కష్టాలుండవు, మంచిరోజులొస్తాయి: జగన్(పిక్చర్స్)
అనంతపురం: కష్టాలు కలకాలం ఉండవని, వాటిని తల్చుకుని కుంగిపోవద్దని రైతులకు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి భరోసా ఇచ్చారు. తాను అన్ని విధాలా అండగా ఉంటానని, త్వరలోనే మంచిరోజులు వస్తాయని చెప్పారు. రెండో విడత రైతు భరోసా యాత్రలో భాగంగా బుధవారం ఆయన గుంతకల్లు నియోజకవర్గంలోని గుత్తి, గుంతకల్లు మండలాల్లో నాలుగు కుటుంబాలను పరామర్శించారు.
మూడో రోజు భరోసా యాత్రలో జగన్ వెంట రాజంపేట ఎంపీ మిథున్‌రెడ్డి, అనంతపురం మాజీ ఎంపీ అనంత వెంకట్రామిరెడ్డి, గుంతకల్లు నియోజకవర్గ సమన్వయకర్త వై.వెంకట్రామిరెడ్డి, ప్రోగ్రాం కోఆర్డినేటర్ తలశిల రఘురాం, పార్టీ జిల్లా అధ్యక్షుడు శంకరనారాయణ తదితరులు ఉన్నారు.
కాగా, జగన్‌మోహన్‌రెడ్డి నాల్గో రోజు రైతు భరోసాయాత్ర గురువారం ఉదయం గుంతకల్లు నుంచి ప్రారంభమవుతుంది. అక్కడి నుంచి నల్లదాసరపల్లికి చేరుకుంటారు. అప్పుల బాధ తాళలేక ఆత్మహత్య చేసుకున్న రైతు కురుబ ఉసేనప్ప కుటుంబాన్ని పరామర్శిస్తారు.
అనంతరం తిమ్మాపురం గ్రామానికి వెళ్లి రైతు కసాపురం పుల్లయ్య కుటుంబాన్ని ఓదార్చుతారు. అనంతరం డ్వాక్రా సభ్యులతో సమావేశమవుతారు. అక్కడి నుంచి ఉరవకొండ నియోజకవర్గంలోకి ప్రవేశిస్తారని ప్రోగ్రామ్ కో ఆర్డినేటర్ తలశిల రఘురాం తెలిపారు.

వైయస్ జగన్
కష్టాలు కలకాలం ఉండవని, వాటిని తల్చుకుని కుంగిపోవద్దని రైతులకు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి భరోసా ఇచ్చారు.

వైయస్ జగన్
తాను అన్ని విధాలా అండగా ఉంటానని, త్వరలోనే మంచిరోజులు వస్తాయని చెప్పారు.

వైయస్ జగన్
రెండో విడత రైతు భరోసా యాత్రలో భాగంగా బుధవారం ఆయన గుంతకల్లు నియోజకవర్గంలోని గుత్తి, గుంతకల్లు మండలాల్లో నాలుగు కుటుంబాలను పరామర్శించారు.

వైయస్ జగన్
మూడో రోజు భరోసా యాత్రలో జగన్ వెంట రాజంపేట ఎంపీ మిథున్‌రెడ్డి, అనంతపురం మాజీ ఎంపీ అనంత వెంకట్రామిరెడ్డి, గుంతకల్లు నియోజకవర్గ సమన్వయకర్త వెంకట్రామిరెడ్డి, ప్రోగ్రాం కోఆర్డినేటర్ తలశిల రఘురాం, పార్టీ జిల్లా అధ్యక్షుడు శంకరనారాయణ తదితరులు ఉన్నారు.

వైయస్ జగన్
జగన్‌మోహన్‌రెడ్డి నాల్గో రోజు రైతు భరోసాయాత్ర గురువారం ఉదయం గుంతకల్లు నుంచి ప్రారంభం కానుంది.












Click it and Unblock the Notifications