జగన్ రాజమౌళిని కూడా అవమానించారా..? బయటపడ్డ అసలు నిజం
ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఏపీలో ఎన్డీఏ కూటమి ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ ఎన్నికల్లో అధికార వైసీపీ దారుణ ఓటమిని చవి చూసింది. ఆ పార్టీ కేవలం 11 స్థానాలకు మాత్రమే పరిమితం అయి ప్రతిపక్ష హోదా కూడా సాధించలేకపోయింది. జగన్ ఓటమిని ఏపీలో ఉన్న రాజకీయ పార్టీలతో పాటు, యావత్తు సినిమా ఇండస్ట్రీ మొత్తం కూడా కోరుకుంది. జగన్ ప్రభుత్వంలో సినీ ఇండస్ట్రీ అనేక ఇబ్బందులను ఫేస్ చేసిందని పలువురు అభిప్రాయడ్డారు.
ముఖ్యంగా టికెట్ల రేట్ల విషయంలో జగన్ తీసుకున్న నిర్ణయాల వల్ల పెద్ద సినిమాల నిర్మాతలు చాలా ఇబ్బంది పడ్డారు. పైగా మెగాస్టార్ చిరంజీవిని సైతం జగన్ అవమానించారని,చిరంజీవి అంతటి వ్యక్తి కూడా నమస్కారం చేస్తే తిరిగి నమస్కారం పెట్టకుండా చిరునవ్వుతో చూస్తు ఉన్నారని భావించిన సినీ ఇండస్ట్రీ ఎట్టి పరిస్థితుల్లో జగన్ తిరిగి విజయం సాధించకూడదని భావించింది..

దీనిలో భాగంగానే కూటమి నేతలకు బహిరంగంగానే ఇండస్ట్రీకి చెందిన పలువురు తమ మద్దతు ప్రకటించారు. అందరు అనుకున్నట్టే జగన్ ఈ ఎన్నికల్లో ఓడిపోయారు. అయితే తాజాగా మరో విషయం వెలుగులోకి వచ్చింది. దర్శకధీరుడు రాజమౌళిని సైతం జగన్ అవమానించారనే వార్త వైరల్ అవుతోంది. జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తన మాటల ప్రస్థానంలో రాజమౌళి ఎవరో నాకు తెలియదని చెప్పారట, డైరెక్టర్ అంటున్నారు.ఏ సినిమాలు తీశాడని చిరంజీవిని ప్రశ్నించారట.
జగన్ దగ్గరకి సినీ సమస్యల పరిష్కారానికి వచ్చిన సందర్భంలో ఇది జరిగిందని జబర్దస్త్ నటుడు కిర్రాక్ ఆర్పీ ఆరోపించారు. సినీ ఇండస్ట్రీ సమస్యల పరిష్కారానికి సంబంధించి చిరంజీవి నేతృత్యంలో మహేష్ బాబు నాగార్జున, ప్రభాస్, రాజమౌళిలు జగన్‌ను కలిశారు.ఆ సందర్భంలోనే రాజమౌళి ఎవరో తనకు తెలియదని జగన్ చెప్పారని ఆర్పీ ఓ యూట్యూబ్ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్య్వూలో వెల్లడించాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.












Click it and Unblock the Notifications