కిరణ్‌పై టి ఆగ్రహం: కేంద్రం టు సమైక్యంపై జగన్ డైలమా
హైదరాబాద్: ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి పైన తెలంగాణ ప్రాంత కాంగ్రెసు నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వారు సోమవారం ఉదయం ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణతో భేటీ అయ్యారు. ఈ సమయంలో కిరణ్ వైఖరి పట్ల వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. సీమాంధ్ర నేతలను మాత్రమే కలుస్తానని కిరణ్ అన్నారంటే తెలంగాణ ప్రజలను అవమానపర్చినట్లేనని, తమతో సమావేశానికి సిద్ధంగాలేని, తమను బహిష్కరించిన కిరణ్‌ను తామే బహిష్కరించాలని నిర్ణయించుకున్నారు.
ఆయనను ముఖ్యమంత్రిగా ఎందుకు గుర్తించాలని, ఆయన అవసరం తమకు మాత్రం ఏముంటుందని పలువురు ఆవేదన వ్యక్తం చేశారు. నిజామాబాద్ ఎంపి మధుయాష్కీ మాట్లాడుతూ.. సీమాంధ్ర నేతలే కిరణ్‌కు అవసరమా? అలాంటప్పుడు మొత్తం రాష్ట్రానికి ఆయన సిఎంగా ఉండటం ఎందుకని, టి ఎంపీలతో మాట్లాడబోనని అంటున్నారని, ఆయననే మనం సామాజిక బహిష్కరణ చేద్దామని ఘాటుగా వ్యాఖ్యానించారు.

ఎంపీలు పొన్నం ప్రభాకర్, పాల్వాయి గోవర్ధన్ రెడ్డిలు కూడా కిరణ్ వైఖరిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తాము ఎప్పుడు ఆయనను ముఖ్యమంత్రిగా గుర్తించడం లేదని, అధిష్టానాన్ని, తెలంగాణ ప్రజలను వద్దనుకున్నప్పుడు ఆయనకు ఆ ముఖ్యమంత్రి పదవిలో కొనసాగే నైతిక అర్హత లేదని విమర్శించారు.
జగన్ తర్జన భర్జన
అఖిల పక్షానికి వెళ్లే విషయమై వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో చర్చ సాగుతోంది. గతంలో కేంద్రం పైన భారం వేసి, ఇప్పుడు వెళ్లి సమైక్యాంధ్ర అంటే ఎలా ఉంటుందని, దీనిపై ఎలా స్పష్టత ఇవ్వాలనే విషయమై తర్జన భర్జన సాగుతోందట. ఈ విషయమై సోమవారం ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి, బాలినేని శ్రీనివాస్ రెడ్డి తదితరులతో జగన్ చర్చించారు. సమైక్యాంధ్రకు కట్టుబడి ఉన్నామని లేఖ పంపించి భేటీకి దూరంగా ఉంటే సరిపోతుందా అనే విషయంపై ప్రధానంగా చర్చ సాగినట్లుగా తెలుస్తోంది.












Click it and Unblock the Notifications