ముహూర్తం కుదిరింది?: అనుకున్నట్లే.. జగన్ పాదయాత్ర తేదీ మార్పు
ముందుగా అనుకున్నట్లు అక్టోబర్ 27నుంచి కాకుండా నవంబర్ 2 నుంచి జగన్ పాదయాత్ర మొదలుకానుంది.
విజయవాడ: అనుకున్నదే అయింది. ముందుగా అనుకున్నట్లు అక్టోబర్ 27నుంచి కాకుండా నవంబర్ 2 నుంచి జగన్ పాదయాత్ర మొదలుకానుంది. ఇడుపులపాయ నుంచి వైసీపీ అధినేత జగన్ తన పాదయాత్ర ప్రారంభించనున్నారు.
పాదయాత్ర కన్నా ముందు జగన్ తిరుమల శ్రీవారిని దర్శించుకుని ఆశీస్సులు తీసుకుంటారు. అనంతరం ఇడుపులపాయ చేరుకుని పాదయాత్రకు శ్రీకారం చుడతారు. తొలుత కడప, అనంతపురం, కర్నూలు, చిత్తూరు జిల్లాల్లో పాదయాత్ర సాగుతుంది.

అనంతరం ప్రకాశం, గుంటూరు, కృష్ణా, ఉభయ గోదావరి, విశాఖపట్టణం, విజయనగరం, శ్రీకాకుళం మీదుగా సాగి ఇచ్చాపురంలో ముగుస్తుందని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి.
కాగా, పాదయాత్ర తేదీ మారడానికి ముహూర్త బలం లేకపోవడమే ప్రధాన కారణమని ప్రచారం జరిగిన తెలిసిందే. జ్యోతిష్యుల మాట ప్రకారమే జగన్ పాదయాత్ర తేదీలో మార్పు చేసుకుని ఉంటాడన్న వాదన వినిపిస్తోంది. మరి ముహూర్త బలం చూసుకుని మరీ రంగంలోకి దిగుతున్న జగన్.. 2019లో ఎన్నికల్లో ఏ మేర రాణిస్తారో వేచి చూడాలి.












Click it and Unblock the Notifications