కోర్టుకు వచ్చిన జగన్: డిసెంబర్ 19కి విచారణ వాయిదా
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ అక్రమాస్తుల కేసు విచారణను సీబీఐ కోర్టు డిసెంబర్ 19కి వాయిదా వేసింది. గురువారం ఉదయం ఈ కేసుకు సంబంధించి వైయస్ జగన్ సీబీఐ కోర్టుకు హాజరయ్యారు. ఆయనతో పాటు విజయసాయిరెడ్డి, నిమ్మగడ్డ, ధర్మాన, శ్యాంప్రసాద్, దివాకర్‌రెడ్డి కోర్టుకు హాజరయ్యారు.
ఈ కేసుపై విచారణ జరిపిన నాంపల్లి కోర్టు తదుపరి విచారణను డిసెంబర్ 19కి వాయిదా వేస్తున్నట్లు తెలిపిది. ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే సీబీఐ 10 చార్జిషీట్లను దాఖలు చేసింది. తమను ఈ కేసు నుంచి తప్పించాలంటూ మరొకొంత మంది ఇప్పటికే డిశ్చార్జ్ పిటిషన్ వేసిన విషయం తెలిసిందే.

వైయస్ జగన్ అక్రమాస్తుల కేసుపై అక్టోబర్ 21వ తేదీన సీబీఐ కోర్టులో విచారణ జరిగింది. సబితా ఇంద్రారెడ్డి, విజయసాయి రెడ్డి, నిమ్మగడ్డ ప్రసాద్, ఆయోధ్య రామిరెడ్డి, పెన్నా ప్రతాప్ రెడ్డి, సజ్జల దివాకర్ రెడ్డి, పునీత్ దాల్మియా, ఐఎస్ఎస్‌లు శాంబాబు, శామ్యూల్ సీబీఐ కోర్టుకు హాజరయ్యారు. ఈ కేసు విచారణను సీబీఐ కోర్డు నవంబర్ 20వ తేదీకి వాయిదా వేసింది. హుధుద్ తుపాను బాధితుల పరామర్శ నేపథ్యంలో వ్యక్తిగత హాజరు నుంచి వైయస్ జగన్‌కు మినహాయింపు పొందారు.
వైయస్ జగన్ హుధుద్ తుఫాన్ బాధితులను పరామర్శిస్తూ శ్రీకాకుళం జిల్లాలో పర్యటించారు. శ్రీకాకుళం జిల్లాలోని అరసవెళ్లి సూర్యనారాయణ స్వామిని దర్శించుకున్నారు. ఉత్తరాంధ్రలో హుధుద్ తుఫాన్ బాధిత ప్రాంతాల్లో గత 8 రోజుల నుంచి విస్తృతంగా పర్యటంచారు.
ప్రభుగౌడ్‌కు జగన్ పరామర్శ
హైదరాబాదులోని అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న పార్టీ మెదక్ జిల్లా అధ్యక్షుడు ప్రభు గౌడ్‌ను వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి గురువారంనాడు పరామర్శించారు. ప్రభు గౌడ్ తీవ్రమైన అనారోగ్యానికి గురై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.












Click it and Unblock the Notifications