జగన్ కండిషన్స్ పాటించాలి, లేకుంటే ఇబ్బంది: సిబిఐ

పార్టీ అధ్యక్షుడిగా ఇతర రాష్ట్రాల్లో పలు పార్టీల నేతలతో మాట్లాడాల్సి ఉందని, అందుకు అనుమతి లేకుండా రాష్ట్రం విడిచి వెళ్ల కూడదన్న షరతును సడలించాలని కోరుతూ జగన్ దాఖలు చేసుకున్న పిటిషన్‌పై నాంపల్లి సిబిఐ రెండో కోర్టులో మంగళవారం వాదనలు జరిగిన విషయం తెలిసిందే.
కోర్టు నిబంధనలకు తమ క్లయింట్ లోబడి ఉంటారని, అదే సందర్భంలో పార్టీ నాయకుడిగా ఆయనకు గల బాధ్యతలను నిర్వర్తించాల్సి ఉందని జగన్ తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. దీనిపై సిబిఐ న్యాయవాది స్పందిస్తూ జగన్ పర్యటనకు అనుమతిస్తే విచారణకు ఇబ్బందులు ఎదురవుతాయన్నారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి కేసును 15కు వాయిదా వేశారు.
విదేశాలకు వెళ్లేందుకు అనుమతించండి
తనకు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ ఓఎంసి కేసు నిందితుడు శ్రీనివాస్ రెడ్డి దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌పై విచారణను సిబిఐ కోర్టు 19కి వాయిదా వేసింది. తనకు విదేశాలకు వెళ్లేందుకు అనుమతించాలని కోరుతూ ఎమ్మార్ కేసులో టెండర్ ఆఫ్ పార్డాన్ పొందిన టి రంగారావు దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ శుక్రవారానికి వాయిదా పడింది.












Click it and Unblock the Notifications