హోదా కోసం ఏం చేసినా మేం ఓకే: పవన్ కళ్యాణ్ తర్వాత వైయస్ జగన్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించడానికి ఏ కార్యక్రమం చేసినా తమ పార్టీ స్వాగతిస్తుందని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి సోమవారం నాడు చెప్పారు.

విజయవాడ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించడానికి ఏ కార్యక్రమం చేసినా తమ పార్టీ స్వాగతిస్తుందని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి సోమవారం నాడు చెప్పారు.

హోదాను కోరుకుంటూ ఎలాంటి సభ నిర్వహించినా, కార్యక్రమాలు చేపట్టినా తమ పార్టీ పూర్తి మద్దతిస్తుందన్నారు. ఆయన ఉదయం 11:47 గంటలకు సామాజిక అనుసంధాన వేదిక ట్విట్టర్ ద్వారా ట్వీట్ చేశారు.

'ఏపీకి స్పెషల్ స్టాటస్ కోరుతూ ఏ కార్యక్రమం చేపట్టినా స్వాగతిస్తాం. ప్రతి ఒక్కరూ, ముఖ్యంగా యువత ముందడుగు వేసి హోదా కోసం చేపట్టే కార్యక్రమాలకు మద్దతిచ్చి, వాటిని విజయవంతం చేయాలి' అని జగన్ కోరారు.

YS Jagan says YSRCP support any programe or event for Special Tag

తమిళనాడులో జల్లికట్టు ఉద్యమం స్ఫూర్తితో ప్రత్యేక హోదా కోసం పోరాడాలని పలువురు సూచిస్తున్న విషయం తెలిసిందే. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా జల్లికట్టు స్ఫూర్తిగా హోదా కోసం పోరాడుదామన్నారు.

జల్లికట్టు ఉద్యమం తరహా ప్రత్యేక హోదా కోసం ఈ నెల 26వ తేదీన రాష్ట్రవ్యాప్త నిరసనలకు యువత కదులుతోంది. దీంతో తొలుత పవన్ కళ్యాణ్ దానిపై స్పందించారు. ఇప్పుడు జగన్ కూడా స్పందించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+