బెంగళూరు నుంచి విజయవాడ చేరుకున్న జగన్-ఎయిర్ పోర్టులో టెన్షన్..!
ఏపీ మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఇవాళ బెంగళూరు నుంచి విజయవాడకు సతీసమేతంగా చేరుకున్నారు. ఏపీ అసెంబ్లీ సమావేశాల తొలిరోజు గవర్నర్ ప్రసంగానికి హాజరైన జగన్ ఆ తర్వాత ఢిల్లీలో ధర్నాకు వెళ్లిపోయారు. ఆ తర్వాత కూడా అసెంబ్లీకి హాజరు కాకుండా బెంగళూరు వెళ్లిపోయారు. అనంతరం విశ్రాంతి తర్వాత తిరిగి విజయవాడకు చేరుకున్నారు.
జగన్ కు స్వాగతం పలికేందుకు మరోసారి భారీగా వైసీపీ క్యాడర్ ఎయిర్ పోర్టుకు చేరుకుంది.
వైఎస్ జగన్ కు స్వాగతం పలికేందుకు భారీగా కార్యకర్తలు తరలిరావడంతో కాసేపు ఎయిర్ పోర్టులో హంగామా కనిపించింది. అయితే వీరిని నియంత్రించేందుకు ప్రయత్నించిన పోలీసులతో వాగ్వాదానికి దిగారు. ముఖ్యంగా జగన్ భద్రత కోసం వచ్చిన గన్నవరం ఎస్సైని సైతం కార్యకర్తలు నెట్టేశారు. ఎస్సై భుజం మీద చేయి వేసి కార్యకర్తలు గొడవకు దిగారు. దీంతో కాసేపు ఉద్రిక్తత చోటు చేసుకుంది.

పోలీసుల పై దాడికి దిగిన వ్యక్తులను అదుపులోకి తీసుకునేందుకు గన్నవరం పోలీసులు ప్రయత్నించారు. అయితే పోలీసులను నెట్టేసి జగన్ కాన్వాయ్ వెంట వేరే కారులో వీరంతా పరారయ్యారు. ఈ ఘటనపై గన్నవరం పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు. పోలీసులపై దాడికి ప్రయత్నించడం, అదుపులోకి తీసుకునేలోపు పరారుకావడంపై విచారణ జరుపుతున్నారు. గతంలోనూ జగన్ రాక సందర్భంగా వైసీపీ కార్యకర్తలు గన్నవరం ఎయిర్ పోర్టులో హంగామా సృష్టించిన సందర్భాలున్నాయి.
బెంగళూరు నుంచి విజయవాడ చేరుకున్న జగన్-ఎయిర్ పోర్టులో టెన్షన్..!#YSJagan #Jagan #YSRCP #GannavaramAirport #AndhraPradesh #Oneindiatelugu pic.twitter.com/XH2zK7YTT5
— oneindiatelugu (@oneindiatelugu) July 30, 2024












Click it and Unblock the Notifications