అదే నిజమైతే 'భారతి' మాటేమిటి: పాదయాత్ర, జగన్‌కు దిమ్మతిరిగే ప్రశ్నలు!
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రజా సంకల్ప యాత్ర గురువారం నాలుగో రోజుకు చేరుకుంది.
Recommended Video

కడప/కర్నూలు: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రజా సంకల్ప యాత్ర గురువారం నాలుగో రోజుకు చేరుకుంది. ఆయన జమ్మలమడుగు అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో ఉరుటూరు శివారు నుంచి ప్రారంభించారు.
గురువారం ఉదయం గం.8.40 నిమిషాలకు నాలుగో రోజు పాదయాత్ర ప్రారంభించారు. పెద్దనపాడు, వైకోడూరు మీదుగా ఎర్రగుంట్ల చేరుకుంటారు. అక్కడ నాలుగు రోడ్ల కూడలిలో ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతారు. ఈ రోజు ఆయన 10.9 కిలోమీటర్లు నడవనున్నారు.

ఎర్రగుంట్లలో పొల్యూషన్ ఎక్కువ
ఇదిలా ఉండగా, ఎర్రగుంట్లసో పొల్యూషన్ ఎక్కువగా ఉంటుంది. దక్షిణ భారతదేశంలోనే ఇక్కడ డస్ట్ ఎక్కువగా ఉంటుందని పేరు ఉంది. దీనికి కారణం ఉంది. ఇక్కడ పెద్ద ఎత్తున సిమెంట్ ఫ్యాక్టరీలు ఉన్నాయి. ఈ కారణంగా పొల్యూషన్ దుమ్ము, దూళి ఉంటుంది.

జగన్ భారతీ సిమెంట్స్ ఫ్యాక్టరీ కూడా ఉంది
ఇక్కడ ఉన్న సిమెంట్ ఫ్యాక్టరీలలో జగన్‌కు చెందిన భారతీ సిమెంట్స్ కూడా ఉంది. ఇప్పుడు జగన్ పాదయాత్ర చేస్తున్నారు. ఆయన ఎర్రగుంట్లలో మాట్లాడుతారు. ఈ నేపథ్యంలో మరోసారి పొల్యూషన్‌ను తగ్గించే చర్యలు అంశం స్థానికంగా చర్చకు వస్తోంది.

జగన్‌కు దిమ్మతిరిగే ప్రశ్న
భారతి సీమెంట్స్ నల్లలింగాయపల్లి ప్రాంతంలో ఉంది. దీనిపై స్థానిక నాయకుడు ఒకరు మాట్లాడుతూ.. ప్రజల సమస్యలు తెలుసుకునేందుకే తాను పాదయాత్ర చేపడుతున్నానని, ఇప్పుడు సమస్యలు తెలుసుకొని ముఖ్యమంత్రి అయ్యాక తీర్చుతానని చెబుతున్నారని, అదే నిజమైతే ఇక్కడ అతని కంపెనీ (భారతీ సిమెంట్స్) నుంచి వస్తున్న కాలుష్యాన్ని ఎందుకు తగ్గించే ప్రయత్నాలు చేయడం లేదని ప్రశ్నిస్తున్నారు.

భారతీ సిమెంట్స్‌పై తీవ్ర ఆరోపణలు
దీనిని చూస్తుంటే జగన్‌కు ముఖ్యమంత్రి అయ్యే నైతిక అర్హత లేదని ఆయన అన్నారు. కాలుష్యం పైన భారతీ సిమెంట్స్ యాజమాన్యం బలవంతంగా గ్రామస్తులను మౌనంగా ఉంచే ప్రయత్నాలు చేస్తోందని ఆయన ఆరోపించారు.

డబ్బులిస్తున్నారని ఆరోపణ
అంతేకాదు, ఆ వ్యక్తి సంచలన ఆరోపణలు చేసినట్లుగా కూడా ఓ ఇంగ్లీష్ పత్రికలో వార్త వచ్చింది. గ్రామస్తులను మౌనంగా ఉంచేందుకు డబ్బులు ఇశ్తారని ఆయన ఆరోపించినట్లుగా పేర్కొంది. సర్పంచ్ అయితే యాభై వేల రూపాయల వరకు ఇస్తారని ఆరోపించినట్లుగా పేర్కొంది. మూడొంతుల మందికి డబ్బులు ఇస్తున్నారని ఆరోపించారు.

రాత్రి వచ్చే దుర్వాసన భరించలేం
భారతీ సిమెంట్స్ ఫ్యాక్టరీ నుంచి రాత్రి పూట మరింత ఎక్కువ దుర్వాసన వస్తుందని, దీనిని భరించలేకపోతున్నామని మరొకరు ఆవేదన వ్యక్తం చేశారు. తమ సమస్యను తీర్చాలని జగన్‌ను మరోసారి నిలదీస్తామంటున్నారు. మిగతా సిమెంట్ ఫ్యాక్టరీలు ఉన్న గ్రామాల్లోను గ్రామస్తులు ఇవే సమస్యలు ఎదుర్కొంటున్నారు. మరోవైపు, భారతి సిమెంట్స్ వెబ్‌సైట్లో నివేదికకు సంబంధించి వివరణ ఉన్నట్లు కూడా పేర్కొంది.
-
హైదరాబాద్ జూపార్క్ లో వింత జంతువు.. భారీగా తరలివస్తున్న పర్యటకులు -
టీవీకే అభ్యర్థుల జాబితా విడుదల వేళ.. త్రిష ప్రీ- ప్లాన్డ్ గా !! -
రామ్‌చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్‌తో ఛాన్స్ కొట్టేసింది! -
తెలుగు ఇండస్ట్రీ హిట్ హిందీ రీమేక్‌లో శ్రీలీల.. ట్రోలింగ్ చూస్తే ఏడుపే !! -
ఏప్రిల్ 1 నుంచి ఉద్యోగులకు కొత్త రూల్స్- జీతం, పన్ను సహా భారీ మార్పులు..! -
ఇరాన్‌కు రోజుకు రూ. 1,319 కోట్ల ఆదాయం.. అమెరికా అంతమే లక్ష్యంగా..!! -
today rashiphalalu: మీనరాశిని వదిలిపెట్టని ముఖ్యగ్రహాలు.. వీరి పంట పండుతుంది! -
రాజమండ్రి- కాకినాడ పోర్ట్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక -
సోషల్ మీడియాలో సెన్సేషన్ గా మారిన "అల్లు అర్జున్" రిలేటివ్.. -
2028 అమెరికా అధ్యక్షుడు ఆయనే.. భారత్ కు గుడ్ న్యూస్..!!












Click it and Unblock the Notifications