ఈవీఎంల పై చర్చ - జగన్ కీలక నిర్ణయం..!!

ఏపీలో కొత్త ప్రభుత్వం కొలువు తీరింది. మూడు పార్టీల కూటమి అధికారంలోకి వచ్చింది. చంద్రబాబు పాలన ప్రారంభం అవుతున్న వేళ కొత్త రాజకీయం తెర మీదకు వస్తోంది. ఎన్నికల్లో అనూహ్య ఓటమి పాలైన మాజీ సీఎం జగన్ పార్టీ ఎమ్మెల్సీలతో సమావేశం అయ్యారు. ఆసక్తి కర వ్యాఖ్యలు చేసారు. ఎన్నికల ఫలితాలు శకుని పాచికల మాదిరి ఉన్నాయని వ్యాఖ్యానించారు. ఈవీఎంల వ్యవహారం పై చర్చ జరగాలన్నారు. తాను త్వరలోనే రాష్ట్రంలో పర్యటన ప్రారంభిస్తానని జగన్ వెల్లడించారు.

జగన్ మార్గనిర్దేశం
వైయ‌స్ఆర్‌సీపీ ఎమ్మెల్సీలతో భేటీ అయిన వైయ‌స్ జ‌గ‌న్ ప‌లు అంశాల‌పై నేత‌ల‌కు దిశానిర్దేశం చేశారు. ప్ర‌జా స‌మ‌స్య‌ల‌పై పోరాడుదామ‌ని సూచించారు. 2024 ఎన్నికల ఫలితాలు పై ఈ భేటీలో చర్చ జరిగింది. ఏపీ అసెంబ్లీలో వైసీపీ కేవలం 11 సీట్లకే పరిమితం అయింది. శాసన మండలిలో మాత్రం వైసీపీ సభ్యుల సంఖ్య ఎక్కువగా ఉంది. వచ్చే వారం అసెంబ్లీ సమావేశాలు జరగనుండటంతో ఎమ్మెల్సీలతో జగన్ సమావేశం అయ్యారు. ఎన్నికల ఫలితాల పైన జగన్ కీలక వ్యాఖ్యలు చేసారు. శాసన మండలిలో అన్సురురించాల్సిన వ్యూహాలు పై దిశానిర్దేశం చేస్తూనే..ఎటువంటి ప్రోలోబలకు లొంగకుండా ప్రజా సమస్యలు పై పోరాడాలని సూచించారు.

YS Jagan made Crucial announcement over his Yatra and key direction for party leaders

ఈవీఎంలపై చర్చ జరగాలి

వైసీపీ నేతల పైన పై నాలుగు అయిదు కేసులు పెట్టిన భయపడవద్దని జగన్ పేర్కొన్నారు. రాష్ట్రంలో 40 శాతం ప్రజలు మన వైపే ఉన్నారు అనేది మరిచిపోవద్దని సూచించారు. మనం చేసిన మంచి ఇప్పటికే ప్రజలకు గుర్తు ఉందని జగన్ చెప్పుకొచ్చారు. ఎన్నికలు ఫలితాలు శకుని పాచికలు మాదిరి వున్నాయని వ్యాఖ్యానించారు. ఈవియంల వ్యవహారాలు పై దేశవ్యాప్తంగా చర్చ జరగాలని జగన్ కీలక వ్యాఖ్యలు చేసారు.శిశుపాలుడు మాదిరిగా చంద్రబాబు తప్పులను లెక్కించాలని చెప్పుకొచ్చారు. ఈ నెల ఇవ్వాల్సిన ప్రభుత్వ పథకాలు ఇంకా ఇవ్వలేదన్నారు. ప్రస్తుతం టీడీపీ బీజేపీ జనసేన హనీ మూన్ నడుస్తుందని చెప్పారు.మరి కొంత సమయం వారికి ఇద్దామని జగన్ పార్టీ నేతలతో వ్యాఖ్యానించారు.

YS Jagan made Crucial announcement over his Yatra and key direction for party leaders

జగన్ రాష్ట్ర వ్యాప్త పర్యటన
కొత్త ప్రభుత్వానికి ఇచ్చిన సమయం పూర్తయిన తరువాత ప్రజల తరుపున పెద్ద ఎత్తున్న పోరాటం చేద్దామని జగన్ పిలుపునిచ్చారు. అసెంబ్లీ లో నోరు మెదపకుండా కట్టడి చేసే అవకాశం వుందని అభిప్రాయ పడ్డారు. శాసన మండలిలో గట్టిగా పోరాటం చేద్దామని చెప్పారు. ఇదే సమయంలో ఎన్నికల ఫలితాల తరువాత జరిగిన రాజకీయ దాడుల పైన చర్చ జరిగింది. తాను పర్యటించనున్నట్లు జగన్ కీలక నిర్ణయం ప్రకటించారు. వచ్చే వారం జగన్ రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో పర్యటించేందుకు జగన్ సిద్దం అవుతున్నారు. పార్టీ కేడర్ ను పరామర్శించటం యాత్ర లక్ష్యమని వివరించారు. దీంతో..వచ్చే వారం జగన్ ఈ యాత్ర ఉండే అవకాశం ఉంది. జగన్ నిర్ణయంతో రాష్ట్రంలో మరోసారి రాజకీయం ఆసక్తిగా మారే ఛాన్స్ కనిపిస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+