వదిలేదిలేదు, బతకాలంటే భయమేస్తోంది:బాబుపై జగన్
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నెల రోజుల పాలన పైన వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి సోమవారం తీవ్రస్థాయిలో నిప్పులు చెరిగారు. ఆయన ఉదయం గవర్నర్ నరసింహన్‌ను కలిశారు. ఏపీలో పరిస్థితులను వివరించారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు.
స్థానిక ప్రభుత్వం న్యాయబద్ధంగా ఉండే తాము నాలుగు జెడ్పీ చైర్మన్లను, 36 మున్సిపాలిటీలను గెలిచే వాళ్లమని, 1 చైర్మన్, 19 మున్సిపాలిటీలకే పరిమితమయ్యామని ఆవేదన వ్యక్తం చేశారు. స్థానిక సంస్థల పరోక్ష ఎన్నికల్లో అధికార పార్టీ అక్రమాలకు పాల్పడిందన్నారు.

తాము దీనిని ఇంతటితే వదిలేసే ప్రసక్తే లేదన్నారు. గవర్నర్‌తో పాటు ఈ అంశాలను రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ దృష్టికి తీసుకు వెళ్తామన్నారు. భయపెట్టి, ప్రలోభ పెట్టి, కిడ్నాప్ చేసి అధికార పార్టీ తమ సభ్యులను తీసుకుందన్నారు. నిజమైన ప్రతిపక్షం ప్రజలని, రాబోయే రోజుల్లో వారి అధికార పార్టీ వారి కాలర్ పట్టుకొని ఇచ్చిన హామీల పైన ప్రశ్నించే పరిస్థితి వస్తుందన్నారు.
అధికార పార్టీ అరాచకాలను చూస్తుంటే రాష్ట్రంలో బతకాలంటేనే భయమేస్తుందన్నారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చాక 17 మంది తమ పార్టీకి చెందిన కార్యకర్తలు హత్య గావించబడ్డారని, 110 మంది గాయపడ్డారని ఆరోపించారు. ఈ చర్యలను మనం చూస్తూ ఊరుకుంటే రాబోయే రోజుల్లో చెడు అభిప్రాయాలు ఏర్పడతాయన్నారు.
దీనిని తాము రాష్ట్రపతి దృష్టికి తీసుకు వెళ్తామన్నారు. నిందితుల మీద యాక్షన్ తీసుకోక పోవడానికి కారణమేమిటో చెప్పాలన్నారు. ఎస్సీలు, మహిళలు అని చూడకుండా దాడులు చేస్తున్నారని ఆరోపించారు. ఆంధ్రప్రదేశ్‌లో బతకాలంటేనే భయంగా ఉందన్నారు. స్థానిక ఎన్నికల పరిస్థితే ఇలా ఉంటే ఉప ఎన్నికలు ఎలా నిర్వహిస్తోరోనని భయంగా ఉందన్నారు.
ఏపీలో ప్రజాస్వామ్యం ఖూనీ అయిందన్నారు. అధికార పార్టీ అరాచకాల పైన గవర్నర్‌కు వివరించామని, ఆయన సానుకూలంగా స్పందించారన్నారు. ప్రతిపక్షాల గొంతు నొక్కాలనుకోవడం మూర్ఖత్వమని, అసలైన ప్రతిపక్షం ప్రజలే అన్నారు. అబద్దాలు, మోసాలతో చంద్రబాబు అధికారంలోకి వచ్చారన్నారు.












Click it and Unblock the Notifications