వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జిఎస్టీ బిల్లుకు హోదాతో లింక్ పెట్టిన జగన్: ఆ పత్రికకు చురకలు

By Pratap
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వం వస్తు సేవల పన్ను (జిఎస్టీ) బిల్లుతో ప్రత్యేక హోదాకు వైయస్సార్ కాంగ్రెసు అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి లింక్ పెట్టారు. జిఎస్టీ బిల్లును తెచ్చిన నేపథ్యంలో అమ్మకం పన్ను కేంద్ర పరిధిలోకి వెళ్లిపోయిందని, దాని వల్ల పారిశ్రామికవేత్తలకు ప్రయోజనాలు చేకూర్చడానికి గానీ రాయితీలు ఇవ్వడానికి గానీ కుదరదని ఆయన అన్నారు. ప్రత్యేక హోదా ఇస్తే జిఎస్టీకి వంద శాతం మినహాయింపు ఉంటుంది కాబట్టి ప్రయోజనం కలుగుతుందని ఆయన అన్నారు.

ప్రత్యేక హోదా సోమవారం ఢిల్లీలో రాష్ట్రపతిని కలిసిన తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రపతిని ఎవరైనా కలిసినప్పుడు అక్కడ మీడియా ఏదీ ఉండదని, ఓ ఫొటోగ్రాఫర్ మధ్యలో వచ్చిన ఫొటో తీసుకుని వెళ్లిపోతాడని చెబుతూ అక్కడ తాము ఉన్నట్లుగా ఓ పత్రిక చంద్రబాబును రాష్ట్రపతి పొగిడినట్లు రాసిందని, చంద్రబాబు రాయించుకున్నారని ఆయన అన్నారు.

చంద్రబాబు మాదిరిగా పనిచేస్తే దేశం ఎక్కడికో వెళ్లిపోతుందని రాష్ట్రపతి అన్నట్లుగా ఓ పత్రిక రాసిందని గుర్తు చేస్తూ పత్రిక ప్రతిష్టను కూడా ఫణంగా పెట్టి రాశారని, చంద్రబాబు రాయించుకున్నారని ఆయన అన్నారు. ఇది ఆశ్చర్యం కలిగిస్తుందని ఆయన అన్నారు. ప్రత్యేక హోదా విషయంలో దారుణం జరుగున్నా చంద్రబాబులో ఉలుకూ పలుకూ లేదని అన్నారు. రాష్ట్రం నష్టపోతుందనీ పిల్లలకు ఉద్యోగాలు రావని తెలిసినా చంద్రబాబు ప్రత్యేకహోదాను అడుగలేని స్థితిలో ఉన్నారని జగన్ అన్నారు.

YS Jagan meets Pranabh, lashes out at Chandrababu

కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడిని చంద్రబాబు రాష్ట్రానికి తీసుకుని వచ్చి సన్మానాలు చేస్తారని, వెంకయ్యతో పాటు సమావేశంలో పాల్గొంటారని, కేంద్రం రాష్ట్రానికి ఎంతో మేలు చేస్తుందని చెబుతారని, వేరే సందర్భాల్లో కేంద్రం ఏమీ చేయడం లేదని ఏడుస్తారని, ఒక మనిషి ఇంత దారుణంగా వైఖరులు మారుస్తుంటే ఇచ్చివారికి కూడా ఇవ్వాలని అనిపించదని అన్నారు.

రాష్ట్రానికి 15 ఏళ్లు ప్రత్యేక హోదా కావాలని అడిగిన జగన్, ఎన్నికలు అయిపోయిన తర్వాత అది సంజీవిని కాదని అంటారని జగన్ విమర్శించారు. చంద్రబాబుకు సీరియస్‌నెస్, చిత్తశుద్ధి లేకపోవడం వల్ల ప్రత్యేక హోదాను అడగడం లేదని, కేంద్ర మంత్రివర్గం నుంచి తన మంత్రులను ఉపసంహరించుకోవడం లేదని ఆయన అన్నారు. అదో పార్టీనా, డ్రామా కంపెనీ అని తెలుగుదేశం పార్టీని ఉద్దేశించి అన్నారు. అటువంటి పార్టీకి రాష్ట్రాన్ని పాలించే నైతిక విలువలున్నాయా అని అడిగారు.

YS Jagan meets Pranabh, lashes out at Chandrababu

చంద్రబాబు 23వ సారి ఢిల్లీకి వచ్చినప్పుడు ప్రత్యేక హోదా గురించి రాలేదని, పుష్కరాలకు ఆహ్వానించడానికి వచ్చానని చెప్పారని, ఆంధ్రలో ఉన్నప్పుడు అరుణ్ జైట్లీపై చంద్రబాబుకు రక్తం మరిగిందని, ఢిల్లీకి వచ్చి పుష్కరాలకు ఆహ్వానించారని అన్నారు. ఢిల్లీకి చంద్రబాబు వచ్చింది బిజెపికి అల్టిమేటం ఇవ్వడానికి కాదట, పుష్కరాలకు ఆహ్వానించడానికట అని జగన్ అన్నారు. దేవుడి మీద కూడా చంద్రబాబుకు గౌరవం, నమ్మకం లేదని అన్నారు. విజయవాడలో గుళ్లు కొట్టించి, పుష్కరాలకు ఆహ్వానించడానికి ఢిల్లీ వచ్చారని అన్నారు.

దేవుడి భూమిలో కూడా చంద్రబాబు అవినీతికి కూడా పాల్పడ్డారంటూ సదావర్తి భూముల వ్యవహారాన్ని ఆయన ప్రస్తావించారు. ఢిల్లీలో చంద్రబాబు ఇంగ్లీషులో మీడియా సమావేశం పెట్టరని, మోడీని ఏమీ అనరని ఆయన అన్నారు. తమలాంటి వాళ్లు ప్రత్యేక హోదా గురించి మాట్లాడితే తమ మీద బండలేస్తారు, అభాండాలేస్తారని అన్నారు. అన్యాయం చేస్తే చంద్రబాబు చరిత్ర హీనులుగా మిలిగిపోతారని అన్నారు.

తాము ప్రత్యేక హోదాపై నిరంతర పోరాటం చేస్తామని ఆయన చెప్పారు. అపాయింట్‌మెంట్ ఇస్తే ప్రధాని మోడీని, బిజెపి అధ్యక్షుడు అమిత్ షాను కూడా కలుస్తామని చెప్పారు. ఇతర పార్టీల నాయకులను కలిసి ప్రత్యేక హోదాకు మద్దతు కూడగడుతామని ఆయన అన్నారు. తమను ప్రధాని వద్దకు తీసుకుని వెళ్లాలని అడిగితే కూడా చంద్రబాబు ఆ పని చేయడం లేదని ఆయన అన్నారు. తమను తీసుకుని వెళ్తే మోడీ వద్ద గట్టిగా మాట్లాడుతామని చెప్పినా చంద్రబాబుకు పట్టదని ఆయన అన్నారు.

ప్రత్యేక హోదా విషయంలో మోడీ తప్పు కూడా ఉందని, తాము తిరుపతి సభ ప్రసంగాన్ని వీడియో ప్రధర్శించి చూపించామని ఆయన చెప్పారు.

English summary
YSR Congress party president YS Jagan, lashed out at Andhra Pradesh CM Nara Chandrababu Naidu after meeting President Pranabh Mukherjee on special status to AP.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X