అమరావతిలో...: లోకేష్ సహా మంత్రులపై 'సాక్షి' షాకింగ్, దేవినేని ఆగ్రహం
విజయవాడ: ఏపీ రాజధాని అమరావతి పరిధిలో తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, భారీ నీటి పారుదల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వర రావు చాలా భూములు కొన్నారని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మంగళవారం నాడు ఆరోపించింది. దానిపై దేవినేని బుధవారం స్పందించారు.
రాజధాని ప్రాంతమైన అమరావతిలో తనకు ఎలాంటి భూములు లేవని ఆయన చెప్పారు. రాజధానిలో తనకు భూములున్నాయని ప్రతిపక్షం అవాస్తవాలు ప్రచారం చేస్తోందన్నారు. ఈ తరహా విషయాల్లో తమ పార్టీ అధినేత చంద్రాబాబు, పార్టీ యువనేత లోకేశ్ పైనా వైసిపి నేతలు అసత్య ఆరోపణలు చేస్తున్నారన్నారు.
కాగా, ఏపీ రాజధాని అమరావతిలో పలువురు టిడిపి నేతలు భూములు కొన్నారని వైసిపి అధినేత జగన్‌కు చెందిన సాక్షి పత్రికలో వార్తలు వచ్చాయి. మంత్రులు రావెల కిషోర్ బాబు, మురళీ మోహన్, నారాయణ, పత్తిపాటి పుల్లారావు, నారా లోకేష్, సుజనా చౌదరి, దేవినేని ఉమామహేశ్వర రావు, కొమ్మాలపాటి తదితరులు భూములు కొన్నారని రాసింది.
మంత్రి నారాయణ మూడవేలకు పైగా ఎకరాలు, రావెల 55 ఎకరాలు, మురళీ మోహన్ 53 ఏకరాలు, పత్తిపాటి పుల్లారావు 196 ఎకరాలు, లోకేష్ 500 ఎకరాలు, సుజనా చౌదరి 700 ఎకరాలు, దేవినేని 86 ఎకరాలు, కొమ్మాలపాటి 42 ఎకరాలు కొన్నట్లు పేర్కొంది.

ఇది అంతర్జాతీయ కుంభకోణమని, రాజధానిని దురాక్రమణ చేశారని, చంద్రబాబు బినామీలే రాబంధులు అని, వీరు వేలాది ఎకరాలు కాజేశారని, తమ వద్ద సాక్షాలు ఉన్నాయని సాక్షి పత్రిక రాసింది. పెద్దలంతా కలిసి పక్కా ప్లాన్‌తో.. అన్నం పెట్టేవాడి కడుపు కొట్టి 25వేల ఎకరాలు మింగేశారని, రాజధాని అస్త్రాన్ని ఉపయోగించి దోపిడీకి స్కెచ్ గీశారని తీవ్ర ఆరోపణలు చేసింది.
అంతేకాదు, రాజధానిలో ఏ జోన్ ఎక్కడ రావాలో వారే నిర్ణయించారని, బినామీల భూములను కమర్షియల్, డెవలప్‌మెంట్ జోన్లలో పడేశారని, పేదరైతుల భూములను గ్రీన్ జోన్లో పడేశారని పేర్కొంది. వారి భూ మి కోసం ఎకరం నాలుగు కోట్లు, రైతుల భూములు ఎకరం రూ.20 లక్షలు పలికేలా మాయ చేశారని ఆరోపించింది.
టిడిపి నేతలు ఒక్కొక్కరు వందల ఎకరాలు తీసుకొని.. వేల కోట్ల రూపాయల లబ్ధి పొందారని ఆరోపించింది. అధే సమయంలో... రాజధానిని ఎక్కడ నిర్మించాలనే శివరామకృష్ణన్ కమిషన్ సిఫార్సులు పట్టించుకోలేదని, నూజివీడులో రాజధాని అంటూ లీకులు ఇచ్చారని, దాంతో అమరావతిలో భూముల ధరలు తగ్గాయని, దీంతో వారు అమరావతి ప్రాంతంలో పెద్ద ఎత్తున కారుచౌకగా భూములు కొన్నారని ఆరోపించంది.
నూజివీడు ప్రాంతంలో భూములు కొన్నవారు నష్టపోయారని పేర్కొంది. అయితే, ఈ భూమి కొనుగోలు వార్తలను తెలుగుదేశం పార్టీ నేతలు కొట్టి పారేస్తున్నారు. దీనిని చాలా సీరియస్‌గా తీసుకుంటున్నారని తెలుస్తోంది. ఇప్పటికే దేవినేని మాట్లాడుతూ.. తాను ఎలాంటి భూములు కొనలేదని, తమ పైన అసత్య ప్రచారం చేస్తోందని దుయ్యబట్టారు.
-
today rashiphalalu: నేడు వీరికి సంపదలు ఇవ్వనున్న సూర్యుడు, లక్కంటే వీరిదే! -
డ్రైవింగ్ లైసెన్స్ విషయంలో తెలంగాణ రవాణా శాఖ సరికొత్త నిర్ణయం! -
ఆ పిచ్చోడిని ఆపండి-గల్ఫ్ అగ్నిగోళం కాకముందే-ఐఏఈఏ మాజీ బాస్ పిలుపు..! -
ప్రేమ పేరుతో గొడ్డు మాంసం తినిపిస్తూ.. మతం మార్చి నరకయాతన! -
నా కోరిక తీరడం లేదు - ప్రధాని మనసులో మాట బయటపెట్టేశారు! -
జనసేన ఎమ్మెల్యేకు ఈసీ షాక్.. బయటపడ్డ 'మిరాకిల్' అక్రమాలు! -
తల్లికి వందనం పథకంపైన సీఎం చంద్రబాబు శుభవార్త! -
విజయసాయిరెడ్డి ఇంట్లోనే ఉంటున్న రఘురామకృష్ణంరాజు ? -
సతీమణికి విజయ్ స్పెషల్ విషెస్: ఆ క్యాప్షన్ వెనుక ఉన్న సీక్రెట్ ఏంటి? -
పెట్రోల్ కష్టాలు.. వారానికి 2 రోజులు సెలవులు ప్రకటించిన ప్రభుత్వం -
పసిడి ధరల్లో బిగ్ బ్లాస్ట్.. ఈ వారంలో -
సామాన్యులకు బిగ్ షాక్.. గ్యాస్ సిలిండర్ ధర భారీగా పెంపు.. అర్ధరాత్రి నుంచి అమలు












Click it and Unblock the Notifications