జగన్ పాదయాత్ర ముహుర్తం ఫిక్స్..! త్వరలో అమల్లోకి ప్లాన్ ..!
ఏపీలో వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరోసారి పాదయాత్రకు సిద్దమవుతున్నారు. ఇప్పటికే దీనిపై ప్రకటన చేసిన జగన్.. ఇవాళ తాడేపల్లి కేంద్ర కార్యాలయంలో ఏలూరు నియోజకవర్గం నేతలతో జరిగిన సమావేశంలో మరికొంత స్పష్టత ఇచ్చారు. అలాగే ఈ పాదయాత్రకు సన్నాహంగా చేపట్టాల్సిన కార్యక్రమంపైనా నేతలకు హింట్ ఇచ్చారు. దీంతో మరోసారి వైసీపీ క్యాడర్ లో జోష్ కనిపిస్తోంది.
రాష్ట్రంలో ఎక్కడ చూసినా వ్యవస్ధళు నిర్వీర్యమయ్యాయని, ఇలాంటి పరిస్థితుల్లో ప్రజలకు తోడుగా పార్టీ ఉండాలని నేతలకు జగన్ దిశానిర్దేశం చేశారు. విద్యార్థులు, రైతులు, యువత, అక్కచెల్లెమ్మలు ఇలా ఏ వర్గానికి కష్టం వచ్చినా నిలబడుతున్నామని గుర్తుచేారు. జెండా పట్టుకుని వారి తరపున పోరాడుతున్నామన్నారు. ఇదే స్ఫూర్తి ఇక ముందు కూడా కొనసాగించాలని జగన్ స్పష్టం చేశారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని, ప్రతి ఇంట్లో ఇప్పుడు అదే చర్చ జరుగుతోందని తెలిపారు. జగన్ ఉంటే, ఎలా మేలు జరిగేదన్నది జనం ఆలోచిస్తున్నారన్నారు.

గతంలోనూ తాను నేతలతో భేటీలు అయ్యానని, ఇప్పుడు ఏలూరు నియోజకవర్గంతో ఆ కార్యక్రమాన్ని తిరిగి మొదలుపెడుతున్నామని జగన్ తెలిపారు. ఇక ముందు వారానికి ఒక నియోజకవర్గాన్ని ఎంచుకుని ఇలా సమావేశం అవుతానన్నారు. చూస్తుండగానే దాదాపు రెండేళ్లు గడుస్తున్నాయి. వచ్చే నెల చివరలో లేదా మార్చి మొదట్లో రాష్ట్ర ప్రభుత్వం మూడో బడ్జెట్ ప్రవేశపెడతారని, అంటే ఈ ప్రభుత్వానికి ఇంకా మిగిలింది మరో రెండు బడ్జెట్లు మాత్రమేనన్నారు. అలాగే మిగిలింది మూడేళ్లు మాత్రమేనని, అందులో ఏడాదిన్నర తర్వాత తన పాదయాత్ర మొదలుపెడతానన్నారు. ఆ విధంగా దాదాపు ఏడాదిన్నర పాటు, తాను ప్రజల్లోనే, ప్రజలతోనే ఉంటానన్నారు.












Click it and Unblock the Notifications