తన్ని తరిమే చరిత్ర ఉంది: వైఎస్ జగన్
ఇష్టం లేకుండా బలవంతంగా భూములు లాక్కోవాలని చూస్తే తన్నితరిమిన చరిత్ర కోన గ్రామానికి ఉందని ప్రతిపక్ష నేత, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‑మోహన్ రెడ్డి అన్నారు. అలాంటిది పోర్టు పేరుతో బలవంతంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భూములు లాక్కోవాలని చూస్తే ఊరుకోరని హెచ్చరించారు.ముఖ్యమంత్రి అంటే రాష్ట్రానికి తండ్రిలాంటివాడని, కానీ చంద్రబాబు నాయుడు మాత్రం ప్రజల ఆస్తులు లాక్కుని దళారులకు కట్టబెట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం కృష్ణా జిల్లాలో పర్యటిచిన వైసీపే నేత జగన్ బుద్ధాలపాలెంలో రైతులతో ముఖాముఖి నిర్వహించి..తరువాత కోనలో రైతులతో చర్చిచారు.












Click it and Unblock the Notifications