బాబొచ్చాడు.. పంగనామాలు పెట్టాడు: 'అనంత' యాత్రలో జగన్ (ఫోటోలు)
అమరావతి: ఎన్నికలకు ముందు ఇచ్చిన ఏ ఒక్క హామీనీ నెరవేర్చకుండా ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రజలను మోసం చేస్తున్నారని వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. నాలుగో విడత రైతు భరోసా యాత్రలో భాగంగా మూడో రోజున బత్తలపల్లి జంక్షన్‌లో జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు.
సీఎం చంద్రబాబు ఎన్నికలప్పుడు ఏ హామీలనైతే ఇచ్చారో ఆ హామీలన్నీ నెరవేర్చేలా ఆయనపై గట్టిగా ఒత్తిడి తీసుకొచ్చేందుకు ప్రజలంతా ఒక్కటి కావాలని పిలుపునిచ్చారు. చంద్రబాబుకు బుద్ధిరావాలంటే అందరూ ఒక్కటై పోరాడాలని ఆయన కోరారు. రైతులు, చేనేత కార్మికుల జీవితాలతో ముఖ్యమంత్రి చెలగాటమాడుతున్నారని మండిపడ్డారు.
చంద్రబాబు పాలనలో రైతులు ఆత్మహత్యలు చేసుకునే స్థితికి దిగజార్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. చంద్రబాబు పాలన గురించి మూడు ముక్కల్లో, మూడు మాటల్లో చెప్పాలంటే మోసం..మోసం..మోసం అని చెప్పారు. దీంతో అక్కడున్న వారంతా హర్షధ్వానాలు వ్యక్తపరిచారు. శుక్రవారం ధర్మవరం నియోజకవర్గంలో ఐదు కుటుంబాలను జగన్ పరామర్శించారు.

బాబొచ్చాడు.. పంగనామాలు పెట్టాడు: 'అనంత' యాత్రలో జగన్
ఈ రోజు డ్వాక్రా అక్కచెల్లెమ్మల దగ్గరికి వెళ్లి ఎలా ఉన్నారమ్మా అని అంటే ‘బాబు వచ్చాడన్నా.. గెలిచాడన్నా..మాకు మూడు పంగనామాలు పెట్టాడన్నా' అని అంటున్నారు. చదువుకున్న పిల్లల దగ్గరకి వెళ్లి ఎలా ఉన్నారని ప్రశ్నిస్తే ‘బాబు వచ్చాడన్నా..ముఖ్యమంత్రి జాబులో కూర్చున్నాడన్నా.. కానీ మాకు మాత్రం పోస్టింగులు లేవన్నా' అని అంటున్నారు.

బాబొచ్చాడు.. పంగనామాలు పెట్టాడు: 'అనంత' యాత్రలో జగన్
డీఎస్సీ పరీక్షలు రాసి ఏడాది దాటుతున్నా పోస్టింగులు ఇవ్వడం లేదని ఆ పిల్లలు వాపోతున్నారు అని జగన్ ఆవేదనగా అన్నారు. కానీ బాబు వచ్చిన తర్వాత ఉద్యోగాలు ఇవ్వడమేమో కానీ ఉన్నవి పీకేస్తున్నారని అందరూ వాపోతున్నారు. ‘బాబొచ్చాడు..35 వేల మంది ఫీల్డ్ అసిస్టెంట్లను ఇంటికి పంపించాడు. బాబొచ్చాడు.. దాదాపు 40 వేల మంది ఆదర్శ రైతులను ఇంటికి పంపాడు. బాబొచ్చాడు.. 40 వేల మంది అంగన్‌వాడీ కార్మికులు సమ్మె చేస్తావున్నా పట్టించుకోని పరిస్థితుల్లో ఉన్నాడు' అని జగన్ అన్నారు.

బాబొచ్చాడు.. పంగనామాలు పెట్టాడు: 'అనంత' యాత్రలో జగన్
2015-16 సంవత్సరానికి కరువు మండలాలను ప్రకటించండి. రైతులంతా అల్లాడిపోతున్నారు అని కోరితే చంద్రబాబు పట్టించుకున్న పాపానపోలేదు. చివరకు ఆయా జిల్లాలన్నీ తుపాను వచ్చి అతలాకుతలం అయిన తర్వాత వర్షాలు బాగా పడిన తర్వాత మరో 163 మండలాలను కరువు ప్రాంతాలుగా ప్రకటించారు. వర్షాలు పడిన తర్వాత కరువు మండలాలు ప్రకటించిన ముఖ్యమంత్రి దేశంలో ఎవరైనా ఉన్నారూ అంటే అది చంద్రబాబే. అంతటి దారుణంగా చంద్రబాబు రైతుల జీవితాలతో చెలగాటమాడుతున్నారని అర్థమవుతోంది.

బాబొచ్చాడు.. పంగనామాలు పెట్టాడు: 'అనంత' యాత్రలో జగన్
ఇక రుణమాఫీ కాదు కదా రైతుల రుణాలపై వడ్డీ కూడా మాఫీ కాలేదు. చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యే నాటికి రూ.87,612 కోట్ల మేర రైతులు బ్యాంకులకు చెల్లించాల్సిన వ్యవసాయ రుణాలు ఉన్నాయి. చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన ఈ 20 నెలల్లో ఆ రుణాలపై 14 శాతం వడ్డీ పెరిగింది. రుణాలు చెల్లించవద్దంటూ చంద్రబాబు చెప్పిన మాటలు నమ్మి చెల్లించని నేరానికి ఈ రోజు ఆ రైతులపై ఈ అపరాధపు వడ్డీ భారం రూ.20 వేల కోట్లు పడింది.

బాబొచ్చాడు.. పంగనామాలు పెట్టాడు: 'అనంత' యాత్రలో జగన్
ఆ 20 వేల కోట్లను బ్యాంకులు వసూలు చేస్తామంటున్నాయి. అయితే రెండేళ్లకు కలిపి చంద్రబాబు రుణమాఫీ కింద ఇచ్చిన మొత్తం రూ.7,300 కోట్లు మాత్రమేనన్నారు. అంటే వడ్డీలో మూడో వంతుకు కూడా సరిపోని విధంగా చంద్రబాబు గారి రుణమాఫీ పథకం అమలుజరుగుతోంది. ముఖ్యమంత్రి అయిన వెంటనే కొత్త ఇళ్లను కట్టిస్తామని బాబు హామీ ఇచ్చారు. రాష్ట్రంలో గుడిసెలే లేకుండా చేస్తానన్నారు. ఇంటికో ఉద్యోగమన్నారు. ఉద్యోగం ఇవ్వకపోతే రూ.2 వేలు నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు.
-
ఉగాది ఎప్పుడు చేసుకోవాలి 19 లేక 20 తేదీనా - వరుస సెలవులపై తాజా నిర్ణయం..!! -
ఏపీ మీదుగా బెంగళూరు, చెన్నై ప్రత్యేక రైళ్లు.. ఇకపై: హాల్ట్ స్టేషన్లు -
విజయ్- త్రిష పెళ్లికి త్రిష తల్లి గ్రీన్ సిగ్నల్..? -
West Bengal Survey: బెంగాల్లో అనూహ్య ఫలితాలు?-తేల్చేసిన మ్యాట్రిజ్ సర్వే..! -
LPG కొరతకు చెక్.. భారత్ మార్కెట్ లోకి DME Fuel !! -
ఏప్రిల్ నెలలో మేషరాశి, వృషభ రాశి జాతక ఫలం -
వైసీపీలోకి సీనియర్ నేత రీ ఎంట్రీ, అదే బాటలో..!! -
కుప్పకూలుతున్న పసిడి ధరలు- భారీగా క్రాష్ -
అందుకే.. విజయ్ జన నాయగన్ డిలే అయింది: పవన్ కల్యాణ్ -
మాస్కోలోని పుతిన్ నివాసంలో తలదాచుకున్న ఇరాన్ సుప్రీం లీడర్..?? -
బంగారం ధరలకు పూర్వవైభవం- పరుగులు -
ఉత్తరాభాద్ర నక్షత్రంలో శని సంచారం: కుంభరాశితో పాటు వీరికి సకల సంపదలు!












Click it and Unblock the Notifications