వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జగన్ ధీమా అదే-పవన్ బలహీనత కూడా-అధిగమిస్తేనే చంద్రబాబుకు అధికారం

|
Google Oneindia TeluguNews

ఏపీలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రావడానికి పరోక్షంగా దోహదం చేసిన బీజేపీ ఇప్పుడు కూడా వైఎస్ జగన్ కు పరోక్షంగా సహాయ సహకారాలు అందిస్తూనే ఉంది. కేంద్రం నుంచి నిధులు ఇవ్వకపోయినా మిగతా విషయాల్లో జగన్ కు కేంద్రం నుంచి అందుతున్న సహకారం విపక్ష పార్టీలైన టీడీపీ, జనసేనను చికాకు పెడుతూనే ఉంది. ఈ నేపథ్యంలో తాజాగా పవన్ కళ్యాణ్ బీజేపీని ఒప్పిస్తానని సంచలన వ్యాఖ్యలు చేశారు. అంటే బీజేపీ ఒప్పుకోవడం లేదనే అర్ధం ఇక్కడ ప్రతిధ్వనిస్తోంది. దీంతో చంద్రబాబు అధికారంలోకి రావాలంటే బీజేపీని ఒప్పించక తప్పని పరిస్ధితి ఉంది.

 ఆసక్తికరంగా ఏపీ రాజకీయం

ఆసక్తికరంగా ఏపీ రాజకీయం

ఏపీలో వైసీపీ పాలన మూడేళ్లు పూర్తి చేసుకుంటున్న నేపథ్యంలో రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. దీనికి రాజకీయ పార్టీల నేతలు ముందస్తు ఎన్నికల మంత్రం కూడా జోడిస్తుండటంతో ఇవి మరింత ఆసక్తికరంగా మారిపోతున్నాయి. ముఖ్యంగా పొత్తుల రాజకీయాల జోరు కూడా పెరిగింది. దీంతో వైసీపీకి వ్యతిరేకంగా విపక్షాలను ఏకం చేస్తానంటూ పవన్ కళ్యాణ్ ముందుకొచ్చారు. దీనికి కౌంటర్ గా పొత్తుల్లేకపోతే మీరు పోటీ చేయలేరా, గెలవలేరా అంటూ వైసీపీ ఎదురుదాడి చేస్తోంది. దీంతో సాధ్యమైనంత త్వరగా ఈ చర్చకు ముగింపు పలికేందుకు విపక్షాలు ప్రయత్నిస్తున్నాయి.

 జగన్ ధీమా అదే

జగన్ ధీమా అదే

ఏపీలో వైసీపీ అధికారంలోకి రాకముందు కేంద్రంలో ఉన్న బీజేపీతో దూరంగా ఉన్న వైఎస్ జగన్.. తాను అధికారంలోకి వచ్చాక మాత్రం రాష్ట్ర అవసరాల పేరుతో ఆ పార్టీకి దగ్గర కావడం మొదలుపెట్టారు. కేంద్రంలో అడిగినా అడక్కపోయినా సాయం చేస్తూ వస్తున్నారు. ఇప్పటికీ బీజేపీతో జగన్ బంధం దృఢంగా ఉంది. దీంతో వచ్చే ఎన్నికల్లోనూ బీజేపీ సాయంతో గట్టెక్కేయొచ్చన్న ధీమా జగన్ లో కనిపిస్తోంది. అందుకే రాష్ట్రంలోని విపక్షాలను జగన్ అస్సలు లెక్కచేయడం లేదు. విపక్షం తమకు ఏమాత్రం పోటీ ఇవ్వలేని పరిస్ధితుల్లో ఉందని జగన్ భావిస్తున్నారు.

 పవన్ బలహీనత అదే

పవన్ బలహీనత అదే

రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వాన్ని గద్దెదింపేందుకు విపక్షాల్ని ఏకం చేసేందుకు ప్రయత్నిస్తున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు తమ మిత్రపక్షం బీజేపీయే బలహీనతగా మారిపోయింది. ఇప్పుడు బీజేపీతో కలిసి ముందుకు వెళ్లాలా వద్దా అన్న మీమాంశ ఓవైపు, బీజేపీ,టీడీపీతో కలిసి ఓ ఉమ్మడి విపక్షాన్ని ఏర్పాటు చేయాలన్న ఆతృత మరోవైపు పవన్ కళ్యాణ్ ను ఆలోచనలో పడేస్తున్నాయి. అయితే టీడీపీతో కలిసేందుకు బీజేపీ సిద్ధంగా లేకపోవడంతో ఆ పార్టీని ఒప్పించేందుకు పవన్ తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే బీజేపీ ఉమ్మడి విపక్షానికి సిద్ధం కాకుండా జనసేనతోనే ప్రయాణానికి మాత్రమే మొగ్గుచూపితే పవన్ కు ఇదే పెద్ద బలహీనతగా మారిపోయే ప్రమాదం కనిపిస్తోంది.

 అధిగమిస్తేనే చంద్రబాబుకు అధికారం ?

అధిగమిస్తేనే చంద్రబాబుకు అధికారం ?

బీజేపీతో అంటకాగుతున్న వైసీపీ అధినేత జగన్ ను ఆ పార్టీకి దూరం చేసేందుకు ఓవైపు టీడీపీ, మరోవైపు జనసేన తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. మరోవైపు బీజేపీతో కలిసి ఉమ్మడి విపక్షం ఏర్పాటు చేసేందుకు ప్రయత్నిస్తున్నాయి. కానీ అదంత సులువుగా కనిపించడం లేదు. టీడీపీ, జనసేనతో కలిసి వెళ్లడం ద్వారా ఏదైనా అదనపు ప్రయోజనం ఉంటుందని అనుకుంటే మినహా ఈసారి బీజేపీ వీరిద్దరితో కలిసేందుకు సిద్ధంగా లేదు. దీంతో చంద్రబాబుకు అధికారం అందాలంటే ముందు జగన్-బీజేపీ బంధం విడదీయడం సవాల్ గా మారిపోతోంది. ఈ అడ్డంకి అధిగమిస్తేనే

చంద్రబాబుకు మరోసారి అధికారం దక్కేలా ఉంది.

English summary
bjp's confidence in ys jagan become hindrance for pawan kalyan's trails to make united opposition in andhrapradesh.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X