జగన్ కీలక మార్పులు - సెంటిమెంట్ కలిసొచ్చేనా..!!

ఏపీ రాజకీయాలు ఆసక్తి కరంగా మారుతున్నాయి. కేంద్రంలో జమిలి దిశగా అడుగులు వేగంగా పడుతున్నాయి. దీంతో, ఏపీలో కూటమి ప్రభుత్వం అప్రమత్తం అవుతోంది. ఆరు నెలలు పాలన పూర్తి చేసుకున్న కూటమి ప్రభుత్వం పైన జగన్ గురి పెట్టారు. అటు జగన్ లక్ష్యంగా కూటమి నేత లు రాజకీయ వ్యూహాలు అమలు చేస్తున్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలకు జగన్ పోరు బాట ఖరారు చేసారు. ఇదే సమయంలో జగన్ నమ్ముకున్న సెంటిమెంట్ తెర మీదకు వచ్చింది. తాజా నిర్ణయంతో జగన్ రాజకీయం కొత్త టర్న్ తీసుకుంటుందా అనేది చర్చగా మారింది.

జగన్ మార్పులు
మాజీ సీఎం జగన్ లో ఎన్నికల్లో ఓటమి తరువాత మార్పు కనిపిస్తోంది. పార్టీ నేతలతో సమావేశాల కు ప్రాధాన్యత ఇస్తున్నారు. ఈ నెల 13 నుంచి కూటమి ప్రభుత్వం పై నిరసన కార్యక్రమాలకు నిర్నయించారు. జనవరి మూడో వారం నుంచి పార్లమెంట్ యూనిట్ గా ప్రతీ అసెంబ్లీ నియోజక వర్గాల వారీగా ప్రతీ వారం రెండు రోజులు సమావేశం కావాలని డిసైడ్ అయ్యారు. అదే విధంగా ప్రజలతోనూ గతంలో లాగా మమేకం అవ్వనున్నారు. ఇక, ఎన్నికల్లో ఊహించని పరాజయం వెనుక జగన్ సెంటిమెంట్ పరంగానూ సమీక్షలు చేసారు.

YS Jagan made vastu changes for his residence in Tadepalli will turn his political future

ఇక్కడే అధికారం
అందులో భాగంగా జగన్ తాడేపల్లిలో ఉంటున్న ఇంట్లో వాస్తు పైన పండితుల సూచనలు స్వీకరిం చారు. 2019 లో ఈ ఇంటిలోకి వచ్చిన తరువాతనే జగన్ కు అధికారం వచ్చింది. కాగా, అధికారం లోకి వచ్చిన తరువాత ఇంట్లో చేసిన మార్పులతో వాస్తు దోషం ఏర్పడి రాజకీయంగా నష్టం జరిగిం దనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. దీంతో, తన ఇంటికి రక్షణగా నిర్మించిన ఇనుప కంచె నిర్మాణం పైన సూచనలు వచ్చాయి. మార్పు లు చేయాలనే సూచనలతో జగన్ అప్రమత్తం అయ్యారు. తన ఇంటి చుట్టూ ఉన్న ఇనుప కంచెను వాస్తుకు అనుగుణంగా మార్పు చేస్తున్నారు. ఇటీవల దక్షిణ దిశలో కంచెను తీసివేశారు.

YS Jagan made vastu changes for his residence in Tadepalli will turn his political future

సీన్ మారుతుందా
ఇప్పుడు తాజాగా తూర్పు-ఈశాన్యం వైపు కంచెలో కొన్ని వరుసలను తొలగించారు. తూర్పు ఈశాన్యం మూత వేసి ఉంచడం మంచిది కాదని వాస్తు పండితులు చెప్పిన నేపథ్యంలో ఈ దిద్దుబాట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మార్పుల పైన వైసీపీ ముఖ్య నేతల్లో చర్చ మొదలైంది.
పాదయాత్ర సమయం నుంచి జగన్ సెంటిమెంట్ ఎక్కువగా నమ్ముకుంటున్నారు. విశాఖ శారదా పీఠం గురుజూ స్వరూపానందేంద్ర స్వామి సూచనలకు అనుగుణంగా నడుచుకొనే వారు. జగన్ ఎన్నికల్లో ఓటమి తరువాత స్వరూపానంద రుషికేష్ కు తన మకాం మార్పు చేసారు. ఇప్పుడు తిరిగి ప్రజల్లోకి వెళ్తూ.. మరో పొలిటికల్ ఇన్నింగ్స్ ప్రారంభిస్తున్న జగన్ ప్రస్తుతం చేస్తున్న వాస్తు మార్పు లు ఏ మేర కలిసి వస్తాయనేది చూడాలి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+