సాయిరెడ్డి స్థానంలో ఫైర్ బ్రాండ్ కు బాధ్యతలు..!!
మాజీ సీఎం జగన్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. పార్టీలో తిరిగి జోష్ నింపేందుకు కొత్త కార్యా చరణ అమలు చేస్తున్నారు. అందులో భాగంగా తన తండ్రితో కలిసి పని చేసిన సీనియర్లను తన పార్టీలోకి ఆహ్వానిస్తున్నారు. బెంగళూరు కేంద్రంగా కీలక మంత్రాంగం నడుపుతున్నారు. ఉగాది నుంచి జిల్లాల పర్యటనలకు సిద్దం అవుతున్నారు. ఇదే సమయంలో సీనియర్లు పార్టీ వీడుతున్న సమయంలో వారి స్థానాలకు ముఖ్య నేతలకు అప్పగిస్తున్నారు. సాయిరెడ్డి బాధ్యతలను పార్టీ ఫైర్ బ్రాండ్ కు అప్పగిస్తూ జగన్ నిర్ణయించారు.
సాయిరెడ్డి స్థానంలో
వైసీపీలో కీలక బాధ్యతల ఖరారు పైన జగన్ కసరత్తు చేస్తున్నారు. పార్టీలో నెంబర్ టూ స్థానంలో ఉంటూ తాజాగా సాయిరెడ్డి రాజకీయ నిష్క్రమణ నిర్ణయం తీసుకున్నారు. సాయిరెడ్డి పార్టీ వీడటం పైన జగన్ కామెంట్స్ చేయటం.. అందుకు సాయిరెడ్డి కౌంటర్ పార్టీలో సంచలనంగా మారింది. ఇదే సమయంలో సాయిరెడ్డి స్థానంలో పార్టీలో ఎవరు భర్తీ చేస్తారనే చర్చ మొదలైంది. 2019 లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత సాయిరెడ్డి ఉత్తరాంధ్ర పార్టీ వ్యవహారాల ఇంఛార్జ్ గా పని చేసారు. ఆ తరువాత అక్కడ వచ్చిన ఆరోపణలతో సాయిరెడ్డిని అక్కడ నుంచి తప్పించారు.

పేర్ని నానికి బాధ్యతలు
2024 లో సాయిరెడ్డి గుంటూరు జిల్లా ఎన్నికల బాధ్యతలు అప్పగించారు. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పార్టీ వీడటంతో అనూహ్యంగా నెల్లూరు ఎంపీ అభ్యర్దిగా సాయిరెడ్డి పోటీ చేసారు. ఆ ఎన్నికల్లో ఓడి పోయారు. దీంతో, తిరిగి ఉత్తరాంధ్ర బాధ్యతలను జగన్ ఇటీవల సాయిరెడ్డికి అప్పగించారు. ఇక, ఇప్పుడు సాయిరెడ్డి పార్టీ వీడటంతో కీలకమైన ఉత్తరాంధ్ర బాధ్యతల పైన జగన్ కసరత్తు చేసారు. సీనియర్ నేత బొత్సా తోనూ చర్చించినట్లు సమాచారం. ఆ తరువాత ఉత్తరాంధ్ర పార్టీ బాధ్యతల ను సీనియర్ నేత.. పార్టీ ఫైర్ బ్రాండ్ పేర్ని నానికి అప్పగించాలని జగన్ నిర్ణయించినట్లు తెలు స్తోంది. ఎన్నికల్లో ఓటమి తరువాత పార్టీ వాయిస్ బలంగా వినిపిస్తున్న నేతల్లో పేర్ని నాని ఉన్నారు. తాజాగా బియ్యం వివాదంలోనూ ఆయన కుటుంబం కేసులు ఎదుర్కొంది.
కీలక భేటీ
కాగా, ఈ నెల 12న జగన్ ఉత్తరాంధ్ర పార్టీ నేతలతో సమావేశం కానున్నారు. ఆ సమయంలో కొత్త ఇంఛార్జ్ నియామకం పైన చర్చ చేయనున్నారు. తన ప్రతిపాదన గురించి వివరించి.. అందరి ఆమోదంతో పేర్ని నాని పేరు ప్రకటించే అవకాశం కనిపిస్తోంది. ఉత్తరాంధ్రలో పార్టీ బలోపేతం దిశగా ఈ భేటీలోనే జగన్ దిశా నిర్దేశం చేయనున్నట్లు సమాచారం. కాంగ్రెస్ సీనియర్లు కొందరు వైసీపీలో చేరుతారనే ప్రచారం సాగుతోంది. ఈ చేరికల పైనా జగన్ స్పష్టత ఇవ్వనున్నారు. అసెంబ్లీ సమావేశాల తేదీలు ఖరారు కావటంతో.. సభకు హాజరు అంశం పైన తుది నిర్ణయం తీసుకోవటంతో పాటుగా.. జిల్లా పర్యటనల షెడ్యూల్ ఫైనల్ చేయనున్నట్లు సమాచారం.












Click it and Unblock the Notifications