బాబుతో భయం: కేంద్రమంత్రితో జగన్, లోకేష్‌కు చెక్కు
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేస్తున్న పనులతో భయమేస్తోందని, డబ్బు సంపాదించాలన్న ఒకే ఒక్క కోరికతో పట్టిసీమను నిర్మిస్తూ రాష్ట్ర ప్రయోజనాలను బాబు పణంగా పెడుతున్నారని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్ విమర్శించారు. రెండో రోజు ఢిల్లీ పర్యటనలో భాగంగా మంగళవారం ఆయన పార్టీకి చెందిన ఎంపీలతో కలిసి ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీతో భేటీ అయ్యారు.
అనంతరం విలేకరులతో మాట్లాడారు. ప్రధాన మంత్రి మోదీతో చెప్పిన అంశాలన్నీ ఆర్థిక మంత్రి జైట్లీకి కూడా చెప్పామన్నారు. రాష్ట్రానికి మంచి చేయాలని కోరామని, ఆయన కూడా సానుకూలంగా విన్నారని, మంచి జరుగుతుందని ఆశిస్తున్నామన్నారు. పోలవరం ప్రాజెక్టు, పట్టిసీమ టెండర్ల వ్యవహారాన్ని కూడా అరుణ్ జైట్లీకి వివరించామని చెప్పారు. పట్టిసీమపై తమ వైఖరి చాలా స్పష్టంగా ఉందన్నారు.
పోలవరం పని ప్రారంభం కావటంతోనే రాష్ట్రం 35 టీఎంసీలు కోల్పోయిందని, పట్టిసీమతో మరో 35 టీఎంసీల నీరు కృష్ణా నది నుంచి కోల్పోవాల్సి వస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. అందుకే తాము పట్టిసీమను వ్యతిరేకిస్తున్నామన్నారు. పట్టిసీమ వల్ల పోలవరం ప్రాజెక్టు మరుగున పడుతుందేమోననేదే తమ ఆందోళన అన్నారు. విభజన చట్టం హామీలను అమలు చేయాలని తాము కోరామన్నారు.
విరాళాలు తీసుకున్న లోకేష్
తెలుగుదేశం పార్టీ యువనేత నారా లోకేష్‌కు రంగారెడ్డి జిల్లా ఉప్పల్ నియోజకవర్గం కాప్రా డివిజన్‌కు చెందిన కాప్రా సర్కిల్ టీడీపీ ప్రధాన కార్యదర్శి మల్లేష్ వంశీరాజ్ ఆధ్వర్యంలో శివ అతని మిత్రులు కలిసి రూ.41వేలను అందజేశారు. వీటిని ఎన్టీఆర్ ట్రస్ట్ సంక్షేమ కార్యక్రమాల నిర్వహణ కోసం ఇచ్చారు. ఈ సందర్భంగా నారా లోకేష్ వారిని అభినందించారు.

జగన్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేస్తున్న పనులతో భయమేస్తోందని, డబ్బు సంపాదించాలన్న ఒకే ఒక్క కోరికతో పట్టిసీమను నిర్మిస్తూ రాష్ట్ర ప్రయోజనాలను బాబు పణంగా పెడుతున్నారని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్ విమర్శించారు.

జగన్
రెండో రోజు ఢిల్లీ పర్యటనలో భాగంగా మంగళవారం ఆయన పార్టీకి చెందిన ఎంపీలతో కలిసి ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీతో భేటీ అయ్యారు.

జగన్
అనంతరం విలేకరులతో మాట్లాడారు. ప్రధాన మంత్రి మోదీతో చెప్పిన అంశాలన్నీ ఆర్థిక మంత్రి జైట్లీకి కూడా చెప్పామన్నారు.

లోకేష్
తెలుగుదేశం పార్టీ యువనేత నారా లోకేష్‌కు రంగారెడ్డి జిల్లా ఉప్పల్ నియోజకవర్గం కాప్రా డివిజన్‌కు చెందిన కాప్రా సర్కిల్ టీడీపీ ప్రధాన కార్యదర్శి మల్లేష్ వంశీరాజ్ చెక్కును అందజేశారు.












Click it and Unblock the Notifications