వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రాజీనామా: 'ఫలించని జగన్ వ్యూహం, సెల్ఫ్ గోల్', బీజేపీపై బాబు కీలక వ్యాఖ్యలు

|
Google Oneindia TeluguNews

అమరావతి: టీడీపీ సమన్వయ కమిటీ సమావేశంలో గురువారం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీ ప్రయోజనాల ఎట్టి పరిస్థితుల్లోను రాజీపడేది లేదని, ఎంపీలు పోరాటానికి సిద్ధం కావాలని సూచించారు. కేంద్రంతో గొడవ పెట్టుకునే ఆలోచన లేదని, ఏపీ కోసం తగ్గేది లేదన్నారు.

బాబును ప్రసన్నం చేసుకోండి: వారికి మోడీ ఆదేశం? దోస్తీ.. బీజేపీకి మరో పెద్ద భయంబాబును ప్రసన్నం చేసుకోండి: వారికి మోడీ ఆదేశం? దోస్తీ.. బీజేపీకి మరో పెద్ద భయం

త్వరలో కీలక నిర్ణయం తీసుకుంటామని కూడా నేతలకు ఆయన తేల్చి చెప్పారని తెలుస్తోంది. దీంతో ఆయన ఏం చేస్తారనే చర్చ సాగుతోంది. ఏప్రిల్ 6న హోదా కోసం తమ పార్టీ ఎంపీలు రాజీనామా చేస్తారని జగన్ ప్రకటించారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు అడుగులపై చర్చ సాగుతోంది.

విజయసాయిరెడ్డి ఎఫెక్ట్: షాకింగ్ మెలిక, రాజీనామాపై మళ్లీ దొరికిపోయిన జగన్విజయసాయిరెడ్డి ఎఫెక్ట్: షాకింగ్ మెలిక, రాజీనామాపై మళ్లీ దొరికిపోయిన జగన్

 జగన్ సెల్ఫ్ గోల్

జగన్ సెల్ఫ్ గోల్

వైయస్ జగన్‌కు కౌంటర్ ఇచ్చే విధంగా ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నారనే చర్చ సాగింది. కానీ వైసీపీకి ధీటుగా తాము ఆ పార్టీ కంటే నెల రోజుల ముందే రాజీనామా చేస్తామని టీడీపీ ప్రకటించింది. వైసీపీ రాజీనామాలపై భేటీలో ఓ టీడీపీ నేత మాట్లాడుతూ.. జగన్ సెల్ఫ్ గోల్ చేసుకున్నారని వ్యాఖ్యానించారని తెలుస్తోంది. సాధారణ ఎన్నికలకు ఏడాది ముందు రాజీనామా చేస్తే ఉప ఎన్నికలు రావని, అలాగే విజయసాయి రెడ్డి రాజీనామా చేయరని చెప్పడం ద్వారా వైసీపీ సెల్ఫ్ గోల్ చేసుకున్నదని అభిప్రాయపడ్డారట.

జగన్ వ్యూహం ఫలించలేదు

జగన్ వ్యూహం ఫలించలేదు

జగన్ రాజీనామా ప్రకటన వెనుక అసలు వ్యూహాన్ని నేతలు ప్రజలకు వివరించే విషయంలో విజయవంతమయ్యారని టీడీపీ నేతలు భావించారు. ఇదే విషయాన్ని చంద్రబాబు ఎదుట చెప్పారని తెలుస్తోంది. రాజీనామాల విషయంలో జగన్ వ్యూహం ఫలించలేదని టీడీపీ నేతలు అభిప్రాయపడ్డారు.

 నా పేరు మీద భూముల్లేవు, ఇల్లు లేదు

నా పేరు మీద భూముల్లేవు, ఇల్లు లేదు

హైకోర్టు విభజన చేస్తే తాత్కాలికంగా భవనాలు ఇస్తామని చెప్పామని, గొడవలు పెట్టుకునే ఉద్దేశ్యం తమకు లేదని, తన పేరు మీద భూములు, ఇళ్లు లేవని, తాను సీఎం కాగానే షేర్లను కుటుంబ సభ్యులకు ఇచ్చేశానని చంద్రబాబు భేటీలో చెప్పారు. మనలను ఎవరూ తప్పుపట్టాల్సిన అవసరం లేదని చెప్పారు.

 వడ్డించేవాడు మనవాడైతే అన్నీ వస్తాయి

వడ్డించేవాడు మనవాడైతే అన్నీ వస్తాయి

బీజేపీపై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారని తెలుస్తోంది. వడ్డించేవాడు మనవాడు అయితే చివరలో కూర్చున్నా వస్తుందని, ఇప్పుడు కేంద్రంలో వడ్డించేవారిలో మనవారు ఎవరూ లేరన్నారు. కాపు రిజర్వేషన్లపై కేంద్రాన్ని ఒప్పిస్తామని, కేంద్రం అనుమానాలను బీసీ సంక్షేమ అధికారులు వివరిస్తారని, షెడ్యూల్ 9లో కాపు రిజర్వేషన్ బిల్లు పొందుపర్చాలన్నారు.

అర్ధరాత్రి దాకా చర్చలు జరిపి ప్యాకేజీ ప్రకటించారు

అర్ధరాత్రి దాకా చర్చలు జరిపి ప్యాకేజీ ప్రకటించారు

రాష్ట్రానికి పట్టుబడులు వచ్చే అవకాశముందని, పోలవరంపై అసెంబ్లీలో చర్చ పెడతామంటే అమిత్ షా, అరుణ్ జైట్లీలు అర్ధరాత్రి వరకు చర్చలు జరిపి ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించారని, ట్రాన్స్‌ట్రాయ్ కంపెనీ ఇబ్బందిపెడుతుందని పనులు త్వరగా కావాలని మరో కాంట్రాక్టర్‌ను తెప్పించామన్నారు. అవరోధాలు తొలిగి ఇప్పుడు ప్రాజెక్టు దారిలో పడిందని, పోలవరంపై కోర్టులో నడుస్తున్న కేసులు అందరూ గమనించాలని చెప్పారు. అన్ని వివరాలతో ప్రధానిని కలిసినా బడ్జెట్‌లో ప్రస్తావన లేదన్నారు.

పవన్‌కు చేయిచ్చారు, ఇలా ఇద్దరూ షాక్

పవన్‌కు చేయిచ్చారు, ఇలా ఇద్దరూ షాక్

ఇదిలా ఉండగా, ఏపీకి వచ్చిన నిధుల లెక్కలు చెప్పాలన్న పవన్ కళ్యాణ్‌కు అటు బీజేపీ, ఇటు తెలుగుదేశం షాకిచ్చింది. నిధుల లెక్క ఇవ్వాల్సింది కేంద్రమేనని, రాష్ట్ర ప్రభుత్వం కాదని టీడీపీ చెప్పింది. కావాలంటే వెబ్ సైట్లో వివరాలు ఉంటాయని తెలిపింది. సమాచార హక్కు చట్టం ద్వారా తెలుసుకోవచ్చునని బీజేపీ నేతలు చెబుతున్నారు.

English summary
Telugu Desam Party leaders said in AP CM Nara Chandrababu Naidu meeting that YS Jagan Mohan Reddy resignation threat a political drama.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X