వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పార్టీలో మిగిలిన 44 మందికి ఏ ఆపర్లు ఇస్తున్నారో నాకు తెలుసు: బాబుపై జగన్

|
Google Oneindia TeluguNews

ఒంగోలు: తమ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలను టీడీపీ ప్రలోభాలకు గురి చేస్తోందని, అవన్నీ తన దృష్టికి వస్తున్నాయని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి శనివారం అన్నారు.

జనసేన పార్టీ కోసం పవన్ కళ్యాణ్ చేతికి ఆనాటి రూ.3 కోట్లు, టైంకు ఇచ్చిన మెగా బ్రదర్?జనసేన పార్టీ కోసం పవన్ కళ్యాణ్ చేతికి ఆనాటి రూ.3 కోట్లు, టైంకు ఇచ్చిన మెగా బ్రదర్?

ప్రకాశం జిల్లా తాళ్లూరు మండలం కొర్రపాటివారిపాలెంలో వైయస్ జగన్ పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఢిల్లీలో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించారు. ప్రత్యేక హోదాపై ఎలా ముందుకెళ్లాలి, అవిశ్వాసంపై ఎలా చేద్దామనే అంశాలపై చర్చించారు.

మా ఎమ్మెల్యేలను చేర్చుకున్నారు

మా ఎమ్మెల్యేలను చేర్చుకున్నారు

ఈ సందర్భంగా జగన్ మాట్లాడారు. తమ పార్టీ నుంచి గెలిచిన పలువురు ఎమ్మెల్యేలను టీడీపీ ప్రలోభ పెట్టి చేర్చుకుందని జగన్ అన్నారు. వారిని అనర్హులుగా ప్రకటించాలన్నారు. పార్టీలో మిగిలిన 44 మందికి ఎలాంటి ఆఫర్లు ఇస్తున్నారో తన దృష్టికి వచ్చిందని చెప్పారు.

Recommended Video

YSRCP MLA's Resignation...Is It True?
 వేలెత్తి చూపలేని విధంగా

వేలెత్తి చూపలేని విధంగా

రాజ్యసభ ఎన్నికల్లో ఓట్లు వేయడం కోసం తమ పార్టీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి వెళ్లే అవసరం ఉంటుందని జగన్ తెలిపారు. కాబట్టి తమ పార్టీ ఎమ్మెల్యేలు ఒకరోజు అసెంబ్లీకి హాజరు కావాల్సి ఉంటుందన్నారు. తమ వైపు వేలెత్తి చూపలేని విధంగా తాము రాజకీయాలు చేస్తామని చెప్పారు.

పోరాటం చేస్తాం

పోరాటం చేస్తాం

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి గెలుపొంది, తెలుగుదేశం పార్టీలో చేరిన ఎమ్మెల్యేలపై వేటు వేసే వరకు తాము పోరాటం చేస్తామని జగన్ చెప్పారు. ఏపీకి కేంద్రం నుంచి రావాల్సిన హక్కుల కోసం అందరూ మద్దతివ్వాలన్నారు.

హోలీ వేడుకల్లో జగన్

హోలీ వేడుకల్లో జగన్

ఇదిలా ఉండగా, జగన్ శుక్రవారం చీమకుర్తి మండలంలో బీవీఎస్‌ఆర్‌ ఇంజినీరింగ్‌ కళాశాలలో విద్యార్థులతో కలిసి హోలీ వేడుకల్లో పాల్గొన్నారు. ఆ తర్వాత పాదయాత్ర ప్రారంభించారు. శుక్రవారం మొత్తం 13 కిలోమీటర్ల మేర పాదయాత్ర చేశారు.

English summary
YSR Congress Party chief YS Jagan Mohan Reddy meets MPs and MLAs in Prakasham district to chalked out over Special Status issue.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X