాలుండగా వైసీపీ-32, టీడీపీ-8 గెలిచాయి. ఇక చిలకలూరిపేట (38)లో వైసీపీ-30, టీడీపీ-8. రేపల్లె (28)లో వైసీపీ 26, టీడీపీ-2. సత్తెనపల్లి (31)లో వైసీపీ-24, టీడీపీ-4, బీజేపీ-1, ఇతరులు -2. వినుకొండ (32)లో వైసీపీ-28, టీడీపీ-4. వివాదాస్పద మాచర్ల మున్సిపాలిటీలో (31)స్థానాలనూ వైసీపీ ఏకగ్రీవంగా గెలుచుకుంది. ఇటు పిడుగురాళ్ల మున్సిపాలిటీలోనూ 33స్థానాలూ ఫ్యాను ఖాతాలోకే వెళ్లాయి.

జగన్ వెంటే ప్రకాశం జిల్లా..
ప్రకాశం జిల్లాలోని ఒంగోలు కార్పొరేషన్ తోపాటు 6 మున్సిపాలిటీలను వైసీపీ గెలుచుకుంది. ఒంగోలు కార్పొరేషన్ పరిధిలో 50 స్థానాలుండగా, వైసీపీ -41, టీడీపీ-6, జనసేన -1, ఇతరులు -2చోట్ల గెలిచారు. గిద్దలూరు మున్సిపాలిటీలో (20) స్థానాలకుగానూ వైసీపీ-16, టీడీపీ-3, ఇతరులు -1 గెలిచారు. కనిగిరి (20)లో వైసీపీ-20, టీడీపీ-0. చీమకుర్తి (20)లో వైఎస్ఆర్సీపీ-18, టీడీపీ-2. మార్కాపురం (35)లో వైసీపీ-30, టీడీపీ-5, అద్దంకి (19)లో వైసీపీ-13, టీడీపీ-6. చీరాల (33)లో వైసీపీ-19, టీడీపీ-1, ఇతరులు 13 స్థానాలను గెలిచారు.

నెల్లూరు, ఉభయ గోదావరి జల్లాల్లో..
నెల్లూరు
జిల్లాలోని
నాయుడుపేట
మున్సిపాలిటీలో
25
స్థానాలకుగానూ
వైసీపీ
23,
టీడీపీ-1,
బీజేపీ-1
స్థానాలు
గెలిచింది.
సూళ్లూరుపేట
(25)లో
వైసీపీ
24,
టీడీపీ-1.
వెంకటగిరి
(25)లో
వైసీపీ
25.
ఆత్మకూరు
(ఎం)లో
23స్థానాలకుగానూ
వైసీపీ
19,
టీడీపీ-2,
ఇతరులు
2
గెలిచారు.
ఇక
పశ్చిమ
గోదావరి
జిల్లాలోని
జంగారెడ్డి
గూడెం
మున్సిపాలిటీలో
29
స్థానాలకుగానూ
25చోట్ల
వైసీపీ,
4చోట్ల
టీడీపీ
గెలిచింది.
కొవ్వూరు,
నిడదవోలు,
నరసాపురం
మున్సిపాలిటీలనుకూడా
వైసీపీనే
కైవసం
చేసుకుంది.
ఇక
తూర్పుగోదావరి
జిల్లాలోని
ఆరు
మున్సిపాటీల్లోనూ
ఫ్యాను
గాలి
వీచింది.
పెద్దాపురం
మున్సిపాలిటీలోని
(29)
స్థానాల్లో
వైసీపీ
వైసీపీ
-21,
టీడీపీ
-2,
జనసేన
-1
గెలుచుకున్నాయి.
అమలాపురం
(30)లో
వైసీపీ-19,
టీడీపీ-4,
జనసేన
-6,
ఇతరులు
-1.
గొల్లప్రోలు
(20)లో
వైసీపీ
-18,
టీడీపీ
-
2.
ముమ్మిడివరం
(20)లో
వైఎస్ఆర్సీపీ
-
14,
టీడీపీ-6.
ఏలేశ్వరం
(20)
లోవైసీపీ
-16,
టీడీపీ
-4.
మండపేట
(30)లో
వైఎస్సార్‌సీపీ
-22,
టీడీపీ
-7,
ఇతరులు
-1.

శ్రీకాకుళం విజయనగరం జిల్లాల్లో..
మున్సిపల్ ఎన్నికల్లో శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలో వైసీపీ క్లీన్ స్వీప్ సాధించింది. శ్రీకాకుళం జిల్లాలోని ఇచ్ఛాపురం మున్సిపాలిటీలో 23 స్థానాలకుగానూ వైసీపీకి -15, టీడీపీ -6, ఇతరులకు 2 సీట్లు దక్కాయి. పలాస (31)లో వైసీపీ -23, టీడీపీ -8. పాలకొండ (20)లో వైసీపీ -17, టీడీపీ -3. ఇక విజయనగరం జిల్లా బొబ్బిలి మున్సిపాలిటీలో 31 స్థానాలకుగానూ వైసీపీ -19, టీడీపీ -11, ఇతరులు -1 గెలుపొందారు. పార్వతీపురం (30)లో వైసీపీ -22, టీడీపీ-5, ఇతరులు -3. సాలూరు (29)లో వైసీపీ-20, టీడీపీ-5, ఇతరులు -4. నెల్లిమర్ల (20)లో వైసీపీ -11, టీడీపీ-7, ఇతరులు -2.

