జగన్‌కు శరద్ పవార్ షాకిచ్చారా? పనిలో పనిగా హెలెన్

ముంబై: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి సోమవారం మధ్యాహ్నం కేంద్రమంత్రి, నేషనలిస్ట్ కాంగ్రెసు పార్టీ అధినేత(ఎన్సీపి) శరద్ యాదవ్‌ను కలిసి పార్లమెంటులో తెలంగాణ బిల్లును వ్యతిరేకించాలని కోరారు. ఎపి విభజన విషయంలో కేంద్రం ఏకపక్షంగా వెళ్తోందని బిల్లును అడ్డుకోవాలని కోరారు.

దానికి పవార్ నుండి జగన్‌కు ఎలాంటి హామీ ఉండదనే చెప్పవచ్చు. శరద్ పవార్ తెలంగాణను ఇచ్చి విదర్భ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. ఈ నేపథ్యంలో జగన్‌కు తెలంగాణ విషయంలో హామీ వచ్చి ఉండదని భావిస్తున్నారు.

YS Jagan meets Sharad Pawar

మరోవైపు ఇటీవల రాష్ట్రాన్ని అతలాకుతలం చేసిన ఫైలిన్, హెలెన్ తుఫాను బాధితులను ఆదుకోవాలని జగన్ ఎన్సీపి అధినేతను కోరారు. ఈ తుఫానుల కారణంగా రాష్ట్రంలోని రైతులు, పేదలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారని పవార్ దృష్టికి తీసుకు వెళ్లారు. బాధితులకు పూర్తి ఆర్థిక సాయం అందిస్తానని జగన్‌కు పవార్ హామీ ఇచ్చారు. వీలైనంత త్వరగా కేంద్రం నుండి నిధులు అందేలా చూస్తామని చెప్పారు.

రేపు, ఎల్లుండి గోదావరి జిల్లాల్లో జగన్

వైయస్ జగన్ మంగళ, బుధవారాల్లో తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లో పర్యటించనున్నారు. మంగళవారం తూర్పు, బుధవారం పశ్చిమ గోదావరి జిల్లాలో పర్యటించి తుఫాను బాధితులను పరామర్శించనున్నారు.

Y S Jaganmohan Reddy andUddhav Thackeray

కొత్త రాజధానికి నిధులెవరిస్తారు?

రాష్ట్ర విభజన జరిగితే కొత్త రాజధాని నిర్మాణానికి నిధులు ఎవరిస్తారని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నేత తోట చంద్రశేఖర్ ప్రశ్నించారు. కృష్ణా జిల్లా నూజివీడులో పార్టీ విస్తృతస్థాయి సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడారు. విభజనతో హైదరాబాదుపై సీమాంధ్రులకు హక్కు ఉండదని, కొత్త రాజధాని నిర్మాణానికి లక్ష ఎకరాలు, పదిలక్షల కోట్ల రూపాయలు అవసరమన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+