Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

పునరాలోచనలో జగన్ ? ఆ కేసులు, కేసీఆర్ దూకుడు- తప్పదంటే రంగంలోకి- అదొక్కటే భయం !

దేశవ్యాప్తంగా రాజకీయాలు వేగంగా మారిపోతున్నాయి. ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో బీజేపీ ఘన విజయాలు నమోదు చేస్తే తప్ప ఈ రాజకీయాలు కీలక మలుపు తీసుకోవడానికి సిద్ధమవుతున్నాయి. అందుకు అనుగుణంగా మోడీ వ్యతిరేకులంతా పావులు కదుపుతున్నారు. అదే సమయంలో మోడీకి ఇంతకాలం అనుకూలంగా ఉన్న వారు కూడా తమ వ్యూహాలు మార్చుకునే పనిలో బిజీగా ఉన్నట్లు కనిపిస్తోంది. అదే జరిగితే తెలుగు రాష్ట్రాల రాజకీయాలపైనా తీవ్ర ప్రభావం తప్పేలా లేదు.

మారుతున్న లెక్కలు

మారుతున్న లెక్కలు

దేశవ్యాప్తంగా రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కుతున్నాయి. ముఖ్యంగా ఐదు రాష్ట్రాల ఎన్నికల కేంద్రంగా సాగుతున్న రాజకీయాలు ఓ ఎత్తయితే తెలుగు రాష్ట్రాల కేంద్రంగా మొదలై జాతీయస్ధాయిలో ప్రత్యామ్నాయాల దిశగా సాగుతున్న రాజకీయాలు మరో ఎత్తుగా మారిపోతున్నాయి. ఇందులో కీలక ప్రాంతీయ శక్తులు మోడీకి వ్యతిరేకంగా దూసుకొస్తున్నాయి.

ఇప్పటివరకూ ప్రతీ అంశంలోనూ ప్రత్యర్ధుల్ని లెక్కచేయకుండా, మిత్రుల్ని కూడా లెక్క చేయకుండా నిర్ణయాలు తీసుకుంటున్న ప్రధాని మోడీని గద్దెదింపడమే లక్ష్యంగా ఈ రాజకీయాలు పయనిస్తున్నాయి. దీంతో ఆయన కూడా వ్యూహాలు మార్చుకోవాల్సిన పరిస్ధితులు ఏర్పడుతున్నాయి.

 కేసీఆర్- ఉద్ధవ్ భేటీతో

కేసీఆర్- ఉద్ధవ్ భేటీతో

ఇప్పటికే తెలంగాణలో బీజేపీతో ముఖాముఖీ పోరు సలుపుతున్న సీఎం కేసీఆర్.. ఇప్పుడు జాతీయ రాజకీయాలపై తనదైన ముద్ర వేసేందుకు ఇదే సరైన సమయంగా భావిస్తున్నారు. అందుకే మోడీకి ప్రత్యర్ధులుగా ఉన్న ప్రతీ ఒక్కరినీ టచ్ చేసే పనిలో బిజీగా కనిపిస్తున్నారు. గతంలో ఎన్నికలకు ముందు ఫెడరల్ ఫ్రంట్ పేరుతో హడావిడి చేసి సైలెంట్ అయిపోయిన కేసీఆర్.. ఈసారి మాత్రం బీజేపీని ఎదుర్కోవడంలో విఫలమైతే చంద్రబాబు తరహాలో ఇబ్బందులు తప్పవనే అంచనాలో ఉన్నారు.

దీంతో ఈసారి కీలకమైన ప్రాంతీయ పార్టీల నేతల్ని కూడగట్టే పనిలో ఉన్నారు. ఇప్పటికే డీఎంకే అధినేత స్టాలిన్, టీఎంసీ అధినేత్రి మమత కేసీఆర్ కు మద్దతు ప్రకటించారు. ఆ తర్వాత శివసేన అధినేత ఉద్ధవ్ థాక్రేతో భేటీ అయిన స్టాలిన్ ఉమ్మడి పోరుకు సై అన్నారు. దీంతో ఉద్ధవ్ వంటి కీలకమైన నేత మద్దతు దొరికితే బీజేపీతో పోరు రసవత్తరంగా మార్చేందుకు కేసీఆర్ కు మంచి ఊతం లభించినట్లయింది.

