పల్నాడుకు బయల్దేరిన జగన్, చివరి నిమిషంలో..!!

మాజీ సీఎం జగన్ పల్నాడు జిల్లా పర్యటన పైన ఉత్కంఠ కొనసాగుతోంది. సత్తెనపల్లి నియోజకవర్గ పరిధిలో రెంటపాళ్లకు జగన్ ఈ రోజు రానున్నారు. గతంలో చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యం లో పోలీసులు ఆంక్షలు విధించారు. జగన్ భద్రతా కాన్వాయ్ తో పాటుగా వంద మందికి మాత్రమే అనుమతి ఇస్తామని తేల్చి చెప్పారు. అయితే, వైసీపీ నేతలు యథావిధిగా జగన్ టూర్ కు భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు. జగన్ పర్యటనకు ఆంక్షల పైన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీంతో, జగన్ పర్యటనల వేళ హై టెన్షన్ నెలకొంది.

మాజీ ముఖ్యమంత్రి జగన్ కాసేపట్లో సత్తెన పల్లి మండలం రెంటపాళ్ల వెళ్లనున్నారు. ఆత్మహత్య చేసుకున్న రెంటపాళ్ల ఉప సర్పంచ్ నాగమల్లేశ్వరరావు కుటుంబ సభ్యులను జగన్ పరామర్శించ నున్నారు. అక్కడ ఆయన విగ్రహాన్ని జగన్ ఆవిష్కరించనున్నారు.ఈ మేరకు వైసీపీ అధికారికంగా జగన్ టూర్ షెడ్యూల్ ను విడుదల చేసింది. కాగా, పల్నాడు జిల్లా పోలీసులు ఈ పర్యటన వేళ ఆంక్షలతో అనుమతి ఇచ్చారు. జగన్ పరామర్శకు వస్తున్న నాగమల్లేశ్వరరావు కుటుంబం నివా సం ఉంటున్న ఇల్లు ఇరుకు సందుల్లో ఉందని అవాంఛనీయ సంఘటనలకు అవకాశం లేకుండా ముందస్తు చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. జగన్ పర్యటన వేళ అమరావతి ద్రోహి జగన్ అంటూ వెలిసిన ఫ్లెక్సీలను అధికారులు తెలిగించారు.

ys-jagan-sattenapalli-tour-amid-police-restrictions-leads-to-tension-situation

జగన్ పొదిలి వెళ్లిన సమయంలో చోటు చేసుకున్న ఘటనల నేపథ్యంలో పోలీసులు అప్రమత్తం అయ్యారు. అటు జగన్ పర్యటనలో అమరావతి పైన సాక్షి ఛానల్ లో చేసిన వ్యాఖ్యలకు వ్యతిరేకం గా నిరసనలు జరిగే అవకాశం ఉందని అనుమానిస్తున్నారు. దీంతో, పోలీసులు ఎలాంటి అవాంఛ నీయ ఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. వైసీపీ పల్నాడు జిల్లా నేతలు మాత్రం జగన్ పర్యటన పైన ఆంక్షల పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జగన్ వస్తే జనం వస్తారని.. తాము పోలీసుల సూచనల మేరకు నడుచుకుంటున్నామని చెబుతున్నారు. జగన్ పర్యటనలో జనం భారీగా వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఈ క్రమంలో జగన్ తాడేపల్లి నుంచి గుంటూరు శివార్ల మీదుగా రెంటపాళ్ల చేరుకోనున్నారు. ఇప్పటికే పోలీసులకు రెంటపాళ్ల వద్ద భారీగా మొహరించినట్లు తెలుస్తోంది. దీంతో.. జగన్ పర్యటన పైన ఉత్కంఠ కొనసాగుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+