వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బాబు ఎత్తుకు జగన్ పైఎత్తు: 'కాంగ్రెస్'తో వ్యూహం, విష్ణుకు గాలం వేసినా..

రానున్న మున్సిపల్ ఎన్నికలను మినీ అసెంబ్లీ ఎన్నికలుగా భావిస్తున్నారు. ప్రభుత్వ వ్యతిరేకతతో ఏ మేరకు లబ్ధి చేకూరుతుందో తెలియని పరిస్థితుల నేపథ్యంలో వైసిపి నేతలు కొత్త వ్యూహాలకు పదును పెడుతున్నారు.

|
Google Oneindia TeluguNews

విజయవాడ: ఏపీలో త్వరలో ఏడు మున్సిపల్ కార్పోరేషన్ల ఎన్నికలు జరగనున్నాయి. వీటిని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. చంద్రబాబు ప్రభుత్వం పైన అడుగడుగునా వైసిపి అధినేత జగన్ మండిపడుతున్నారు.

ఎన్నికలు ఎప్పుడు వచ్చినా తమదే అధికారమని, అసలు చంద్రబాబు పాలన చూస్తుంటే ఏడాదిలో ఎన్నికలు వచ్చినా రావొచ్చునని చెబుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో రానున్న మున్సిపల్ ఎన్నికల్లో వైసిపి ఓడిపోతే జగన్ తల కొట్టేసినట్లవుతుంది. కాబట్టి వీటిని వైసిపి ప్రతిష్టాత్మకంగా తీసుకుంది.

కిరణ్ కుమార్ రెడ్డికి బీజేపీ షాక్!కిరణ్ కుమార్ రెడ్డికి బీజేపీ షాక్!

ఇప్పటికే వైసిపి నుంచి ఇరవై మంది ఎమ్మెల్యేలు, పలువురు నేతలు టిడిపిలో చేరారు. ఈ నేపథ్యంలో ఆ కొరత తీర్చుకునేందుకు వైసిపి.. కాంగ్రెస్ పార్టీ పైన దృష్టి సారించిందని అంటున్నారు. వీలయితే మున్సిపల్ ఎన్నికలకు ముందుగానే భారీగా కాంగ్రెస్ నేతలను వైసీపీలోకి చేర్చుకోవడానికి జగన్ వ్యూహం రచిస్తున్నారని అంటున్నారు.

ys jagan

మినీ..

రానున్న మున్సిపల్ ఎన్నికలను మినీ అసెంబ్లీ ఎన్నికలుగా భావిస్తున్నారు. ప్రభుత్వ వ్యతిరేకతతో ఏ మేరకు లబ్ధి చేకూరుతుందో తెలియని పరిస్థితుల నేపథ్యంలో వైసిపి నేతలు కొత్త వ్యూహాలకు పదును పెడుతున్నారని అంటున్నారు. టిడిపి నేతలు ఎలాగూ వైసిపిలో చేరారు.

దీంతో బీజేపీ.. ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ పైన దృష్టి సారించారని అంటున్నారు. ఎందుకంటే ప్రత్యేక హోదా ఎఫెక్టుతో బీజేపీ బలం తగ్గి, ఒకింత కాంగ్రెస్‌కు ఓటింగ్ పెరిగిందని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ పైన దృష్టి సారించారని తెలుస్తోంది.

కాంగ్రెస్ బలపడితే..

ఏపీలో కాంగ్రెస్ బలపడితే అంతిమంగా వైసిపికి దెబ్బ అని అభిప్రాయపడుతున్నారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ముఖ్య నేతలను ఆకర్షించే పనిలో జగన్ ఉన్నారని చెబుతున్నారు. ఇప్పటికే కాంగ్రెస్‌లో ఉన్నవారని, గత ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి వివిధ పార్టీల్లో చేరిన వారిని తమ పార్టీలోకి తీసుకోవాలని నిర్ణయించుకున్నారని తెలుస్తోంది.

షాకింగ్: 'కేవీపీతో ఫోన్ టచ్‌లో వైయస్ జగన్, విజయసాయి ద్వారా లీక్'షాకింగ్: 'కేవీపీతో ఫోన్ టచ్‌లో వైయస్ జగన్, విజయసాయి ద్వారా లీక్'

ఇందుకు విజయవాడ నుంచి జగన్ ఆపరేషన్ ప్రారంభించారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస రావు 2014కు ముందు బీజీపీలో చేరి, బీజీపీ, టీడీపీ ఉమ్మడి అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. ఇప్పుడు ఆయన వైసిపిలో చేరారు.

టిడిపిలోకి దేవినేని, వైసిపిలోకి వెల్లంపల్లి

విజయవాడలో దేవినేని నెహ్రూ కాంగ్రెస్ నుంచి వెళ్లిపోయిన తర్వాత ఆ పార్టీ తరుపున పోరాడుతున్న నగర కాంగ్రెస్ అధ్యక్షులు మల్లాది విష్ణుకు కూడా వైసీపీ గాలం వేసింది. ఆయనతో వైసీపీ అగ్రనేతలు టచ్‌లో ఉన్నప్పటికీ తాను కాంగ్రెస్ వీడనని విష్ణు స్పష్టం చేశారు.

English summary
YSRCP chief YS Jagan operation Akarsh on Congress in andhra pradesh.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X