'స్పందన' స్ధానంలో మరో కొత్త వ్యవస్ధ ! జనం సంతృప్తే ప్రయారిటీ-జగన్ కీలక ఆదేశాలు
ఏపీలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదుల పరిష్కారం కోసం నిర్వహిస్తున్న స్పందన కార్యక్రమంపై సీఎం జగన్ సీరియస్ గా దృష్టిపెట్టారు. తానే స్వయంగా రాష్ట్రస్ధాయి స్పందన కార్యక్రమంలో పాల్గొంటూ అధికారుల్ని పరుగులు పెట్టిస్తున్నారు. అయినా ప్రజల్లో ఎక్కడో ఓ అసంతృప్తి. దాన్ని గుర్తించిన సీఎం జగన్ ఇవాళ అధికారులకు కీలక ఆదేశాలు ఇచ్చారు.

స్పందన స్ధానంలో మరో వ్యవస్ధ
ఏపీలో ప్రస్తుతం ప్రజల నుంచి వివిధ అంశాలపై అందుతున్న ఫిర్యాదుల పరిష్కారం కోసం స్పందన కార్యక్రమం నిర్వహిస్తున్నారు. దీంతో ప్రజల సమస్యలు తీరుతున్నట్లు మొదట్లో భావించిన ప్రభుత్వం, సీఎం జగన్ కు తాజాగా అందిన ఫీడ్ బ్యాక్ వేరేలా ఉంది. దీంతో వినతుల పరిష్కారంలో మరింత మెరుగైన వ్యవస్థ ఉండాలని సీఎం జగన్ నిర్ణయించారు. దీంతో స్పందనకు మెరుగైన రూపం ఇస్తూ మరో కొత్త కార్యక్రమం రూపొందించందుకు అధికారులతో సీఎం జగన్ సమావేశం అయ్యారు. సీఎంఓ, ఉన్నతస్థాయి అధికారులతో పర్యవేక్షించేలా ప్రణాళిక రూపొందించాలని సూచించారు.

జగన్ స్పందన ఇదే
ప్రభుత్వం అధికారంలోకి రాగానే ప్రజాసమస్యల పరిష్కారానికి అత్యంత ప్రాధాన్యత ఇచ్చామని, వ్యక్తులకు సంబంధించిన సమస్యలతోపాటు, కమ్యూనిటీకి సంబంధించిన సమస్యల పరిష్కారంపై దృష్టిపెట్టామని సీఎం జగన్ తెలిపారు. ఓ నిర్ణీత సమయం పెట్టుకుని వాటిని శరవేగంగా పరిష్కరించి ప్రజలకు అండగా నిలిచామన్నారు.
ప్రస్తుతం ఈ కార్యక్రమం కొనసాగుతోందన్నారు. స్పందనతోపాటు.. ప్రజలు ఎదుర్కొంటున్న ఇతర సమస్యలపై కూడా గడపగడపకూ మన ప్రభుత్వం కార్యక్రమం ద్వారా దృష్టిపెట్టామన్నారు. గ్రామ, వార్డు సచివాలయాల పరిధిలో వాటిని పరిష్కరించేందుకు నిధులు కేటాయించామన్నారు. ఇంకా ఏమైనా సమస్యలు మిగిలిపోయి ఉన్నాయా? అన్నదానిపై దృష్టిపెట్టాల్సిన అవసరం ఉందన్నారు. కాబట్టి స్పందన కార్యక్రమాన్ని మెరుపరిచేలా ఆలోచన చేయాలన్నారు.

కొత్త వ్యవస్ధ ఇలా..
సమస్యల పరిష్కారంలో అంకితభావానికి నిదర్శనంగా ప్రభుత్వం నిలవాలని సీఎం జగన్ అధికారుల్ని కోరారు.
ప్రజల సమస్యలను తీర్చాలన్నదే మన ఉద్దేశమన్నారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అత్యంత నిజాయితీగా, అంకిత భావంతో, కృతనిశ్చయంతో ప్రజాసమస్యల పరిష్కారానికి కృషిచేశామని, అంతా కలిసికట్టుగా గతంలో ఎన్నడూలేని రీతిలో ప్రజలకు మెరుగైన సేవలు అందించాలన్నారు. సమస్యల పరిష్కారంకోసం ఇప్పుడు చేస్తున్న కార్యక్రమాల్లో వృత్తి నైపుణ్యం పెంచడం, నిర్మాణాత్మక రీతిలో వ్యవహరించడం అన్నదానిపై మనం దృష్టిసారించాల్సి ఉందన్నారు. వివిధ రాష్ట్రాల్లో అమలు చేస్తున్న విధానాలనుకూడా పరిశీలించి అందులో ఎక్కడైనా స్వీకరించదగ్గవి ఉంటే... వాటిని కూడా స్వీకరించాలన్నారు. పథకాలు కావొచ్చు, రెవిన్యూ రికార్డులకు సంబంధించిన అంశాలు కావొచ్చు కాని ఏ ఒక్కరూ కూడా అర్హులైన వారు మిగిలిపోకూడదన్నారు. అలాగే సమస్యలు పరిష్కారానికి నోచుకోకుండా మిగిలిపోవద్దు అన్నదే దీని ఉద్దేశమన్నారు.

కొత్త వ్యవస్ధపై జగన్ కీలక ఆదేశాలు
ఈ కొత్త విధానం ఎలా ఉండాలి? ఎలాంటి సమస్యలకు ఎలాంటి పరిష్కారాలు చూపాలి? అన్నదానిపై ఒక మార్గదర్శక ప్రణాళిక రూపొందించాలని సీఎం జగన్ అధికారుల్ని ఆదేశించారు. సీఎంఓ, ఇతర ఉన్నతాధికారులతో కూడిన అధికారయంత్రాంగ వ్యవస్థకు ప్రజలు చేర్చిన ఫిర్యాదులు, వినతులకు పరిష్కారాలు చూపడమే ఉద్దేశంగా ఈ ఆలోచన ఉండాలన్నారు. స్పందన కార్యక్రమంకన్నా మరింత మెరుగ్గా, సమర్థవంతంగా దీన్ని నిర్వహించాలన్నది ఉద్దేశమన్నారు. అధికారులంతా కూర్చొని కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలన్నారు.
ఇప్పటివరకూ అమలవుతున్న స్పందన కార్యక్రమాన్ని మైక్రోస్థాయిలోకూడా పరిశీలనచేసి.. వాటిని మరింత మెరుగ్గా తీర్చిదిద్దాలని జగన్ సూచించారు. వినతుల పరిష్కారంలో ప్రజల సంతృప్తికి పెద్దపీట వేయాలన్నారు.
-
'అమరావతి' కోసం అసెంబ్లీ ప్రత్యేక భేటీ, జగన్ అనూహ్య నిర్ణయం..!! -
మార్కాపురం బస్సు ప్రమాదం..సీఎం చంద్రబాబు,లోకేష్ తో పాటు మంత్రుల దిగ్భ్రాంతి -
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..!












Click it and Unblock the Notifications