హోదాపై మోడీ ప్రభుత్వం మెలిక: ఆశ్చర్యపోయిన జగన్ (పిక్చర్స్)
చిత్తూరు: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదాకు 14వ ఆర్థిక సంఘానికి ముడిపెట్టడం పట్ల వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి మంగళవారం ఆశ్చర్యం వ్యక్తం చేశారు.
ప్రత్యేక హోదా విషయమై కేంద్రం 14వ ఆర్థిక సంఘానికి ముడిపెడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. జగన్ తిరుపతిలో మునికోటి కుటుంబ సభ్యులను ఓదార్చారు. మునికోటిని కాపాడేందుకు వెళ్లి గాయపడిన శేషాద్రిని కూడా పరామర్శించారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడారు.
ఆర్థిక సంఘానికి ప్రత్యేక హోదాపై సిఫార్సు చేసే అధికారం లేదన్నారు. హోదా ఇవ్వకూడదనే ఇలా మెలిక పెడుతున్నారని మండిపడ్డారు. కేంద్రం హోదా ఇవ్వకుంటే చంద్రబాబు మద్దతు ఉపసంహరించుకొని, రోడ్డెక్కాలని సూచించారు.

జగన్
ఒకరి ప్రాణం పోతే తప్ప ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడులో చలనం రాలేదా? కేంద్రం ప్రత్యేక హోదా ఇవ్వకుంటే చంద్రబాబు కేంద్రంలో తన మంత్రులను ఉపసంహరించుకొని రోడ్డెక్కాలని వైసిపి అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి మంగళవారం డిమాండ్ చేశారు.

జగన్
ఏపీకి ప్రత్యేక హోదా కావాలంటూ మునికోటి ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. ఆయన కుటుంబాన్ని జగన్ పరామర్శించారు. అనంతరం మునికోటిని కాపాడపోయి గాయాలపాలైన శేషాద్రిని పరామర్శించారు.

జగన్
అనంతరం విలేకరులతో మాట్లాడారు. ఏపీకి ప్రత్యేక హోదా మన హక్కు అన్నారు. ప్రత్యేక హోదా లేకుంటే రాష్ట్రానికి పరిశ్రమలు రావన్నారు. రాష్ట్రం వెనుకబడుతుందన్నారు.

జగన్
హోదా పైన టిడిపి నేతలు ఒక్కొక్కరు ఒక్కో విధంగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. మునికోటి కుటుంబానికి అండగా ఉంటామని చెప్పారు.

జగన్
ఒకరు చనిపోతే తప్ప బాబులో చలనం రాలేదన్నారు. చంద్రబాబు రోజుకో మాట మాట్లాడుతున్నారన్నారు. ప్రత్యేక హోదా ఇవ్వకూడదని మనసులో పెట్టుకొని ప్రజలను మభ్య పెట్టేందుకు బిజెపి - టిడిపిలు ప్రయత్నిస్తున్నాయన్నారు.

జగన్
మునికోటి కుటుంబానికి రూ.10 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. చంద్రబాబుకు జ్ఞానోదయం అయ్యేలా, కేంద్రానికి కళ్లు తెరిపించేలా కోటి ప్రాణత్యాగం చేశారన్నారు.

జగన్
అలాంటి మునికోటికి ఎన్ని కోట్లు ఇచ్చినా తక్కువే అన్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం మేల్కొనాలన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక హోదా ఇవ్వకుంటే చంద్రబాబు కేంద్రం నుంచి వైదొలగాలన్నారు.

జగన్
తన కేంద్రమంత్రులను ఉపసంహరించుకొని, రోడ్డు పైకి వచ్చి పోరాడాలన్నారు. ప్రత్యేక హోదా కోసం ఉద్యమిస్తామన్నారు. అందరం కలిసి ఉద్యమిద్దామన్నారు.

జగన్
కేంద్రం, చంద్రబాబు మెడలు వంచి అయినా ప్రత్యేక హోదా తీసుకు వస్తామన్నారు. రాష్ట్రంలో ఎక్కడ ఏ సమస్య వచ్చినా స్పందించేది జగన్ మాత్రమేనని, వైసిపి మాత్రమే అన్నారు.

జగన్
ప్రత్యేక హోదా ఇవ్వకుండా ఉండేందుకు కారణాలు వెతుక్కుంటున్నారని మండిపడ్డారు. 14వ ఫైనాన్స్ కమిషన్‌కు హోదాతో సంబంధం లేదన్నారు.

జగన్
కాంగ్రెస్, బిజెపిలు కలిసి అన్యాయంగా రాష్ట్రాన్ని విడగొట్టాయని, ఏపీకి జరిగిన అన్యాయాన్ని ప్రత్యేక హోదాతో ఫుల్ ఫిల్ చేస్తామని చెప్పారన్నారు.

జగన్
ఇప్పుడు మాత్రం కేంద్రం ప్రత్యేక హోదా పైన హామీని నిలబెట్టుకోవడం లేదన్నారు. పార్లమెంటులో ఇచ్చిన హామీని నెరవేర్చలా అని ప్రశ్నించారు.
-
"దేశంలోనే పెట్టుబడులకు అత్యంత అనుకూలమైన ప్రాంతం ఏపీ" -
హైదరాబాద్ ను మించి అమరావతి నిర్మాణం చేస్తామన్న సీఎం చంద్రబాబు! -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఈ అరటి కాయల మధ్య ఉన్న పామును కనిపెట్టగలరా..? -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్!












Click it and Unblock the Notifications