కర్నూలు జిల్లాలో ఎంఐఎంకు సున్నా..
కర్నూలు జిల్లాలోని కర్నూలు కార్పొరేషన్ తోపాటు మొత్తం 8 మున్సిపాలిటీలనూ వైసీపీ తన ఖాతాలో వేసుకుంది. కర్నూలు కార్పొరేషన్ లో 52 స్థానాలకుగానూ వైసీపీ-44, టీడీపీ-6, ఇతరులు -2 చోట్ల గెలిచారు. జిల్లాలోని గూడూరు మున్సిపాలిటీలో (20) స్థానాల్లో వైసీపీ- 12, టీడీపీ-3, బీజేపీ -1, ఇతరులు - 4. డోన్ (32)లో వైసీపీ- 31, ఇతరులు - 1. ఆత్మకూరు (24)లో వైసీపీ- 21, టీడీపీ-1, ఇతరులు - 2. ఎమ్మిగనూరు (34)లో వైసీపీ- 31, టీడీపీ-3. ఆదోని (42)లో వైసీపీ- 41, టీడీపీ-1. నందికొట్కూరు (29)లో వైసీపీ- 21, టీడీపీ-1, ఇతరులు -7. ఆళ్లగడ్డ (27)లో వైసీపీ- 22, టీడీపీ-2, బీజేపీ - 2, ఇతరులు - 1. నంద్యాల (42)లో వైసీపీ -37, టీడీపీ-4, ఇతరులు - 1 స్థానాన్ని గెలిచారు. గతంలో ఆదోని మున్సిపాలిటీలో 4 స్థానాలు గెలుచుకున్న ఎంఐఎం పార్టీ ఈసారి సున్నాకే పరిమితమైపోయింది. ఇక

సీఎం జగన్ ఇలాకా కడపలో ఇలా..
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సొంత జిల్లా కడపలోనూ ఫ్యాను హవా కొనసాగింది. కడప కార్పొరేషన్ తోపాటు 6 మున్సిపాలిటీల్లో వైసీపీ విజయం సాధించింది. కడప కార్పొరేషన్ లో 50 స్థానాలకు వైసీపీ 48, టీడీపీ -1, ఇతరులు -1 గెలుచుకున్నారు. ప్రొద్దుటూరు మున్సిపాలిటీలో (41) సీట్లకు వైసీపీ 40, టీడీపీ -1. పులివెందుల (33)లో వైసీపీ -33, జమ్మలమడుగు (20)లో వైసీపీ -18, బీజేపీ -2. బద్వేల్ (35)లో వైసీపీ -28, టీడీపీ -3, ఇతరులు -4. రాయచోటి (34)లో వైసీపీ -34, టీడీపీ -0, ఎర్రగుంట్ల (20)లో వైసీపీ -20, టీడీపీ -0. చివరిగా..

చంద్రబాబు సొంత జిల్లాలోనూ టీడీపీ ఖతం
ఏపీ ప్రతిపక్ష నేత, టీడీపీ అధినేత చంద్రబాబు సొంత జిల్లా చిత్తూరులోనూ జగన్ ప్రభంజనం కొనసాగింది. జిల్లాలోని చిత్తూరు, తిరుపతి కార్పొరేషన్ల తోపాటు మొత్తం 5 మున్సిపాలిటీలనూ వైసీపీ ఎగరేసుకుపోయింది. చిత్తూరు కార్పొరేషన్ లో 50 స్థానాలకుగానూ వైసీపీ -46, టీడీపీ -3, ఇతరులు -1 గెలిచారు. తిరుపతి కార్పొరేషన్ లో 49 స్థానాలకుగానూ వైసీపీ 48, టీడీపీ 1చోట గెలిచాయి. మదనపల్లె మున్సిపాలిటీలో (35) స్థానాలుండగా, వైసీపీ -33, టీడీపీ -2. పుంగనూరు (31)లో వైసీపీ -31, టీడీపీ -0, పలమనేరు (26)లో వైఎస్ఆర్సీపీ -24, టీడీపీ -2. నగరి (29)లో వైసీపీ -24, టీడీపీ -4, ఇతరులు -1. పుత్తూరు (27)లో వైసీపీ -22, టీడీపీ -5 స్థానాల్లో గెలిచారు. ఈ ఫలితాలు మూడు రాజధానుల నిర్ణయానికి పట్టం కట్టడంతోపాటు జగన్ ను జనం ఏకపక్షంగా సమర్థించారని వైసీపీ నేతలు అన్నారు.
జగన్
దెబ్బకు
ఓవైసీకి
భారీ
లాస్
-హిందూపూర్‌లో
బోణీతో
సరి
-చంద్రబాబుకు
ఎంఐఎం
రిటర్న్
గిఫ్ట్!