చంద్రబాబు గారు మీకే సాధ్యం.. జగన్ స్పెషల్ రిక్వెస్ట్..!!
మాజీ ముఖ్యమంత్రి జగన్ కీలక వ్యాఖ్యలు చేసారు. రైతులు ధరల పతనంతో పడుతున్న ఇబ్బందుల పైన స్పందించారు. ఈ పరిస్థితికి సీఎం చంద్రబాబు కారణమని ఆగ్రహం వ్యక్తం చేసారు. కర్నూలులో కిలో ఉల్లి మూడు రూపాయలేనా! రూపాయిన్నరకే కిలో టమోటానా! ఇవేం ధరలు? రైతు అనేవాడు బతకొద్దా? అంటూ ఆందోళన వ్యక్తం చేశారు. పంటలకు గిట్టుబాటు ధరలు దక్కని పరిస్థితులను ప్రస్తావిస్తూ ప్రభుత్వం మందు కొత్త డిమాండ్ ఉంచారు.
ఉల్లి, టమోటా ధరల పతనం పైన మాజీ సీఎం జగన్ స్పందించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ను ఉద్దేశించి ట్వీట్ చేసారు. అందులో.. " చంద్రబాబుగారూ.. పంటలకు ధరల పతనంలో మీరు సాధించిన రికార్డులు ఇంకెవ్వరికీ సాధ్యం కావు. కర్నూలులో కిలో ఉల్లి మూడు రూపాయలేనా! రూపాయిన్నరకే కిలో టమోటానా! ఇవేం ధరలు? రైతు అనేవాడు బతకొద్దా?. కొన్ని వారాలుగా రైతులు లబోదిబో మంటున్నా మీరు కనికరం కూడా చూపడంలేదు కదా? ఒక ముఖ్యమంత్రిగా ఉంటూ రైతులను ఆదుకోవడంలో ఇంత నిరక్ష్యం చూపుతారా? ఇక ప్రభుత్వం ఉండికూడా ఏం లాభం? ప్రజలు, రైతులు కష్టాల్లో ఉన్నప్పుడు ఆదుకోని ప్రభుత్వం ఉన్నా లేనట్టేకదా?.. అంటూ నిలదీసారు. దీనికి కొనసాగింపుగా.. క్వింటా ఉల్లిని రూ.1,200కు కొనుగోలు చేస్తామంటూ మీరు ప్రకటనల మీద ప్రకటనలు చేశారని గుర్తు చేసారు.

కానీ, తూతూమంత్రంగా చేసి, అదే కర్నూలు మార్కెట్లో వేలం వేయించారు. ఎవ్వరూ కొనడం లేదు, ఏమీ చేయలేమన్న అభిప్రాయాన్ని కలిగించడానికి మీరు చేసిన ప్రయత్నం కాదా ఇది?. ఉల్లికి అసలు ధరే లేకపోతే ఇప్పుడు బిగ్ బాస్కెట్, ఇతరత్రా స్టోర్ లో ఆన్‌లైన్‌లో నెట్లోకి వెళ్లి చూస్తే స్టోర్‌లో కిలో రూ.29 నుంచి రూ.32కు ఎలా అమ్ముతున్నారు? రైతు బజార్లో కూడా కిలో రూ.25లకు తక్కువ అమ్మడం లేదు కదా? మరి రైతులకు ఎందుకు ధర రావడం లేదు? మీ తప్పు కాదా చంద్రబాబుగారూ? ఇంత జరుగుతున్నా రైతులను ఆదుకోవడానికి మీరు కనీసం దృష్టిపెట్టకపోడం అన్యాయం.
అటు టమోటా ధరలు కూడా దారుణంగా పడిపోయినా పట్టించుకోవడం లేదు. కొనేవారు లేక పంటలను రోడ్డుమీదే పారబోస్తున్నారు. చంద్రబాబు గారూ..తక్షణం రైతుల పంటలను కొనుగోలుచేసి వారికి అండగా నిలబడి మానవత్వాన్ని చూపండి అంటూ వైయస్ జగన్ ట్వీట్ చేశారు.












Click it and Unblock the Notifications