బుద్ధి చెప్తారు: జగన్‌పై కోడెల నిప్పులు, ఢిల్లీపై శైలజానాథ్

సమైక్యం ముసుగులో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధికార కాంగ్రెసు పార్టీకి దాసోహమంటోందని ధ్వజమెత్తారు. తమ పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు తన దీక్ష ద్వారా రాష్ట్రంలోని సమస్యను జాతీయ నేతల దృష్టికి తీసుకు వెళ్లారన్నారు. జగన్ ఇంట్లో దొంగ దీక్షలు చేశారన్నారు. వారికి ప్రజలు బుద్ధి చెబుతారన్నారు. 1947లో డాలర్‌తో సమానంగా ఉన్న రూపాయి ఇప్పుడు హీన స్థితికి చేరుకుందని ఆవేదన వ్యక్తం చేశారు.
బొత్సపై గాలి ధ్వజం
ప్రస్తుత రాష్ట్ర పరిస్థితికి ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ, ఏఐసిసి అధినేత్రి సోనియా గాంధీలే కారణమని టిడిపి నేత గాలి ముద్దుకృష్ణమ నాయుడు విజయనగరంలో ఆరోపించారు. రాష్ట్ర విభజనకు పునాది వేసింది దివంగత వైయస్ రాజశేఖర రెడ్డే అన్నారు.
ప్రజలు బుద్ధి చెబుతారు: శైలజానాథ్
అధికారం ఉందని కేంద్రం ఇష్టానుసారం వ్యవహరిస్తే ప్రజలే బుద్ధి చెబుతారని మంత్రి శైలజానాథ్ అన్నారు. సమైక్య రాష్ట్రం కోసం తాము చేపట్టాల్సిన కార్యక్రమాలను రేపు చర్చిస్తామన్నారు. విభజన అనివార్యం అంటున్న మంత్రులు ఆ విషయాన్ని ప్రజల్లోకి వెళ్లి చెప్పాలని, అదే జరిగితే భవిష్యత్తులో కాంగ్రెసు చాలా ప్రశ్నలకు సమాధానం చెప్పవలసి ఉంటుందన్నారు.












Click it and Unblock the Notifications