చంద్రబాబు ఇక తప్పించుకోలేరు - అమరావతిపై జగన్ సంచలన వ్యాఖ్యలు..!!

ఏపీ రాజకీయాలు ఆసక్తి కరంగా మారుతున్నాయి. మాజీ సీఎం జగన్ కూటమి ప్రభుత్వం లక్ష్యంగా వ్యాఖ్యలు చేస్తున్నారు. పార్టీ నేతల సమావేశంలో జమ్మూ కశ్మీర్‌లోని పహల్గాం వద్ద ఉగ్ర ముష్కరు ల ఆటవిక దాడిలో ప్రాణాలు కోల్పోయిన మృతుల కుటుంబాలకు సంతాపంగా మౌనం పాటించి నివాళులర్పించారు. రాష్ట్రంలో పాలనా పరమైన వైఫల్యాలు.. లోపాల గురించి జగన్ పలు అంశా లను ప్రస్తావించారు. విశాఖలో భూ కేటాయింపులు .. అమరావతి గురించి జగన్ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారుతున్నాయి.

ప్రజల్లోకి వెళ్లలేరు
మాజీ సీఎం జగన్ ప్రొద్దుటూరు, తిరుపతి జిల్లా వెంకటగిరి మున్సిపాలిటీలు, అనంతపురం జిల్లా కంబదూరు, తిరుపతి రూరల్ వైసీపీ స్ధానిక సంస్ధల ప్రజాప్రతినిధులతో సమావేశమ‌య్యారు. రాష్ట్రంలో పరిస్థితులు దారుణంగా ఉన్నాయని.. దుర్మార్గంగా రెడ్ బుక్ పాలన జరుగుతోం దని జగన్ మండిపడ్డారు. ప్రజా వ్యతిరేకతను అణిచివేయటం సాధ్యం కాదన్నారు. హామీలు అమలు కోసం ప్రతీ ఒక్కరూ నిలదీస్తారని తేల్చి చెప్పారు. గ్రామాల్లో టీడీపీ నేతలు ధైర్యంగా ప్రజల మధ్య తిరిగే పరిస్థితి లేదన్నారు. విద్య, వైద్య రంగాలను దారుణంగా మార్చేసారని చెప్పారు. నాలుగు లక్షల పెన్షన్లు తీసాసారని ధ్వజమెత్తారు.

ys-jagan-made-key-remarks-on-ursa-lands-and-on-amaravati

ఉర్సా భూములపై
బెల్టు షాపులు.. మద్యం దుకణాలు ప్రతీ చోట వెలిసాయని.. విచ్చల విడిగా అమ్మకాలు చేస్తున్నార ని జగన్ మండిపడ్డారు. ప్రతీ బాటిల్ పైన రూ 20 ఎక్కువకు అమ్ముతున్నారని చెప్పారు. ఉచిత ఇసుక పేరుతో రెండింతలు ఎక్కువ దోచేస్తున్నారని ఆరోపించారు. ప్రజలను మళ్లించటానికి డైవర్షన్ రాజకీయాలు చేస్తున్నారని ఫైర్ అయ్యారు. విశాఖలో ఉర్సాకు భూముల కేటాయింపు పైన జగన్ ఆసక్తి కర వ్యాఖ్యలు చేసారు. రూపాయికి ఇడ్లీ వస్తుందో లేదో తెలియదు కానీ, ఉర్సా లాంటి కంపెనీలకు మాత్రం మూడు వేల కోట్ల విలువైన భూములు దోచి పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేసారు. విశాఖలో లులూ వంటి వాటికి ఎలాంటి టెండర్లు లేకుండా రూ 1500 కోట్ల విలువైన భూములు ఇస్తున్నారని జగన్ పేర్కొన్నారు.

Take a Poll

అమరావతి నిర్మాణాల్లో
రాష్ట్రాన్ని అన్ని రంగాల్లోనూ దోచుకుంటున్నారని విమర్శించారు. అమరావతి నిర్మాణంలోనూ అవి నీతి జరుగుతోందని జగన్ ఆరోపించారు. అమరావతిలో పనుల రేట్లు పెంచేసి.. వాళ్లేటెండర్లు రింగ్ ఫార్మ్ చేసి వాళ్ల కాంట్రాక్టర్లకే ఇచ్చుకుంటున్నారని చెప్పుకొచ్చారు. మొబిలైజేషన్ అడ్వాన్సులు ఇస్తున్నారని మండిపడ్డారు. పది శాతం మొబిలైజేషన్ అడ్వాన్సులు ఇస్తూ అందులో ఎనిమిది శాతం తీసుకొంటున్నారని విమర్శించారు. ప్రభుత్వం చేసిన అప్పులన్నీ ఎక్కడకు పోతున్నాయో అర్దం కావటం లేదన్నారు. ఇంత మోసం చేసిన చంద్రబాబు ఇక తప్పించుకోలేరని.. సింగిల్ డిజిట్ కు పరిమితం అయ్యే రోజులు ముందు ఉన్నాయని జగన్ వ్యాఖ్యానించారు. అధికారంలో ఉన్న వారి వేధింపులు తట్టుకొని నిలబడిన పార్టీ కేడర్ కు సెల్యూట్ చేస్తున్నానన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+