జగన్ ఓదార్పు, విజయమ్మ అభివాదం(పిక్చర్స్)

పశ్చిమగోదావరి: రెండు నెలలు ఆగితే తమ ప్రభుత్వమే అధికారంలోకి వస్తుందని, ఇకముందు ఎలాంటి ఇబ్బందులు ఉండవని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రజలకు హామీ ఇచ్చారు. వరుసగా మూడో రోజు పశ్చిమ గోదావరి జిల్లాలో పర్యటించిన ఆయన ఆదివారం తణుకు, తాడేపల్లి గూడెం నియోజక వర్గాల్లో విస్తృతంగా పర్యటించారు.

పలువురు వృద్ధులు, మహిళలను ఓదార్చిన జగన్మోహన్ రెడ్డి, తమ బాధలు చెప్పుకోవడానికి వచ్చిన ప్రజలకు ధైర్యం చెప్పారు. కాగా, గొంతు సమస్య ఏర్పడటంతో పరీక్షించిన వైద్యులు రెండు రోజులపాటు ఎక్కువగా ప్రసంగించవద్దని జగన్మోహన్ రెడ్డికి వైద్యులు సూచించారు. దీంతో ఆయన రోడ్ షోలో ఎక్కువసేపు తన ప్రసంగాన్ని కొనసాగించలేకపోయారు.మైకు ప్రసంగాలు చేయని జగన్మోహన్ రెడ్డి.. ప్రతీ ఒక్కరినీ పలకరించుకుంటూ తన యాత్రను కొనసాగించారు.

చంద్రబాబుపై మండిపడిన విజయమ్మ

తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుపై వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైయస్ విజయమ్మ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. రైతుల రుణమాఫీ చేయాలంటూ కేంద్రానికి ఎప్పుడైనా ఒక్క లేఖయినా రాశారా అని చంద్రబాబును ఆమె ప్రశ్నించారు. ఎన్నికల ముందు అనేక హామీలు ఇచ్చిన చంద్రబాబు, అధికారంలోకి వచ్చిన తర్వాత వాటన్నింటినీ తుంగలో తొక్కారని ఆరోపించారు.

అనంతపురంలోని మడకశిరలో నిర్వహించిన ర్యాలీలో ఆమె మాట్లాడుతూ.. పేద ప్రజలకు ఇచ్చే బియ్యం ధరను కిలోకు రూ. 5.25కు పెంచాడని, మద్యం షాపులు గ్రామాల వరకు వెళ్లేందుకు చంద్రబాబే కారణమని ఆమె ఆరోపించారు. ఇంకేంత కాలం ప్రజలను మోసం చేస్తారని ఆమె చంద్రబాబును ప్రశ్నించారు. చంద్రబాబు హయాంలో రైతులు తమ సమస్యలను పరిష్కరించాలని ఆందోళనలకు దిగితే వారిపై లాఠీ ఛార్జీలు చేశారని మండిపడ్డారు. అదే విధంగా అంగన్‌వాడీ కార్యకర్తలను గుర్రాలతో తొక్కించిన చరిత్ర చంద్రబాబుదేనని ఆరోపించారు.

చంద్రబాబు వ్యవసాయం దండగ అని చెప్పారని విమర్శించారు. చంద్రబాబు తన హయాంలో సత్యం రామలింగరాజు లాంటి వాళ్లకు ఫీజు రియంబర్స్ ఇచ్చి.. ఇప్పుడు విద్యార్థులకు పీజు రియంబర్స్‌మెంట్ ఇస్తానని మోసపూరిత హామీలు ఇస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రపతి, ప్రధానుల ఎన్నికలో తామే కీలక పాత్ర పోషించామంటున్న చంద్రబాబు.. రాష్ట్ర ప్రజలకు ఏం చేశారో చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు. వచ్చే ఎన్నికల్లో వైయస్ జగన్ గెలుపంటే అది ప్రజలదేనని విజయమ్మ చెప్పారు.

ర్యాలీలో విజయమ్మ అభివాదం

ర్యాలీలో విజయమ్మ అభివాదం

అనంతపురం జిల్లాలో నిర్వహించిన ర్యాలీలో ప్రజలకు అభివాదం చేస్తున్న వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు విజయమ్మ ప్రజలకు అభివాదం చేస్తున్న దృశ్యం.

జగన్ ఓదార్పు

జగన్ ఓదార్పు

వరుసగా మూడో రోజు పశ్చిమ గోదావరి జిల్లాలో పర్యటించిన ఆయన ఆదివారం తణుకు, తాడేపల్లి గూడెం నియోజక వర్గాల్లో విస్తృతంగా పర్యటించారు. ఈ సందర్భంగా ఓ వికలాంగుడిని ఓదారుస్తున్న వైయస్ జగన్.

జగన్ అభివాదం

జగన్ అభివాదం

రెండు నెలలు ఆగితే తమ ప్రభుత్వమే అధికారంలోకి వస్తుందని, ఇకముందు ఎలాంటి ఇబ్బందులు ఉండవని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రజలకు హామీ ఇచ్చారు.

విజయమ్మ ప్రసంగం

విజయమ్మ ప్రసంగం

తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుపై వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైయస్ విజయమ్మ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఇంకేంత కాలం ప్రజలను మోసం చేస్తారని ఆమె చంద్రబాబును ప్రశ్నించారు.

జనంలో జగన్

జనంలో జగన్

వరుసగా మూడో రోజు పశ్చిమ గోదావరి జిల్లాలో పర్యటించిన ఆయన ఆదివారం తణుకు, తాడేపల్లి గూడెం నియోజక వర్గాల్లో విస్తృతంగా పర్యటించారు. పలువురు వృద్ధులు, మహిళలను ఓదార్చిన జగన్మోహన్ రెడ్డి, తమ బాధలు చెప్పుకోవడానికి వచ్చిన ప్రజలకు ధైర్యం చెప్పారు.

మహిళకు ఓదార్పు

మహిళకు ఓదార్పు

గొంతు సమస్య ఏర్పడటంతో పరీక్షించిన వైద్యులు రెండు రోజులపాటు ఎక్కువగా ప్రసంగించవద్దని జగన్మోహన్ రెడ్డికి వైద్యులు సూచించారు. దీంతో ఆయన రోడ్ షోలో ఎక్కువసేపు తన ప్రసంగాన్ని కొనసాగించలేకపోయారు.మైకు ప్రసంగాలు చేయని జగన్మోహన్ రెడ్డి.. ప్రతీ ఒక్కరినీ పలకరించుకుంటూ తన యాత్రను కొనసాగించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+