జగన్ మార్క్ రాజకీయం, ఆపరేషన్ కాంగ్రెస్ - షర్మిల "ఫిక్స్"..!!

ఏపీలో రాజకీయాలు ఆసక్తి కరంగా మారుతున్నాయి. కూటమి ప్రభుత్వం జగన్ లక్ష్యంగా వ్యూహాలు అమలు చేస్తోంది. పీసీసీ చీఫ్ షర్మిల సైతం జగన్ నే టార్గెట్ చేస్తున్నారు. వైసీపీ నుంచి ముఖ్య నేతలు పార్టీ వీడుతున్న సమయంలో జగన్ తన మార్క్ రాజకీయం మొదలు పెట్టారు. తిరిగి జిల్లా ల పర్యటనలకు సిద్దమయ్యారు. ఇదే సమయంలో పార్టీ పరంగానూ కీలక నిర్ణయాలు తీసుకుంటు న్నారు. ఇక, షర్మిల లక్ష్యంగా జగన్ ఢిల్లీ కేంద్రంగా కొత్త రాజకీయం మొదలు పెట్టారు.

జగన్ మంత్రాంగం
ఏపీలో ఓటమి తరువాత పలువురు ముఖ్య నేతలు వైసీపీని వీడారు. మరి కొంత మంది పార్టీకి వీడి కూటమి పార్టీల వైపు చూస్తున్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి ఆరు నెలలు పూర్తి కావటంతో ప్రభుత్వం పైన జగన్ పోరుబాట ప్రారంభించారు. ఫలితాల తరువాత పార్టీ పరంగా జగన్ దిద్దుబాటు నిర్ణయాలు మొదలు పెట్టారు. పార్టీ నేతలతో వరుస సమావేశాలు... జిల్లాల్లోనే బస చేయాలని నిర్ణయించారు. ఇదే సమయంలో కాంగ్రెస్ లో ఉన్న సీనియర్లను తన వైపు తిప్పుకునే ప్రయత్నాలు ప్రారంభించారు. అందులో భాగంగా బెంగళూరు నుంచే ఢిల్లీ కేంద్రంగా కీలక మంత్రాంగం చేస్తున్నట్లు సమాచారం.

YS Jagan moving with new sketch to target YS Sharmila discussions with congress leaders

జగన్ కొత్త స్కెచ్
కూటమి నేతలతో పాటుగా షర్మిల ప్రతీ సందర్భలోనూ జగన్ టార్గెట్ గా వ్యవహరిస్తున్నారు. దీంతో కూటమితో పాటుగా షర్మిల పన జగన్ గురి పెట్టారు. కాంగ్రెస్ లోని సీనియర్లను వైసీపీలోకి వచ్చేలా పావులు కదుపుతున్నారు. ఇప్పటికే పీసీసీ చీఫ్ గా షర్మిల నాయకత్వం పైన కాంగ్రెస్ లోనే కొంత మంది సీనియర్లు వ్యతిరేక స్వరం వినిపిస్తున్నారు. పార్టీ నాయకత్వానికి ఫిర్యాదులు చేస్తున్నారు. షర్మిల పార్టీ బలోపేతం కంటే తన వ్యక్తిగత అంశాలు.. అన్న జగన్ తో విభేదాల కారణంగా.. ఎన్డీఏ కూటమి కంటే జగన్ పైన విమర్శలకే ప్రాధాన్యత ఇస్తున్నారని ఫిర్యాదులు వెళ్లాయి. ఇదే సరైన సమయంగా భావిస్తున్న జగన్ కాంగ్రెస్ ముఖ్యులతో మంత్రాంగం ప్రారంభించారు.

వైసీపీలోకి కాంగ్రెస్ నేతలు
కాంగ్రెస్ లో తన తండ్రితో పని చేసి ప్రస్తుతం పార్టీలో పూర్తి స్థాయిలో కొనసాగలేని నేతలను తనతో కలిసి వచ్చేలా స్వయంగా మాట్లాడుతున్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగానే మాజీ మంత్రి శైలజానాధ్ కర్నూలు లో జగన్ ను కలిసారు. కర్నూలు లో వైసీపీ ప్రధాన కార్యదర్శి తెర్నేకల్ సురేందర్‌రెడ్డి కూతురు వివాహ రిసెప్షన్‌కు వెళ్లారు అధినేత. వైసీపీ నేతలతోపాటు పలువురు కాంగ్రెస్ నేతలు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. వాటిలో కాంగ్రెస్ మాజీ పీసీసీ చీఫ్ శైలజానాథ్ ఉన్నారు. శైలజానాధ్ తో పాటుగా ఎనిమిది మంది కాంగ్రెస్ సీనియర్లు వైసీపీలో చేరేందుకు రంగం సిద్దమనట్లు తెలుస్తోంది. ఎన్డీఏలోకి వెళ్లలేని ఈ నేతలు కాంగ్రెస్ లో షర్మిల నాయకత్వంలో కలిసి పని చేయలేక పోతున్నామని ఇప్పటికే పార్టీ హైకమాండ్ కు స్పష్టం చేసారు. దీంతో, జగన్ వీరి రాకతో తన పార్టీని బలోపేతం చేసుకోవటంతో పాటుగా షర్మిల పదవికి చెక్ పెట్టేలా వ్యూహాత్మక అడుగులు వేస్తున్నట్లు కనిపిస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+