Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

తేనెతుట్టె కదిపిన జగన్-EWS కోటాతో తెరపైకి కాపు రిజర్వేషన్లు-సమర్దిస్తే బీసీలు దూరం

కులాల ప్రభావం ఎక్కువగా ఉండే ఏపీలో కేంద్ర ప్రభుత్వం గతంలో ప్రకటించిన 10 శాతం ఆర్ధికంగా వెనుకబడిన వారి (ఈడబ్ల్యూఎస్ ) రిజర్వేషన్ల అమలుకు పూనుకోవడం ద్వారా సీఎం జగన్ సాహసోపేత నిర్ణయమే తీసుకున్నారు. అదే సమయంలో కాపు రిజర్వేషన్ల తేనెతుట్టెను కదిపినట్లయింది. దీంతో ఇప్పుడు కాపు రిజర్వేషన్ల వ్యవహారం కాకరేపుతోంది. అన్నింటికీ మించి చంద్రబాబు హయాంలో ఇచ్చిన ఐదు శాతం కోటా ఇవ్వాల్సిందేనంటూ విపక్షాలు చేస్తున్న డిమాండ్లు వైసీపీ సర్కార్ ను ఇరుకునపెడుతున్నాయి.

 ఏపీలో కాపు రిజర్వేషన్ల డిమాండ్

ఏపీలో కాపు రిజర్వేషన్ల డిమాండ్

ఏపీలో కాపు రిజర్వేషన్ల డిమాండ్ కు చాలా చరిత్రే ఉంది. గతంలో బీసీలుగా ఉంటూ ఆ తర్వాత ఓసీలుగా మారిన కాపులకు విద్య, ఉద్యోగాల్లో ఐదు శాతం రిజర్వేషన్ కల్పించాలన్న డిమాండ్ గతంలో కాంగ్రెస్ ప్రభుత్వాల హయాంలోనే తెరపైకి వచ్చింది. అయితే అప్పటికే రిజర్వేషన్లు 50 శాతం మించరాదన్న సుప్రీంకోర్టు ఆంక్షలతో కాంగ్రెస్ ప్రభుత్వాలు దీన్ని ముట్టుకునేందుకు సాహసించలేదు. కానీ 2014 ఎన్నికల సందర్భంగా కాపు రిజర్వేషన్ల హామీని తెరపైకి తీసుకొచ్చిన చంద్రబాబు తేనెతుట్టెను కదిపారు. హామీ నెరవేర్చకపోవడంతో కాపులు ఉద్యమాలకు దిగడంతో ఐదు శాతం రిజర్వేషన్లపై అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపారు. కానీ కేంద్రం దాన్ని తిరస్కరించింది.

 ఈడబ్ల్యూఎస్ కోటా విడగొట్టిన చంద్రబాబు

ఈడబ్ల్యూఎస్ కోటా విడగొట్టిన చంద్రబాబు

ఏపీలో గత టీడీపీ ప్రభుత్వ హయాంలోనే కేంద్ర ప్రభుత్వం ఆర్ధికంగా వెనుకబడిన వర్గాల కోసం 10 శాతం రిజర్వేషన్లు అమల్లోకి తీసుకొచ్చింది. అయితే రాష్ట్రంలో అప్పటికే కాపు రిజర్వేషన్ల పోరు సాగుతున్న నేపథ్యంలో అప్పటి సీఎం చంద్రబాబు ఈ పది శాతం రిజర్వేషన్లను రెండు ఐదు శాతాలుగా విడగొట్టి... ఈడబ్ల్యూఎస్ కోటా కింద ఐదు శాతం, కాపులకు మరో ఐదు శాతం అమలుకు జీవోలు తెచ్చారు. అయితే కేంద్రం ఇచ్చిన 10 శాతం రిజర్వేషన్లు ఇలా విడగొట్టడం కుదరదని హైకోర్టు ఆ జీవోల్ని కొట్టేసింది. దీంతో 10 శాతం ఆర్ధికంగా వెనుకబడిన వారి కోటాలోనే అగ్రవర్ణ పేదలుగా ఉన్న కాపులకు మాత్రమే ప్రయోజనం చేకూరే పరిస్ధితి వచ్చింది. కానీ అవి కూడా అమలు కాలేదు.

