బాబు ప్రభుత్వం అజెండా దారుణం: జగన్, ఈ హాస్టల్స్
హైదరాబాద్: పింఛన్లకు కోత విధించడం అమానుషమని, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి ఎజెండా దుర్మార్గమని ప్రతిపక్ష నేత, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి విమర్శించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సామాజిక పింఛన్లలో కోత విధించాలనే చంద్రబాబు ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఆయన మంగళవారం బహిరంగ లేఖ రాశారు.
పార్టీలకు అతీతంగా పేదల పక్షాన నిలవాలని, పింఛన్ల తొలగింపును అడ్డుకోవాలని ఆయన కోరారు. రాష్ట్రంలో సామాజిక పింఛన్లను ఏరేయానికి ప్రభుత్వం తరఫున జరుగుతున్న కుట్రలో భాగస్వాములు కావద్దని ఆయన పెన్షనర్ల పరిశీలన కమిటీ అధ్యక్షుడిని, సభ్యులను ప్రతిపక్ష నేతగా ఆయన కోరారు. పింఛన్లలో కోత పెట్టి అర్హుల పొట్టలు కొట్టేందుకు చంద్రబాబు ప్రభుత్వం సిద్ధపడిందని ఆయన విమర్శించారు.

ఈ హాస్టల్ విధానం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ హాస్టల్ విధానాన్ని ప్రవేశపెడుతున్నట్లు సాంఘిక, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి రావెల కిశోర్ బాబు చెప్పారు. హాస్టల్ విద్యార్థులకు అన్ని సదుపాయాలు కల్పించడంతో పాటు అవినీతిని పారదోలుతామని ఆయన మంగళవారం మీడియాతో చెప్పారు.
తొలి విడత 998 ఎస్సీ హాస్టల్స్‌లో ఈ విధానాన్ని ప్రవేశపెడుతామని ఆయన చెప్పారు. ఈ విధానం ప్రకారం ప్రతి హాస్టల్లో లాప్‌టాప్, వెబ్ కెమెరా, బయో మెట్రిక్ మిషన్, సరుకుల వినియోగం, విద్యార్థులూ సిబ్బంది హాజరు వంటి అన్ని వివరాలు ఆన్‌లైన్‌లో పొందుపరుస్తామని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications