విశాఖ గుగూల్ డేటా సెంటర్ వెనుక, ఆదానీ సహా వారికే క్రెడిట్- జగన్ సంచలనం..!!

విశాఖ గుగూల్ డేటా సెంటర్ పై మాజీ సీఎం జగన్ సంచలన విషయాలను వెల్లడించారు. ఆ డేటా ప్రాజెక్టుకు తమ హయాంలో బీజం పడిందని చెప్పుకొచ్చారు. ఆదానీ పాత్రను వివరించారు. రాష్ట్ర ప్రభుత్వంతో జరిగిన ఒప్పందాలను బయట పెట్టారు. ఈ ప్రాజెక్టులో ఆదానీ .. కేంద్రం.. సింగపూర్ ప్రభుత్వంతో పాటుగా నాటి వైసీపీ ప్రభుత్వం కీలకంగా వ్యవహరించాయని వివరించారు. ఆదానీ భారీ పెట్టుబడి పెట్టగా.. సాంకేతిక అంశాల బాధ్యత గుగూల్ తీసుకుందని చెప్పుకొచ్చారు. అసలు ఈ ప్రాజెక్టు వెనుక జరిగిన పరిణామాలను జగన్ బయట పెట్టారు.

మాజీ ముఖ్యమంత్రి జగన్ విశాఖ గుగూల్ డేటా సెంటర్ ఏర్పాటు వెనుక కీలక అంశాలను బయట పెట్టారు. 2020 నవంబర్ లో ఆదానీ డేటా సెంటర్ కు బీజం పడిందని చెప్పారు. 2023 మే 3న విశాఖలో ఫౌండేషన్ స్టోన్ వేసామని వివరించారు. సముద్ర భూగర్భం నుంచి కేబుల్ లాండింగ్ ను సింగపూర్ నుంచి తెచ్చేందుకు అప్పుడే అంకురార్పణ చేసామని వెల్లడించారు. ఈ డేటా సెంటర్ కోసం ఆదానీ, కేంద్రం, వైసీపీ ప్రభుత్వం, సింగపూర్ ప్రభుత్వం చేసిన కృషి కొనసాగింపు ఇప్పుడు వచ్చిన డేటా సెంటర్ వచ్చిందని జగన్ చెప్పుకొచ్చారు. వైసీపీ ప్రభుత్వం నాడు వేసిన అడుగులే నేడు వచ్చిన డేటా సెంటర్ ఏర్పాటుగా పేర్కొన్నారు. ఆదానీ పెట్టే వెయ్యి మెగావాట్ల పవర్ ప్రాజెక్టు కొనసాగింపే ఇప్పుడు గుగూల్ కొనసాగిస్తోందని వివరించారు.

ys-jagan-revels-the-details-behind-google-data-center-in-vizag-and-adani-role

ఆదానీ - గుగూల్ మధ్య వ్యాపార సంబంధాలు అక్టోబర్ 22 లో నోయిడాలో 4.64 లక్షల చదరపు అడుగుల కోసం గుగూల్ తీసుకునే విధంగా ఒప్పందం జరిగిందన్నారు. ఆ తరువాత ఆదానీ - గుగూల్ మధ్య వ్యాపార ఒప్పందాలు కొనసాగాయని వివరించారు. సింగపూర్ నుంచి విశాఖ కు సీ కేబుల్ తెచ్చే విధంగా సింగపూర్ కు ఏపీ ప్రభుత్వం రాసిన లేఖ విడుదల 2021 మార్చి 9న వెళ్లిందని చెప్పారు. ఆదానీ ఇన్ ఫ్రా కు చెందిన కంపెనీలే ఈ డేటా సెంటర్ ను నిర్మిస్తున్నాయని వివరించారు. గుగూల్ సంస్థ ఏపీ ఐటీ కార్యదర్శికి భూ కేటాయింపుల పైన లేఖ రాసారని చెప్పారు. 87 వేల కోట్లు ఆదానీ పెట్టుబడి పెడుతున్నారని..డేటా సెంటర్ కు కావాల్సిన టెక్నాలజీ, హార్డ్ వేర్ గుగూల్ ఇస్తుందని జగన్ వివరించారు. ఆదానీకి క్రెడిట్ ఇవ్వటానికి చంద్రబాబుకు భయం ఎందుకని జగన్ ప్రశ్నించారు.

ఈ డేటా సెంటర్ కోసం విశాఖ - సింగపూర్ 3900 కిలో మీటర్ల సముద్రంలో కేబుల్ వేయాల్సి ఉంటుందని జగన్ వెల్లడించారు. వీరిందరి భాగస్వామ్యం తోనే గుగూల్ కేంద్రం వచ్చిందని జగన్ వివరించారు. డేటా సెంటర్ లో ఉద్యోగాలు తక్కవే అయినా.. కానీ, విశాఖలో ఎకో సిస్టమ్ డెవలప్ అవుతుందని జగన్ చెప్పుకొచ్చారు. రానున్న కాలంలో మార్పుకు డేటా సెంటర్ కీలకం కానుందని జగన్ పేర్కొన్నారు. తాము ఆదానీ తో ఒప్పందం సమయంలోనే స్కిల్ సెంటర్ తో సహా ఐటీ పార్క్ ద్వారా 24 వేల ఉద్యోగాల కల్పన పై స్పష్టత ఇచ్చామని చెప్పారు. ఎక్కడా ఆదానీ పేరు ప్రస్తావన లేకుండా చంద్రబాబు తాను ఈ డేటా కేంద్రం తెచ్చినట్లుగా ప్రచారం చేసుకుంటున్నారని జగన్ వివరించారు. ఈ డేటా సెంటర్ వెనుక ఆదానీ.. కేంద్రం కీలక పాత్ర పోషించాయని చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+