 తేనెతుట్టె కదిపిన జగన్

తేనెతుట్టె కదిపిన జగన్

చంద్రబాబు హయాంలో తెరపైకి తెచ్చిన కాపు రిజర్వేషన్లను ఈడబ్లూఎస్ రిజర్వేషన్లలో విభజన ద్వారా ఇవ్వాలని ప్రయత్నించినా కుదరలేదు. ఇలాంటి సమయంలో పాదయాత్ర చేస్తున్న వైఎస్ జగన్ కు కాపుల సెగ తగిలింది. రిజర్వేషన్లు ఇవ్వడం కష్టమని జగన్ చెప్పడంతో కాపులు జగన్ ను అడ్డుకున్నంత పని చేశారు. దీంతో చేసేది లేక తన వంతు ప్రయత్నం చేస్తానని చెప్పి జగన్ అప్పట్లో తప్పించుకున్నారు. దీంతో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు ఇస్తే కాపులు కూడా అడుగుతారన్న భయంతో ఇప్పటివరకూ మౌనంగా ఉన్న జగన్.. ఇక చేసేది లేక ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు ప్రకటించారు. దీంతో తప్పనిసరిగా తేనెతుట్టెను కదిపారు.

 విపక్షాలకు భారీ అస్త్రం

విపక్షాలకు భారీ అస్త్రం

వైసీపీ అధికారంలోకి వచ్చిన రెండేళ్లలో రాజకీయంగా వైఎస్ జగన్ ను ఇబ్బందిపెట్టడానికి విపక్షాకు భారీ అస్త్రాలేవీ దొరకలేదు. మధ్యలో దేవాలయాల్లో విగ్రహాల ధ్వంసంతో రాజకీయం చేయాలని ప్రయత్నించినా ప్రభుత్వం సకాలంలో మేల్కొనడంతో అదీ కుదరలేదు. ఇప్పుడు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల ప్రకటనతో విపక్షాలకు భారీ అస్త్రం లభించినట్లయింది. కాపుల్ని రెచ్చగొట్టడం ద్వారా తమకూ ఐదు శాతం రిజర్వేషన్లు ఇవ్వాల్సిందేనన్న డిమాండ్ ను జగన్ ముందు పెడుతున్నారు. దీంతో జగన్ కు ఏం చేయాలో పాలుపోని పరిస్ధితి ఎదురవుతోంది.

Recommended Video

    AP & TS Krishna Waters Dispute వాటర్ వార్ కు తెర | Supreme Court || Oneindia Telugu
     కాపులకు ఇస్తే బీసీలు దూరం

    కాపులకు ఇస్తే బీసీలు దూరం

    కాపులకు రిజర్వేషన్ ఇవ్వాలంటే ఉన్న ఏకైక అవకాశం బీసీ రిజర్వేషన్లలో వాటా ఇవ్వడమే. అలా జరిగితే తొలిసారి వైసీపీ వైపు మొగ్గిన బీసీలకు అన్యాయం జరుగుతుంది. దీంతో బీసీల్ని ఒప్పించి కాపులకు రిజర్వేషన్లు ఇవ్వలేక, అలాగని బీసీ రిజర్వేషన్లను పెంచలేక జగన్ ఇబ్బందులు ఎదుర్కోక తప్పదని తెలుస్తోంది. ఒకవేళ బీసీ రిజర్వేషన్లలో వారికి కోత పెట్టి కాపులకు ఇస్తే మాత్రం బీసీల నుంచి తీవ్ర వ్యతిరేకత తప్పకపోవచ్చు. అసలే తొలిసారి బీసీల సాయంతో భారీ మెజారిటీ అందుకున్న జగన్.. ఆ సాహసం చేయకపోవచ్చు. అలా అని కాపు రిజర్వేషన్ల వ్యవహారాన్ని కూడా ఎంతోకాలం నాన్చే పరిస్దితీ లేదు. దీంతో జగన్ పరిస్ధితి ముందు గొయ్యి.. వెనుక నుయ్యిగా మారిపోయింది.

    More From
    Prev
    Next
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+