అమరావతిపై జగన్ ప్లాన్ 'బీ' - కొత్త రాజధాని “మావిగన్”..!!
అమరావతి పై తాము వ్యతిరేకం కాదని మాజీ సీఎం జగన్ తేల్చి చెప్పారు. అయితే, అమరావతిలో ఎకరాకు మౌలిక వసతుల కోసం చేయాల్సిన ఖర్చు పైనే తమ అభ్యంతరం అని జగన్ చెప్పారు. అసలు ఈ ఖర్చు సాధ్యమేనా అని ప్రశ్నించారు. రాష్ట్రంలో పాలన ఏం కావాలని నిలదీసారు. ఈ మేర ఖర్చు చేస్తామని.. ప్రజలను మభ్య పెడుతూ.. గ్రోత్ ఇంజన్ లేకుండా చేస్తున్నారని జగన్ స్పష్టం చేసారు. ఇదే సమయంలో అమరావతి పై జగన్ ప్లాన్ 'బీ' బయట పెట్టారు. భవిష్యత్ లో తమ విధానం ఏంటో స్పష్టం చేసారు.
మాజీ ముఖ్యమంత్రి జగన్ అమరావతి పై కొత్త ప్రతిపాదనలు తీసుకొచ్చారు. అమరావతి సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్టుగా పేర్కొన్న చంద్రబాబు 47 వేల కోట్లు అప్పు ఎందుకు చేయాల్సి వచ్చిందని... రాష్ట్ర బడ్జెట్ లో కేటాయింపులు ఎందుకు చేసారని ప్రశ్నించారు. గతంలో అయిదేళ్లు.. ఈ రెండేళ్ల కాలంలో ఎంత మేర రాజధానికి ఖర్చు చేసారని నిలదీసారు. పాలనలో సంక్షేమం పూర్తిగా ఆగి పోయిందని జగన్ చెప్పుకొచ్చారు. ఈ సమయంలో ఎకరాకు రూ 2 కోట్ల చొప్పున ఇప్పుడు రెండో విడత భూ సమీకరణ ద్వారా సేకరిస్తున్న ఈ భూములకు మొత్తంగా లక్ష ఎకరాల భూములకు రూ 2 లక్షల కోట్లు ఖర్చు చేయటం సాధ్యమేనా అని ప్రశ్నించారు. తాము అమరావతి సహా ఏ ప్రాంతం కు వ్యతిరేకం కాదని జగన్ తేల్చి చెప్పారు. ఇదే సమయంలో జగన్ రాజధాని పై ప్లాన్ బీ సూచన చేసారు. విజయవాడ - గుంటూరు - మచిలీపట్నం జాతీయ రహదారి పైన నిర్మాణాలు చేయటం ద్వారా తక్కువ ఖర్చుతోనే అందుబాటులోకి తీసుకురావచ్చని సూచించారు.













Click it and Unblock the Notifications