నిలదీయని సొసైటీదే తప్పా: బాబుపై జగన్ తొలి ట్వీట్
హైదరాబాద్: సోషల్ మీడియా ట్విట్టర్‌లో చేరిన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు పైన మండిపడ్డారు. ట్విట్టర్‌లో చేరిన జగన్.. తొలి ట్వీట్ ద్వారా చంద్రబాబును టార్గెట్ చేశారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు రైతు వ్యతిరేక విధానాలు అవలంభిస్తున్నారని అభిప్రాయపడ్డారు. రైతు ఆత్మహత్యలకు కారకులు ఎవరని, మోసం చేసిన చంద్రబాబుదా లేక ఫెయిలైన ప్రభుత్వానిదా అని ప్రశ్నించారు. లేక గట్టిగా నిలదీయని ఈ సమాజానిదా అని మండిపడ్డారు.
Who is responsible for the murders of these farmers? CBN who cheated? His govt which failed? Or a society which didn't question enough?
— YS Jagan Mohan Reddy (@ysjagan) February 26, 2015 కాగా, వైయస్ జగన్మోహన్ రెడ్డి రెడ్డి సామాజిక వేదిక ట్విట్టర్‌లోకి అడుగు పెట్టిన విషయం తెలిసిందే. @ysjagan అనే ట్విట్టర్ హ్యాండిల్‌తో ఆయన ట్విట్టర్‌లో ప్రవేశించారు. ఇంతకాలం ప్రజల మధ్య ఉన్న ఆయన, నేరుగా వారితోనే సంప్రదింపులు జరిపేందుకు వీలుగా ట్విట్టర్ ఖాతాను తెరిచారు.

దీంతో ప్రజలు, యువతీయువకులు, ఎన్నారైలు, ఇతరులెవరైనా వైయస్ జగన్మోహన్ రెడ్డితో తమ అభిప్రాయాలను తెలియజేయడానికి, వివిధ అంశాలపై ఆయన తన మనోభావాలను వ్యక్తం చేయడానికి వేదికగా ఈ ట్విట్టర్ ఖాతా ఉపయోగపడనుంది. బుధవారం సాయంత్రం 5.30గంటల ప్రాంతంలో ఈ ట్విట్టర్ ఖాతా తెరిచారు. ట్విట్టర్ ఖాతా తెరిచిన జగన్‌కు కొన్ని గంటల్లోనే వేల ఫాలోయర్లు కనిపించారు.












Click it and Unblock the Notifications