175 సీట్లలో పోటీ చేసి గెలిచే ధైర్యముందా ? తెనాలిలో చంద్రబాబు, పవన్ కు జగన్ సవాల్..
ఏపీలో వచ్చే ఎన్నికలకు సిద్దమవుతున్న సీఎం వైఎస్ జగన్ ఇవాళ తన ప్రత్యర్దులు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కు కీలక సవాల్ విసిరారు.
ఏపీలో ఎన్నికలు దగ్గరపడుతున్న నేపథ్యంలో ప్రత్యర్ధులపై సీఎం జగన్ దూకుడు పెంచారు. ఓవైపు నిరంతర సంక్షేమ పథకాలతో జనంలోకి దూసుకెళ్తున్న జగన్.. మరోవైపు ప్రత్యర్ధి పార్టీల నేతల్ని జనంలో పలుచన చేసేందుకు వారి తప్పుల్ని ఎత్తి చూపుతున్నారు. అదే క్రమంలో వారికి సవాళ్లు కూడా విసురుతున్నారు. ప్రత్యర్ధులంతా తనపైకి ఎలా దూసుకొస్తున్నారో జనానికి వివరించేందుకు కూడా జగన్ ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో ఇవాళ ప్రత్యర్ధులకు మరో సవాల్ విసిరారు.

తెనాలిలో రైతు భరోసా నిధుల విడుదల
గుంటూరు జిల్లా తెనాలిలో వైఎస్సార్ రైతు భరోసా-పీఎం కిసాన్ నాలుగో ఏడాది నిధుల విడుదల కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. ఇందులో సీఎం జగన్ తో పాటు వ్యవసాయమంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి, పలువురు ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం జగన్ రైతు భరోసా నిధుల్ని విడుదల చేశారు. ఓవైపు రైతులకు తమ ప్రభుత్వం ఏం చేస్తుందో చెప్పిన జగన్.. మరోవైపు ప్రత్యర్ధులపై సూటి విమర్శలు గుప్పించారు. దీంతో జగన్ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.

రైతు భరోసాపై జగన్ వ్యాఖ్యలు
రాష్ట్రంలో రైతుల కోసం రెండు ముఖ్యమైన కార్యక్రమాలు చేపడుతున్నట్లు సీఎం జగన్ ఇవాళ తెలిపారు. ఇందులో వైస్సార్ రైతు భరోసా-పీఎం కిసాన్ ఒకటి కాగా, రైతులకు అందిస్తున్న ఇన్ పుట్ సబ్సిడీ మరొకటి అన్నారు. ఇందులో వైఎస్సార్ రైతు భరోసా-పీఎం కిసాన్ పథకంలో భాగంగా రైతులకు ప్రతీ ఏటా క్రమం తప్పకుండా నిధులు అందిస్తున్నట్లు తెలిపారు. ఈ పథకం ద్వారా నాలుగేళ్లలో ప్రతీ రైతు కుటుంబానికి రూ.54 వేల చొప్పున నిధులు అందించామన్నారు. ఇప్పటివరకూ రాష్ట్రంలో ఈ నాలుగేళ్లలో రైతులకు ఈ పథకం ద్వారా రూ.27 వేల కోట్ల నిధులు ఇచ్చామన్నారు. రైతులు బావుంటేనే రాష్ట్రం బావుంటుందని, నాలుగేళ్లుగా వర్షాలు పడుతున్నాయని, దీంతో కరువు అనే మాటే లేదన్నారు.

చంద్రబాబు ప్రభుత్వంపై జగన్
గతంలో 2014-19 మధ్య ఓ అన్యాయస్ధుడు ముఖ్యమంత్రిగా ఉన్నాడని చంద్రబాబుపై జగన్ విమర్శలు గుప్పించారు. ఆయన కరువుకు కేరాఫ్ అడ్రస్ అని, ప్రతీ ఏటా ఆయన కరువు మండలాలు ప్రకటించేవారన్నారు. కానీ ఈ నాలుగేళ్లలో అలాంటి పరిస్దితి లేదని, వర్షాలతో ప్రతీ రిజర్వాయర్, చెరువూ నిండాయని జగన్ గుర్తుచేశారు. భూగర్భజలాలు కూడా పెరిగాయని, దీంతో ఆహారధాన్యాల దిగుబడి కూడా పెరిగిందన్నారు. అలాగే రికార్డు స్ధాయిలో ధాన్యం సేకరణ కూడా జరిగిందన్నారు. చంద్రబాబుది పెత్తందార్ల పార్టీ, ప్రభుత్వం అయితే వైసీపీకి పేదల ప్రభుత్వం, రైతన్నల ప్రభుత్వమన్నారు.

చంద్రబాబు, పవన్ కు జగన్ 175 సవాల్
చివరిగా తన ప్రత్యర్ధులు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ పై విమర్శలు గుప్పించి జగన్.. నిత్యం వారు ప్రభుత్వంపై మీడియా సాయంతో చేస్తున్న దాడుల్ని ప్రస్తావించారు. దుష్టచతుష్టయం అంతా ఒక్కటై ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టాలని చూస్తోందని, అయితే తనకు ప్రజలే అండగా ఉన్నారని జగన్ తెలిపారు. వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు, ఆయన దత్తపుత్రుడు పవన్ కళ్యాణ్ కు 175 సీట్లలో పోటీ చేసి గెలిచే ధైర్యముందా అని జగన్ ప్రశ్నించారు. దమ్ముంటే వచ్చే ఎన్నికల్లో వీరిద్దరూ 175 సీట్లకు 175 సీట్లలో పోటీ చేయాలని డిమాండ్ చేశారు. ప్రజలకు వారు ఎప్పుడూ మేలు చేయలేదని, దోచుకో, పంచుకో, తినుకో విధానమే అవలంబించారని జగన్ మండిపడ్డారు. అందుకే ఈ సవాల్ ను స్వీకరించే ధైర్యం వారికి లేదన్నారు.
-
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్












Click it and Unblock the Notifications