చంద్రబాబుకు జగన్ మరో హెచ్చరిక: కార్యకర్తకు పరామర్శ..!!

ముఖ్యమంత్రి చంద్రాబాబుకు మాజీ సీఎం జగన్ మరోసారి హెచ్చరిక చేసారు. వైసీపీ శ్రేణుల పైన జరుగుతున్న దాడుల పై జగన్ ఆగ్రహం వ్యక్తం చేసారు. తాజాగా టీడీపీ శ్రేణుల దాడిలో గాయపడిన కార్యకర్తను కడప రిమ్స్ లో జగన్ పరామర్శించారు. నెల్లూరు జైలులో పిన్నెల్లిని పరామర్శించిన అనంరతం దాడుల పైన తీవ్రంగా స్పందించిన జగన్..ఇప్పుడు మరోసారి చంద్రబాబును ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేసారు. చంద్రబాబును మరోసారి హెచ్చరించారు.

మాజీ ముఖ్యమంత్రి జగన్ మూడు రోజుల పర్యటన కోసం కడపకు వచ్చారు. తాజాగా వేంపల్లెలో సతీష్ రెడ్డి అనుచరుడు అజయ్ కుమార్ రెడ్డి పైన దాడి జరిగింది. రిమ్స్ లో చికిత్స పొందుతున్నారు. కడప కు వచ్చిన జగన్ విమానాశ్రయం నుంచి రిమ్స్ కు వెళ్లారు. అక్కడ చికిత్స పొందుతున్న కార్యకర్తను పరామర్శించారు. అండగా నిలుస్తామని హామీ ఇచ్చారు. ఆయనకు అందుతున్న చికిత్స గురించి ఆరా తీసారు. ఆక్కడే ఉన్న కుటుంబ సభ్యులను పరమర్శించారు. ఆ తరువాత జగన్ మాట్లాడుతూ దాడులు ఆపకపోతే ప్రతిస్పందన ఉంటుందని హెచ్చరించారు.

YS Jagan once again warns Chandra Babu over Attacks on YCP cadre in Kadapa

రాష్ట్రంలో గతంలో ఎన్నడూ లేని సంప్రదాయానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాంది పలికారని జగన్ మండిపడ్డారు. దాడులు ఆపకపోతే భవిష్యత్ లో టీడీపీకి అదే తిప్పికొడుతుందని హెచ్చరించారు. వైసీపీకి ఓటు వేశారని అజయ్ పై దాడి చేసారని చెప్పుకొచ్చారు. గతంలో ఎన్నడూ ఇలాంటి పరిస్థితులు లేవన్నారు. చంద్రబాబు రాష్ట్రంలో భయానక వాతావరణం కు కారణంగా నిలుస్తున్నారన్నారు. అధికారం మారిన రోజున చంద్రబాబు చేసిన పాపాలు ఆయనకే చుట్టుకుంటాయని వ్యాఖ్యానించారు. చంద్రబాబు మోసపూరిత వాగ్దానాలతో పది శాతం ఓట్లు తగ్గాయని చెప్పారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలు పైన శ్రద్ద పెట్టాలని జగన్ సూచించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+