జగన్ ఎలెక్షన్ సాంగ్ వచ్చేసిందోచ్.. గూస్ బమ్స్ పక్కా
వైసీపీ అధినేత , సీఎం జగన్ పూర్తిగా ఎన్నికల మూడ్‌లోకి వెళ్లిపోయారు. అభ్యర్థుల ఎంపికలో తన మార్క్ చూపిస్తోన్న జగన్..సంక్రాంతి అనంతరం ప్రజాక్షేత్రంలోకి అడుగు పెట్టడానికి సన్నద్ధం అవుతున్నారు. ఈ నెల 25 నుంచి జగన్ జనం మధ్యలోకి వెళ్లనున్నారు. రోజుకు రెండు జిల్లాల్లో పర్యటిస్తూ.. కేడర్‌ను ఎన్నికలకు సమాయత్తం చేయడమే లక్ష్యంగా జగన్ అడుగులు వేయడానికి సిద్దం అవుతున్నారు.
దీనిలో భాగంగానే 2024 ఎన్నికల సాంగ్‌ను ఆ పార్టీ విడుదల చేసింది. సీఎం జగన్ పాటలకు ఎలాంటి క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. గత ఎన్నికల సమయంలో విడుదలైనా.. ''జగనన్నా జగనన్నా జనమంతా నీతోనే, జననేత జగనన్నా, రావాలి జగన్ కావాలి జగన్, సూర్యుడిలా ఉదయిస్తివి'' వంటి పాటలు ఎంతలా హల్ చల్ చేశాయో అందరికి తెలిసిందే. ముఖ్యంగా ''రావాలి జగన్ కావాలి జగన్'' సాంగ్ పొలిటికల్ సర్కిల్స్‌లో ఓ ట్రేండ్‌ను క్రియేట్ చేసింది.

తాజాగా 2024 ఎలెక్షన్ సాంగ్‌ను విడుదల చేయడం జరిగింది. జనం గుండెల్లో గుడి కట్టడమే జగన్ ఎజెండా అంటూ సాగే పాటను కొద్దిసేపటి క్రితమే విడుదలైంది. ఈ పాటలో జగన్ అమలు చేస్తోన్న సంక్షేమ పథకాలతో పాటు, అభివృద్ది కార్యక్రమాల గురించి కూడా వివరించారు. మాట ఇస్తే దాని కోసం ఎంత వరకైనా పోరాడే వ్యక్తే జగన్ అంటూ ఈ పాటలో చూపించారు.

అలాగే మీ బిడ్డ ఒక్కడే ఒకవైపు ఉన్నాడు.. మీ ఇంట్లో మంచి జరిగి ఉంటే మీరే తోడుగా నిలవండి... మీ బిడ్డకు సైనికులుగా మీరే కదలండీ అంటూ జగన్ చెప్పిన మాటలకు గూస్ బమ్స్ రావడం ఖాయంగా కనిపిస్తుంది. ఫలానా మంచి చేశాము అని చెప్పుకోవడానికి ఒక్కంటే ఒకటి మంచి లేని వారు కూడా ఇప్పుడు ఏకం అవుతున్నారంటూ చంద్రబాబు, పవన్ కల్యాణ్‌లకు గట్టిగానే ఈ వీడియో ద్వారా కౌంటరిచ్చారు.
''జనం గుండెల్లో గుడి కట్టడమే జగన్ ఎజెండా .. జెండాలు జతకట్టడమే మీ (టీడీపీ & జనసేన) ఎజెండా ..సీఎం కూర్చీ జనమే ఇవ్వాలనేది జగన్ ఎజెండా'' అంటూ వచ్చే లిరిక్స్ అయితే సూపర్బ్‌గా ఉన్నాయి. పాట అద్భుతంగా ఉండటంతో...వైసీపీ కార్యకర్తల్లో, జగన్ అభిమానుల్లో ఫుల్ జోష్ కనిపిస్తోంది. విడుదలైన క్షణాల్లోనే లక్షల్లో వ్యూస్ సాధించిన ఈ పాట.. రాబోవు రోజుల్లో ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి.












Click it and Unblock the Notifications