 జగన్ ఆడుగులపై ఆసక్తి

జగన్ ఆడుగులపై ఆసక్తి

ఓవైపు కేసీఆర్, మమత, స్టాలిన్, ఉద్ధవ్ ధాక్రే వంటి బలమైన ప్రాంతీయ పార్టీల నేతలు కూటమి కట్టేందుకు ఉమ్మడిగా ముందుకు ఉరుకుతుంటే మరోవైపు వైఎస్ జగన్ మాత్రం బీజేపీతో అంటీముట్టని స్నేహంతో కాలం గడిపేస్తున్నారు. కానీ ఆయనకు కూడా ఇప్పుడు పోరాడాల్సిన సమయం వచ్చేసినట్లే కనిపిస్తోంది. గతంలో కాంగ్రెస్ తో హోరాహోరీ పోరుతో జైలుకు కూడా వెళ్లొచ్చిన జగన్.. ఇప్పుడు ఆ రోజుల్ని మరోసారి గుర్తుకు తెచ్చుకోవాల్సిన పరిస్దితులు కనిపిస్తున్నాయి.

ఎందుకంటే బీజేపీతో ఎంతగా స్నేహంగా ఉన్నా తనపై అక్రమాస్తుల కేసుల్లో కానీ, బాబాయ్ వివేకా హత్య కేసులో కానీ సీబీఐ కనికరించే పరిస్ధితులు కనిపించడం లేదు. ఈ నేపథ్యంలో సీబీఐపై వైసీపీ విమర్శలు మొదలుపెట్టింది. దీంతో జగన్ అడుగులపై ఆసక్తి పెరుగుతోంది.

 సీబీఐ దూకుడు పెరిగితే

సీబీఐ దూకుడు పెరిగితే

ప్రస్తుతం తన అక్రమాస్తుల కేసుల్లో ఛార్జిషీట్ల దాఖలుతో పాటు తుది విచారణకు సైతం సీబీఐ, ఈడీ ముందుకు కదులుతున్నాయి. అదే సమయంలో సొంత బాబాయ్ వివేకానందరెడ్డి హత్య కేసులో కజిన్, కడప ఎంపీ అవినాష్ రెడ్డితో పాటు మరో ఇద్దరు బాబాయ్ లు భాస్కర్ రెడ్డి, మనోహర్ రెడ్డి పాత్రను నిరూపించేందుకు సీబీఐ దూకుడు ప్రదర్శిస్తోంది. ఇందులో ఏ ఒక్క అంశంలో సీబీఐ అరెస్టులకు దిగినా జగన్ వ్యూహాలు రాత్రికి రాత్రి మారిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటివరకూ కేంద్రంతో సత్సంబంధాలు కొనసాగిస్తూ, విపక్షాలు విమర్శిస్తున్నా పట్టించుకోకుండా ముందుకు సాగుతున్న జగన్.. తనదాకా వస్తే మాత్రం బీజేపీపై పోరుకు సిద్ధపడతారన్న అంచనాలు ఉన్నాయి. దీంతో సీబీఐ అడుగులు, వాటికి కౌంటర్ గా జగన్ వ్యూహాలు ఆసక్తి రేపుతున్నాయి.

జగన్ పై తీవ్ర ఒత్తిడి?

జగన్ పై తీవ్ర ఒత్తిడి?

రాజకీయాల్లో పరిస్ధితులు మారిపోవడానికి కొన్ని గంటలు కూడా చాలు. కాంగ్రెస్ పార్టీతో విభేదించిన జగన్ కూ, బీజేపీతో విభేదించిన చంద్రబాబుకు ఆ విషయం అందరి కన్నా ఎక్కువగా తెలుసు. ఇప్పుడు కేసీఆర్ బీజేపీతో పోరుకు శత విథాలా ప్రయత్నిస్తున్నారు. ఈ పోరులో ఆయన గెలిచినా, గెలవకపోయినా నష్టపోయేది ఏమీ లేదు.

ఎందుకంటే కేసీఆర్ పై ఆయన్ని ఇబ్బంది పెట్టే స్ధాయిలో క్రిమినల్ కేసులు కానీ, కేంద్రంతో తప్పనిసరిగా సంబంధాలు కొనసాగించాల్సిన పరిస్ధితులు కానీ లేవు. కానీ జగన్ కు అలా కాదు. దీంతో జగన్ ఇప్పుడు గతంలో చంద్రబాబుకు బీజేపీతో పోరులో ఎదురైన అనుభవాన్ని ప్రాతిపదికగా తీసుకుని తన పోరు ప్రారంభించాల్సి ఉంటుంది. దీంతో ఆ పోరులో జగన్ ఏం చేయబోతున్నారనేది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+