వైఎస్ జగన్ అద్భుత వ్యూహం.. రంగంలోకి మోడీ-షా?

ఎన్నికల సమయం దగ్గరపడుతోంది. అసెంబ్లీకి, లోక్ సభకు ఓకేసారి జరగబోతున్న ఎన్నికల ఫలితాలు జూన్ నాలుగో తేదీన విడుదల కానున్నాయి. గత ఎన్నికల సమయంలో ప్రత్యేక హోదా విషయంలో ఎన్డీయేతో విభేదించి చంద్రబాబు బయటకు వచ్చేశారు. అదంతా జగన్ ట్రాప్ అని, ఆ మాయలో పడొద్దంటూ మోడీ ప్రత్యక్షంగానే చంద్రబాబుకు హెచ్చరికలు జారీచేశారు.

అయినా వినిపించుకోని చంద్రబాబు 2019 ఎన్నికల్లో తగిన ప్రతిఫలాన్ని పొందారు. ఐదు సంవత్సరాల నుంచి తెలుగుదేశం పార్టీ ఎన్డీయేలో చేరతానని అడుగుతుండటంతో మెత్తపడ్డ మోడీ-షా ద్వయం అందుకు ఓకే చెప్పారు.తాజాగా చిలకలూరిపేట సభలో కూడా నరేంద్రమోడీ మరోసారి జగన్ ట్రాప్ లో పడొద్దని చంద్రబాబును పరోక్షంగా హెచ్చరించిన సంగతి తెలిసిందే. ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీల్చేందుకు కాంగ్రెస్ పార్టీ షర్మిలను ప్రయోగించిందని, జగన్, షర్మిల ఒక్కటేనని, ఇప్పుడు కూడా జగన్ ట్రాప్ లో పడొద్దన్నారు.

ys jagan news political strategy in ap elections

వ్యూహ ప్రతివ్యూహాల్లో దిట్ట అయిన మోడీ-షా ఏపీలో వైఎస్ జగన్ అనుసరించబోతున్న వ్యూహాలను పసిగట్టి కూటమి నేతలను అప్రమత్తం చేస్తున్నారు. వాలంటీర్లద్వారా సానుభూతి పొందేందుకు వైఎస్ జగన్ ప్రయత్నిస్తున్నారని విశ్లేషకులు భావిస్తున్నారు. వాలంటీర్లంతా దాదాపుగా వైసీపీ సానుభూతి పరులే. వారంతా ఆ పార్టీకి సహకరించే క్రమంలో తెలుగుదేశం పార్టీ వల్ల చాలామంది పై కేసులు నమోదవడంతోపాటు ఉద్యోగాల నుంచి తొలగింపబడతారు.. ఈసీ జోక్యం చేసుకుంటుంది.. కోర్టులు సైతం కలగజేసుకుంటాయనేది వైసీపీ ప్లాన్ గా ఉంది.

ys jagan news political strategy in ap elections

ఈ రెండు నెలలు వాలంటీర్లను పక్కనపెట్టాలనే సూచనలు వస్తాయి.. సంక్షేమ పథకాలను ప్రజలకు చేరువచేయాలని తాను అనుకున్నానని, ప్రతిపక్షాలు దూరం చేశాయనే ప్రచారాన్ని తీసుకువెళ్లాలని ప్రణాళికలు రచించుకుంటోంది. ఇది పూర్తిగా జగన్ ట్రాప్ గా కనపడుతోందని, చంద్రబాబు, పవన్ కల్యాణ్ అప్రమత్తంగా ఉండాలని బీజేపీ అధిష్టానం నుంచి సూచనలు వచ్చినట్లు తెలుగుదేశం పార్టీ నాయకులు చెబుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+