బెయిల్‌పై వచ్చి గవర్నర్‌ను కలుస్తారా: జగన్‌పై సోమిరెడ్డి

షరతులతో కూడిన బెయిల్ పైన విడుదలైన జగన్ గవర్నర్‌ను ఎలా కలుస్తారని ప్రశ్నించారు. అలా కలవడం కోర్టు ధిక్కారణే అన్నారు. గవర్నర్‌ను జగన్ కలవడం ద్వారా సాక్ష్యులను ప్రభావితం చేసే అవకాశముందన్నారు.
మాజీ పార్లమెంటు సభ్యుడు బాలశౌరీ జిల్లాలో పవర్ ప్రాజెక్టు పేరుతో రూ.750 కోట్లు దోచుకున్నారని ఆరోపించారు. దివంగత వైయస్ రాజశేఖర రెడ్డి హయాంలో అవినీతికి పాల్పడిన వారంతా ఇప్పుడు వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరుతున్నారని ఆరోపించారు.
కేంద్రమంత్రుల ప్రవర్తన తెలుగు వాళ్ల గొంతు కోసేలా ఉందన్నారు. కేంద్రమంత్రులు రాజీనామాలు అని చెబుతూ డ్రామాలు ఆడుతూ ప్రభుత్వ రాయితీలు పొందుతున్నారని ధ్వజమెత్తారు.
జగన్ పార్టీతో పొత్తు లేదు: రాఘవులు
వైయస్సార్ కాంగ్రెసు పార్టీతో సిపిఎం సీట్ల బేరం కుదుర్చుకుందన్న సిపిఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ పైన సిపిఎం రాష్ట్ర కార్యదర్శి రాఘవులు మండిపడ్డారు. జగన్ పార్టీతో తమకు ఎలాంటి సర్దుబాట్లు, సీట్ల బేరం లేదన్నారు. తమకు చాటుమాటుగా మాట్లాడుకునే అలవాటు లేదని నారాయణకు కౌంటర్ ఇచ్చారు. పొత్తులపై నారాయణ తప్పుడు ఆరోపణలు చేశారన్నారు. ఈ మేరకు రాఘవులు బహిరంగ లేఖ విడుదల చేశారు.












Click it and Unblock the Notifications